ఇంటర్నెట్ డెస్క్:వచ్చే ఏడాది జరిగే టీ 20 వరల్డ్‌కప్‌ 2026కు సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ప్రపంచ కప్ ఆడే టీమిండియాకు సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్‌గా, అక్షర్‌ పటేల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మెగా టోర్నీ భారత్, శ్రీలంక వేదికగా జరగనుంది. ప్రపంచ కప్ మ్యాచ్‌లు 7 ఫిబ్రవరి 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 8న జరగనుంది. ఈ టోర్నీలో శుభ్‌మన్ గిల్ కి చోటు దక్కలేదు. భారత గ్రూప్‌ స్టేజిలో తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న యూఎస్‌ఏతో ముంబై వేదికగా ఆడనుంది. ఇదే రోజు పాకిస్థాన్ , నెదర్లాండ్స్ మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. అలానే భారత్ గ్రూప్ స్టేజ్ లో తన చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న నమీబియాతో ఆడనుంది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్థాన్‌ తలపడనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 18న నెదర్లాండ్స్‌తో భారత జట్టు పోటీ పడనుంది. ఫిబ్రవరి 21 నుంచి, మార్చి 1 వరకు సూపర్‌ 8 మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 4న మొదటి సెమీఫైనల్‌, మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరగనుంది.


t20.jpg


శుభ్‌మన్ గిల్ కు షాక్. .దూసుకొచ్చిన ఇషాన్:

టీ20 ప్రపంచ కప్ 2026కు ఆడే భారత జట్టు ఎంపిక విషయంలో ఎవరూ ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. టీ20 భారత జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మన్ గిల్ కు వరల్డ్ కప్ ఆడే జట్టులో స్థానం దక్కలేదు. అలానే సౌతాఫ్రికాతో ఆడిన చివరి మ్యాచ్ లో సంజూ ఓపెనింగ్‌ స్థానం త్యాగం చేయించిన మేనేజ్‌మెంట్‌.. వికెట్‌ కీపర్‌గా జితేశ్‌శర్మకు పెద్ద పీట వేసి లోయర్‌ ఆర్డర్లో ఆడించింది. అయితే, ప్రపంచకప్‌ 2026 జట్టు నుంచి జితేశ్‌ను తప్పించి.. దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా దుమ్ములేపిన ఇషాన్‌ కిషన్‌ను అనూహ్యంగా ఎంపిక చేసింది. అతడిని బ్యాకప్‌ ఓపెనర్‌గా ఉపయోగించుకుంటామని బీసీసీఐ తెలిపింది. అదే విధంగా.. నయా ఫినిషర్‌ రింకూ సింగ్‌ను మేనేజ్‌మెంట్‌ జట్టులోకి ఆహ్వానించింది. మరోసారి వరల్డ్‌కప్‌ జట్టులో భాగమయ్యే అవకాశం అతడికి ఇచ్చింది. ఈసారి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా.. టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనే జట్టును కూడా ప్రకటించడం విశేషం.


భారత జట్టు:

1. సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌)

2. అక్షర్‌ పటేల్‌ ( వైస్‌ కెప్టెన్‌)

3. సంజూశాంసన్‌ (వికెట్ కీపర్)

4. అభిషేక్‌ శర్మ

5. తిలక్‌ వర్మ

6. హార్దిక్‌ పాండ్య

7. శివమ్‌ దూబె

8. రింకు సింగ్‌

9. బుమ్రా

10. అర్షదీప్‌ సింగ్‌

11. హర్షిత్‌ రాణా

12. వాషింగ్టన్‌ సుందర్‌

13. ఇషాన్ కిషన్‌

14. కుల్‌దీప్‌ యాదవ్‌

15. వరుణ్‌ చక్రవర్తి


English Translation

Internet Desk:BCCI has announced the Indian squad for the T20 World Cup 2026 next year. Suryakumar Yadav will be the captain and Akshar Patel will be the vice-captain of the World Cup team India. This mega tournament will be held between India and Sri Lanka. The World Cup matches will start from 7 February 2026. The final match will be held on March 8. Shubman Gill did not get a place in this tournament. India will play its first match in the group stage against USA on February 7 in Mumbai. A match between Pakistan and Netherlands will also be held on the same day. Similarly, India will play its last match in the group stage against Namibia on February 12. R. in Colombo on February 15. Team India and Pakistan will meet at Premadasa Stadium. Later, the Indian team will compete against the Netherlands on February 18. The Super 8 matches will be held from February 21 to March 1. The first semifinal will be held on March 4 and the second semifinal on March 5.


t20.jpg


A shock to Shubman Gill. .Ishan who stormed:

There has been an unexpected twist in the selection of the Indian team for the T20 World Cup 2026. Shubman Gill, who is the vice-captain of the T20 Indian team, did not get a place in the World Cup playing team. Similarly, in the last match played against South Africa, the management sacrificed Sanju's opening position. As a wicket keeper, Jitesh Sharma played in the lower order. However, Jitesh was left out of the World Cup 2026 team and Ishaan Kishan, who rose to fame as Jharkhand's captain and batsman in the Syed Mushtaq Ali Trophy, was exceptionally selected by the country's T20 tournament. BCCI said that they will use him as a backup opener. Similarly.. New finisher Rinku Singh was invited to the management team. It gave him a chance to be a part of the World Cup team once again. This time, BCCI secretary Devjit Saikia participated in the media conference along with Team India T20 captain Suryakumar Yadav and chief selector Ajit Agarkar. It is a privilege that he also announced the team.


Indian team:

1. Suryakumar Yadav (Captain)

2. Akshar Patel (Vice Captain)

3. Sanju Samson (wicket keeper)

4. Abhishek Sharma

5. Tilak Verma

6. Hardik Pandya

7. Shivam Dube

8. Rinku Singh

9. Bumrah

10. Arshadeep Singh

11. Harshit Rana

12. Washington Sundar 13. Ishan Kishan

14. Kuldeep Yadav

15. Varun Chakraborty