Lionel Messi: భారత్‌ పర్యటన కోసం.. మెస్సికి రూ.89 కోట్లు!

Eenadu icon
By National News Team Published : 20 Dec 2025 19:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: లియోనెల్‌ మెస్సి (Lionel Messi) భారత పర్యటన సందర్భంగా కోల్‌కతా స్టేడియంలో చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో అరెస్టై.. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఈవెంట్‌ నిర్వాహకుడు శతాద్రు దత్తాను ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారిస్తోంది. స్డేడియంలోకి రాగానే అనేకమంది తాకడం, కౌగిలించుకోవడం పట్ల మెస్సి అసౌకర్యానికి గురయ్యాడని, దీంతో నిర్దేశించుకున్న సమయం కన్నా ముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడని విచారణలో శతాద్రు చెప్పినట్లు సిట్‌ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా ఈ పర్యటన ఖర్చు, మెస్సికి చెల్లించిన నగదు వివరాలు తెలియజేసినట్లు తెలిసింది.

కౌగిలింతలతో చిరాకు..

‘‘గ్రౌండ్‌లో ఉన్న సమయంలో కొందరు వీపును తాకడం, కౌగిలించుకోవడంతో మెస్సి అసౌకర్యానికి గురయ్యాడు. దీనిపై ఆయనకు రక్షణగా ఉన్న విదేశీ భద్రతా అధికారులు ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు. జనసమూహాన్ని అదుపుచేయాలని పదే పదే ప్రకటించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయన్ను చుట్టుముట్టి, ఆలింగనం చేసుకున్న విధానం ఆమోదయోగ్యం కాదు’’ అని దర్యాప్తు అధికారులకు శతాద్రు దత్తా చెప్పినట్లు తెలిసింది. గ్రౌండ్‌లోకి వచ్చేందుకు 150 పాసులను మాత్రమే ఇచ్చినప్పటికీ.. అంతకుమించి మూడింతల మంది అక్కడకు రావడంతో పరిస్థితి చేజారిందని చెప్పినట్లు సమాచారం.

మెస్సికి రూ.89 కోట్లు..

‘‘ఈ టూర్‌ కోసం మెస్సికి రూ.89కోట్లు చెల్లించగా.. ఇందులో భారత ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్నుగా చెల్లించాం’’ అని శతాద్రు పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. ఈ పర్యటన మొత్తం ఖర్చు రూ.100 కోట్లు కాగా.. ఇందులో 30శాతం నిధులను స్పాన్సర్ల నుంచి, మరో 30శాతం టికెట్ల అమ్మకాల ద్వారా సేకరించామని చెప్పినట్లు సమాచారం. శతాద్రుకు సంబంధించి ఇటీవల ఫ్రీజ్‌ చేసిన అకౌంట్లలో రూ.20 కోట్లు ఉన్నట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఇవి కోల్‌కతా, హైదరాబాద్‌ ఈవెంట్ల టికెట్ల అమ్మకాలు, స్పాన్సర్ల నుంచి సేకరించినవని ఈవెంట్‌ నిర్వాహకుడు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్‌ 19న దత్తా ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.

మంత్రి అత్యుత్సాహంతోనే..

