హైదరాబాద్, ఇంటర్నెట్ డెస్క్:నేటి కాలంలో సైబర్ కేటుగాళ్ల చోరీలు ఎక్కువయ్యాయి. వివిధ మార్గాల్లో ప్రజలను మోసం చేసి.. కోట్ల రూపాయాలు దోచుకుంటున్నారు. నిరక్ష్యరాసుల నుంచి డాక్టర్లు, ఇంజినీర్లు వంటి చదువుకున్న అనేక మంది విద్యావంతులు కూడా వీరి ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడి పోతున్నారు. అమ్మాయిలను ఎరగా వేసి... కోట్లాది రూపాయలను చోరీ చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్(Hyderabad cyber crime) కు చెందిన డాక్టర్ నుంచి రూ.14 కోట్లు సైబర్ కేటుగాళ్లు కొట్టేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో సదరు వైద్యుడిని బురిడీ కొట్టించారు. తొలుత ఫేస్ బుక్ ద్వారా అందమైన అమ్మాయి ఫొటోలతో డాక్టర్‌కు మెసేజ్ చేశారు. ఫేస్ బుక్ ద్వారా సదరు లేడీ.. తాను ఒక ఒంటరి మహిళలని కంపెనీలో పని చేస్తానని పరిచయం చేసుకుంది. ఆ తర్వాత కొన్ని రోజులకు స్టాక్ మార్కెట్లో ద్వారా తమ కంపెనీలో పెట్టుబుడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది.
ఆ మహిళ మాటలు నమ్మిన వైద్యుడు.. తన ఇల్లును అమ్మి రూ.14 కోట్లు స్టాక్ మార్కెట్లో పెట్టాడు. ఆ తర్వాత మహిళ నుంచి స్పందన రాకపోవడంతో తాను మోసపోయినట్లు వైద్యుడు(doctor cheated 14 crore) తెలుసుకున్నాడు. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు డాక్టర్ ను కాంబోడియా నుంచి ట్రాప్ చేసి మోసం చేసినట్లు గుర్తించారు. కాంబోడియాలో తిష్ట వేసిన చైనీయులే ఈ వ్యవహారం వెనకాల ఉన్నారని, ఇండియా నుంచి ఉద్యోగాల పేరుతో యువకుల్ని తీసుకువెళ్లి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. కాంబోడియాలో ఉన్న సైబర్ నేరగాలకు mule అకౌంట్స్ అందించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. mule అకౌంట్ లోకి వచ్చిన డబ్బుల్ని వివిధ మార్గాల ద్వారా కాంబోడియాకి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
English Translation
Hyderabad, Internet Desk:In today's times, thefts by cyber criminals have increased. They are deceiving people in various ways and looting crores of rupees. Many educated people like doctors and engineers are also trapped in their trap and are dying. They are stealing crores of rupees by taking girls as bait. Recently, a doctor from Hyderabad (Hyderabad cyber crime) was robbed of Rs. 14 crore by cyber criminals. In the name of investing in the stock market, the said doctor was bullied. At first, he messaged the doctor with photos of a beautiful girl through Facebook. Through Facebook, the lady in question introduced herself as a single woman working in a company. After that, she believed that if she invests in her company through the stock market for a few days, she will get high profits.
Believing the woman's words, the doctor sold his house and invested Rs.14 crores in the stock market. After that, the doctor came to know that he was cheated (doctor cheated 14 crore) as he did not get any response from the woman. He immediately filed a complaint with the cyber crime police. The police investigated and found that the doctor was trapped and cheated from Cambodia. ACP Prasad said that it is the Chinese who are behind this case who have set up evil in Cambodia and they are taking young people from India and forcing them to commit cyber crimes in the name of jobs. Police have arrested four people who provided mule accounts to cybercriminals based in Cambodia. The police found that the money received in the mule account was transferred to Cambodia through various channels.