BJP on Rahul gandhi: దేశ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారా?.. రాహుల్‌ విదేశీ పర్యటనపై భాజపా

Eenadu icon
By National News Team Updated : 20 Dec 2025 20:52 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

BJP on Rahul gandhi | దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ జర్మనీ పర్యటనపై భారతీయ జనతా పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. విదేశీ పర్యటనలో దేశ వ్యతిరేక శక్తులతో ఆయన చేతులు కలుపుతున్నారని ఆరోపించింది. దేశానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టింది. అమెరికాకు చెందిన బిలియనీర్‌ జార్జ్‌ సోరోస్‌ రాహుల్‌కు సంబంధాలు ఉన్నాయనంటూ మరోసారి ఆరోపించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు.

‘‘విదేశీ గడ్డపై దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్‌ గాంధీ చేతులు కలుపుతున్నారు. రాహుల్‌ గాంధీ, జార్జ్‌ సోరోస్‌ పేరుకే ఇద్దరు వ్యక్తులు. కానీ, వారి ఆత్మ ఒక్కటే’’ అని భాటియా వ్యాఖ్యానించారు. జర్మనీ పర్యటనలో బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్‌ ప్రెసిడెంట్‌ కార్నిలియా వోల్‌తో రాహుల్‌ గాంధీ భేటీ అయిన ఫొటోను ఈ సందర్భంగా మీడియాకు చూపించారు. భారత వ్యతిరేక శక్తులతో రాహుల్‌ చేతులు కలుపుతున్నారనడానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు. జార్జ్‌ సోరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ నిర్వహిస్తున్న సెంట్రల్‌ యూరోపియన్‌ యూనివర్సిటీకి ఆమె ట్రస్టీ అని భాటియా పేర్కొన్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు, సమావేశాల సమయంలో రాహుల్‌ గాంధీ ఇలా తరచూ విదేశీ పర్యటనలు చేయడం కొత్తేమి కాదన్నారు. తన పర్యటనలో భారత్‌ పట్ల ద్వేషం, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నే వ్యక్తులతో భేటీ అవుతుంటారని ఆరోపించారు.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 20:03 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం తొలి స్వదేశీ కేడెట్‌ శిక్షణ నౌక (సీటీఎస్‌) ఐఎన్‌ఎస్‌ కృష్ణ జలప్రవేశం చేసినట్టు నేవీ వర్గాలు మంగళవారం తెలిపాయి. చెన్నైలోని కట్టుపల్లి వద్ద లార్సన్‌ అండ్‌ టుబ్రో యార్డులో ఈ కార్యక్రమం జరిగినట్లు వెల్లడించాయి.
  • కర్ణాటకలో హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ కర్ణాటకలోని కోలారు జిల్లా వేమగల్‌లో భారత తొలి ప్రైవేటురంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ‘ఫైనల్‌ అసెంబ్లీ లైన్‌’ (ఎఫ్‌ఏఎల్‌)ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో కలిసి ముంబయి నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు.
  • నూరుకోట్లకు బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య దేశంలో బ్రాడ్‌ బ్యాండ్‌ వినియోగదారుల సంఖ్య గత పదేళ్లలో ఆరు కోట్ల నుంచి వంద కోట్లకు చేరిందని కేంద్ర కమ్యూనికేషన్లశాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. 2014-2025 మధ్యకాలంలో ఈ గొప్ప మైలురాయిని దాటడం సాధ్యమైందని చెప్పారు.
  • శ్రీపెరుంబుదూర్‌లో అతిపెద్ద కార్మిక ఆసుపత్రి తమిళనాడులోని కాంచీపురం జిల్లా శ్రీపెరుంబుదూర్‌లో కార్మికుల కోసం దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి తంగం తెన్నరసు ప్రకటించారు. 18,720 పడకల ఈ ఆసుపత్రి నిర్మాణానికి రూ.706 కోట్లు కేటాయించారు.
  • ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం ఇక ప్రత్యేకం తమ మధ్య సంబంధాలను ‘ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచాలని భారత్‌-ఫ్రాన్స్‌ నిర్ణయించాయి.