మెస్సి కోల్‌కతాలోని సాల్ట్‌ లేక్‌ స్టేడియానికి వచ్చినప్పటి నుంచి ఆ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అరూప్‌ బిస్వాస్‌ అతడితోనే సన్నిహితంగా మెలిగాడు. మెస్సి నడుముపై చేయి వేసి ఫొటోలకు పోజులిచ్చిన వీడియోలు వైరల్‌గా మారాయి. అంతేకాదు పలుకుబడి ఉపయోగించి ఆయన కుటుంబ సభ్యులు, పరిచయస్తులను మెస్సి దగ్గరకు తీసుకువచ్చినట్లు తెలిసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అరూప్‌ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • హిమంత బిశ్వశర్మ ‘అస్సాం జిన్నా’: గౌరవ్‌ గొగొయ్‌ Assam: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను ఉద్దేశిస్తూ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్‌ గొగొయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
  • వధువుపై నోట్ల వర్షం..పెళ్లిలో రూ.8.5 కోట్లు వెదజల్లారా..? ఇటీవల పంజాబ్‌లో జరిగిన ఓ వివాహంలో వధువుపై కోట్ల రూపాయలతో నోట్ల వర్షం కురిపించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
  • ఉద్యోగులకు సర్‌ప్రైజ్‌.. రూ.20 కోట్లతో కాస్ట్‌లీ కార్లు గిఫ్ట్‌..! HiLITE Group: తమ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు ఓ కంపెనీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.
  • చైనా రోబోడాగ్‌ వివాదం.. ఏఐ సదస్సు నుంచి ఆ యూనివర్సిటీ గెంటివేత Chinese Robot Dogs Row: యూపీ విశ్వవిద్యాలయం నిర్వాకంపై కేంద్రం సీరియస్ అయింది. 
  • జాతీయ భద్రతకు రాహుల్ గాంధీ ప్రమాదకరం: రిజిజు రాహుల్‌ గాంధీకి భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు ఆరోపించారు.
  • రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో రెండు స్థానాలకు.. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 10 రాష్ట్రాల్లోని 37 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తికాబోతోంది.
  • కదులుతున్న వాహనాల డోర్లు తీస్తూ.. బైకర్‌ ప్రమాదకర స్టంట్లు రోడ్డుపై కదులుతున్న వాహనాల డోర్లను తీస్తూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన బైకర్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
  • కునో పార్కులో మూడు కూనలకు జన్మనిచ్చిన చీతా Cheetah: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కు (Kuno National Park)లో ‘గామిని’ అనే దక్షిణాఫ్రికా చీతా మూడు కూనలకు జన్మనిచ్చింది.
  • సరిహద్దుల్లో ‘ఏఐ’తో చైనా కుట్రలు భగ్నం.. ఆర్మీ అధికారి Army-AI: దేశ రక్షణ రంగంలో కృత్రిమ మేధ కీలకంగా మారుతోందని స్ట్రాటజిక్‌ ఫోర్సెస్‌ కమాండ్‌ ఇన్ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ దినేశ్‌ సింగ్‌ రానా తెలిపారు.
  • రఫేల్‌లో 50% దేశీయ తయారీ పరికరాలు ఉండాలి : రాజ్‌నాథ్‌ సింగ్‌ Rafale jets: రఫేల్ ఫైటర్ జెట్‌లో 50 శాతం దేశీయ తయారీ పరికరాలు ఉండేలా చూడాలని ఫ్రాన్స్‌ను కోరారు.
  • తప్పు జరిగింది.. క్షమించండి: దిల్లీలో కారు ప్రమాదానికి కారణమైన బాలుడి తండ్రి Delhi: దిల్లీలో మైనర్‌ బాలుడు నిర్లక్ష్యంగా కారు నడిపి.. ఓ వ్యక్తి మృతికి కారణమైన సంగతి తెలిసిందే. దీనిపై బాలుడి తండ్రి స్పందిస్తూ.. మృతుని కుటుంబానికి క్షమాపణలు తెలిపారు.
  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.

English Translation

Lionel Messi: Rs.89 Crores for Messi to visit India!

Eenadu icon
By National News Team Published : 20 Dec 2025 19:40 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Internet Desk: Lionel Messi India The investigation into the incidents that took place at the Kolkata Stadium during the tour is ongoing. Arrested in this case, the organizer of the event, Shatadu Dutta, who is currently in custody, is being interrogated by the Special Investigation Team (SIT). SIT sources revealed that Shadaru said during the investigation that Messi was uncomfortable with being touched and hugged by many people when he entered the stadium, so he left before the scheduled time. Besides, it is known that the details of the cost of this trip and the cash paid to Messi have been informed.

Hugging annoyance..

''Messi felt uncomfortable when some people touched his back and hugged him while on the ground. The foreign security officials who are protecting him have expressed their concern in advance. Despite repeated announcements to control the crowd, there was no result. The manner in which he was surrounded and embraced was not acceptable,'' Shatadru Dutta is reported to have told the investigating officers. Even though only 150 passes were given to enter the ground, it is reported that the situation worsened as more than three times more people came there.

Rs.89 crores for Messi..