  • పిటిషన్లలో ఏఐ వినియోగం ఆందోళనకరం కృత్రిమ మేధ సాధనాల సాయంతో రూపొందించిన పిటిషన్లను న్యాయస్థానాలకు సమర్పించే వైఖరి న్యాయవాదుల్లో ప్రబలడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
  • కొంకణ్‌ తీర పర్యాటకులకు డాల్ఫిన్ల గుంపు కనువిందు మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌ జిల్లా పరిధిలో గల కొంకణ్‌ తీరంలో పర్యాటకులకు డాల్ఫిన్లు గుంపుగా కనిపించి కనువిందు చేశాయి.
  • వైద్యుడి ఫోన్‌ నంబరు కోసం గూగుల్‌లో వెదికితే.. ఖాతా ఖాళీ సైబర్‌ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో ప్రజల ఖాతాలను గుల్ల చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లాలో మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది.
  • కాంగ్రెస్‌ మనుగడకు మూలం అసమ్మతే అసమ్మతిని సహించలేని పరిస్థితిలో కాంగ్రెస్‌ ఉంటే అది ఆ పార్టీ వినాశనానికే దారి తీస్తుందని సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్‌ అభిప్రాయపడ్డారు.
  • అదో తుగ్లకీయ కమిషన్‌ ఎన్నికల సంఘం ‘‘తుగ్లకీయ కమిషన్‌’’లా వ్యవహరిస్తోందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఆరోపించారు.
  • బెంగాల్, తమిళనాడుల్లో ఏప్రిల్‌లో ఎన్నికలు! నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అధికారులు మంగళవారం వెల్లడించారు.
  • రైళ్ల మరుగుదొడ్లలో జెట్‌ స్ప్రేలు రైలు బోగీల్లోని మరుగుదొడ్లలో కొళాయి, చైన్‌తో కూడిన స్టీలు మగ్గుల స్థానంలో జెట్‌ స్ప్రేలు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
  • ఆసక్తికరమైన ఏఐ ప్రాజెక్టులు ప్రదర్శించిన ఎల్‌పీయూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఇండియా-ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పోలో లవ్లీ ప్రొఫెషనల్‌ విశ్వవిద్యాలయ (ఎల్‌పీయూ) ప్రాజెక్టులు అందరి మన్ననలు పొందాయని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
  • మాకు పెన్షన్లు వద్దు శ్రీలంక చట్టసభ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీకాలం ముగిశాక పెన్షన్లు తీసుకోరాదని నిర్ణయించారు.
  • కె2 విటమిన్‌తో ఎముకలు బలోపేతం డి విటమిన్‌ క్రియాశీల రూపమైన కాల్సిట్రియోల్‌గా మారేందుకు మెగ్నీషియం చాలా అవసరం.
  • గేట్స్‌ హాజరుపై సందిగ్ధం! ఏఐ సమిట్‌కు బిల్‌ గేట్స్‌ హాజరవుతారా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఆయన హాజరుకాబోవడం లేదని తొలుత ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
  • చదరపు మీటరు ఉష్ణమండల అడవితో ఏటా 240 లీటర్ల వర్షపాతం ఉష్ణమండల ప్రాంతాల్లో ప్రతి చదరపు మీటరు అడవి వల్ల ఏటా దాదాపు 240 లీటర్ల వర్షపునీరు లభ్యమవుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
  • బైకర్‌ను ఢీకొన్న కారు.. వైరల్‌గా మారిన వీడియో దేశరాజధాని దిల్లీలో ఒక మైనర్‌ బాలుడు(17) తన స్కార్పియో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి బైక్‌పై ప్రయాణిస్తున్న 23 ఏళ్ల సాహిల్‌ ధానేశ్ర అనే వ్యక్తి మృతికి కారణమయ్యాడు.
  • కేంద్ర మంత్రి పురీ రాజీనామా చేయాలి: కాంగ్రెస్‌ జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఫైళ్ల వ్యవహారంపై కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ వరుసబెట్టి అబద్ధాలాడుతున్నారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండు చేసింది.
  • వనవటు దేశమా.. అలాంటిదేదీ లేదే!: సుప్రీం వనవటు అనే దేశమేదీ లేదే అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.