''We paid Rs.89 crores to Messi for this tour...of which we paid Rs.11 crores as tax to the Indian government'' Shadaru revealed to the police. It is known. The total cost of this trip is Rs.100 crores. It is reported that 30 percent of the funds have been collected from sponsors and another 30 percent through ticket sales. The SIT officials found Rs.20 crore in the recently frozen accounts related to Shatadru. Related sources revealed that the organizer of the event said that these were collected from ticket sales and sponsors of Kolkata and Hyderabad events. It is known that the officials who searched Dutta's house on December 19 seized many documents.

The minister was enthusiastic..

Since Messi arrived at the Salt Lake Stadium in Kolkata, he became close with the Sports Minister of that state, Arup Biswas. Videos of Messi posing for photos with his hand on his waist have gone viral. Moreover, it is known that he used his reputation to bring his family members and acquaintances to Messi. Arup had to resign from his post due to severe criticism.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Himanta Biswasharma 'Assam Jinnah': Gaurav Gogoi Assam: Congress state president Gaurav Gogoi made harsh comments addressing Assam Chief Minister Himanta Biswasharma. Recently, a video of a bride showering crores of rupees on a wedding in Punjab has gone viral on social media. 
  • Surprise for employees.. Costly cars gifted with Rs.20 crores..! HiLITE Group: A company gave a great surprise to the employees who played a key role in the development of their company.
  • China Robodog controversy.. The university was expelled from the AI conference. Chinese Robot Dogs Row: Center gets serious about UP University administration. 
  • Rahul Gandhi is dangerous to national security: Rijiju Union Minister Kiran Rijiju has accused Rahul Gandhi of having links with anti-Indian forces. The tenure of 37 Rajya Sabha members in 10 states is going to end in April this year. Taking the doors of vehicles moving on the road.. Delhi Police has arrested a biker who terrorized passengers. 
  • Cheetah who gave birth to three cubs in Kuno Park Cheetah: A South African cheetah named 'Gamini' gave birth to three cubs in the Kuno National Park of Madhya Pradesh. Army-AI: Strategic Forces Command-in-Chief Lt. Gen. Dinesh Singh Rana said that artificial intelligence is becoming crucial in the field of national defense.
  • Rahale should have 50% indigenously manufactured equipment: Rajnath Singh Rafale jets: France asked to ensure 50 per cent indigenous components in Rafale fighter jets Delhi: It is known that a minor boy drove a car carelessly in Delhi and caused the death of a person. In response to this, the boy's father apologized to the deceased's family. Tourists were spotted by a group of dolphins on the Konkan coast of Sindhudurg district in Maharashtra.
  • If you search for the doctor's phone number on Google, the account is empty. Cyber crooks are constantly hacking people's accounts in new ways. Another incident came to light in Shahdol district of Madhya Pradesh.
  • INS Krishna water entry. Navy sources said on Tuesday that the first indigenous Cadet Training Ship (CTS) INS Krishna has entered the water. The event was held at the Larson and Toubro yard at Kattupally, Chennai.
  • A helicopter assembly unit in Karnataka. India's first private helicopter assembly unit 'Final Assembly Line' (FAL) at Vemagal in Kolaru district of Karnataka was inaugurated virtually from Mumbai on Tuesday by Prime Minister Narendra Modi and French President Emmanuel Macron. Union Minister of State for Communications Pemmasani Chandrasekhar said that the number of broadband users in the country has increased from six crore to one hundred crore in the last ten years. It is possible to cross this great milestone between 2014-2025.
  • Largest labor hospital in Sriperumbudur Finance Minister Thangam Thennarasu has announced that the country's largest hospital for workers will be built at Sriperumbudur in Kancheepuram district of Tamil Nadu. 706 crores have been allocated for the construction of this 18,720-bed hospital.
  • Partnership with France is now special. India-France have decided to elevate their ties to the level of a 'Special Global Strategic Partnership'.
  • Use of AI in petitions is a concern The Supreme Court has expressed deep concern over the prevailing attitude among lawyers to present petitions prepared with the help of artificial intelligence tools to the courts. Senior Congress leader Mani Shankar Iyer opined that if the Congress is in a situation where dissent cannot be tolerated, it will lead to the destruction of the party.