GhostPairing: ఘోస్ట్ పెయిరింగ్.. వాట్సప్‌లో ఈ మెసేజ్ వచ్చిందా?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్‌డెస్క్: ఈ టెక్ యుగంలో ఎప్పటికప్పుడు కొత్త పంథాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో వాట్సప్ యూజర్లే లక్ష్యంగా కొత్త తరహా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. డివైజ్ లింకింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, యూజర్ ఖాతాల్లోకి చొరబడుతున్నారు. దీనిని టెక్ నిపుణులు ఘోస్ట్ పెయిరింగ్ అని పిలుస్తున్నారు (Ghost Pairing). పాస్‌వర్డ్స్, వెరిఫికేషన్ కోడ్స్, సిమ్ కార్డ్స్ వివరాలు చోరీ చేయాల్సిన పని లేకుండానే స్కామర్లు తమ పని కానిస్తున్నారని హెచ్చరించారు.
ఈ ఘోస్ట్ పెయిరింగ్‌లో సోషల్ ఇంజినీరింగ్‌ది కీలక పాత్ర. దానిద్వారా యూజర్ వాట్సప్.. మోసపూరిత డివైజ్‌తో అనుసంధానం అయ్యేలా స్కామర్లు బురిడీ కొట్టిస్తుంటారు (WhatsApp scam). ఈ మోసాన్ని గుర్తించడం కష్టం. మనకు తెలిసిన కాంటాక్ట్‌ల నుంచి ‘Hey, I just found your photo!’ వంటి సందేశంతో ఈ స్కామ్ మొదలవుతుంది. సందేశంలో అంతర్లీనంగా లింక్ ఉంటుంది. ఆ తర్వాత ఫేస్‌బుక్ ఫొటో వ్యూయర్ తలపించే నకిలీ వెబ్‌పేజ్ డిస్‌ప్లే అవుతుంది. అందులోని కంటెంట్ చూడాలంటే తొలుత వెరిఫై చేయాల్సి ఉంటుంది. మనకు పైకి ఇలా కనిపిస్తున్నా.. అంతర్లీనంగా డివైజ్ పెయిరింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అప్పుడే ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలని యూజర్‌కు రిక్వెస్ట్ వస్తుంది.
- మీ ఖాతా ఎవరు వాడుతున్నారు?
దాని తర్వాత న్యూమరిక్ పెయిరింగ్ కోడ్‌ను వాట్సప్ జనరేట్ చేస్తుంది. ఈ కోడ్‌ను వాట్సప్ ( Whatsapp)లో ఎంటర్ చేయాలని నకిలీ పేజ్‌లో ఒక సూచన కనిపిస్తుంది. ఇదంతా భద్రతా తనిఖీల్లో భాగమని పేర్కొంటుంది. ఇక ఈ కోడ్‌ను ఎంటర్ చేయగానే మనకు తెలియకుండానే స్కామర్ డివైజ్‌తో అనుసంధానం అవుతాం. దీంతో వాట్సప్ వెబ్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్లిపోతుంది. బాధితుడి మెసేజ్‌లు అన్ని చదివేస్తాడు. యూజర్ పంపినట్టుగా ఇతరులకు సందేశాలు పంపుతాడు. ఈ ఉల్లంఘన అంతా తెలియకుండానే జరిగిపోతుంటుంది.
ఈ ఘోస్ట్ పెయిరింగ్‌ను తొలుత చెక్ రిపబ్లిక్‌లో గుర్తించారు. ఇది ఇక్కడితో ఆగకపోవచ్చని నిపుణులు హెచ్చరించారు. ఇప్పటికే హ్యాకర్ల చేతిలో చిక్కిన ఖాతాలను ఉపయోగించి, కాంటాక్ట్‌లు, గ్రూప్ చాట్‌లకు ఆ మోసపూరిత లింక్‌లను పంపే అవకాశం ఉందని పేర్కొన్నారు. లింక్డ్ డివైజ్‌ను యూజర్ మాన్యువల్‌గా తొలగించేవరకు అది యాక్టివ్‌గానే ఉంటుంది. యూజర్ దానిని గుర్తించేవరకు ఉల్లంఘనకు గురవుతూనే ఉంటారు. ఘోస్ట్ పెయిరింగ్ వంటి కేసుల్లో సాఫ్ట్‌వేర్ లోపాల కంటే మనుషుల విశ్వాసం, భయం, అవసరం వంటి మానసిక ప్రవర్తనను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడతారని నిపుణులు హెచ్చరించారు. ఇందుకోసం మనుషుల ప్రవర్తనను స్కామర్లు అర్థం చేసుకుంటారు. దానిద్వారా యూజర్ రహస్య సమాచారాన్నిబహిర్గతం చేసేలా మభ్యపెడతారు. దీనినే సోషల్ ఇంజినీరింగ్‌గా చెప్తారు.
ఇలాంటి స్కామ్‌లకు చిక్కకూడదంటే..?
- ఎప్పటికప్పుడు వాట్సప్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లి లింక్డ్ డివైజ్ ఆప్షన్‌ను పరిశీలించుకోవాలి. ఏవైనా తెలియని డివైజ్‌లు లింక్ అయి ఉన్నాయోమో గమనించుకోవాలి.
- స్కాన్ క్యూఆర్ కోడ్ లేక ఎంటర్ పెయిరింగ్ కోడ్స్ వంటి అభ్యర్థనలపై అప్రమత్తంగా ఉండాలి.
- తెలిసిన కాంటాక్ట్‌ల నుంచి వచ్చిన సందేశాలనైనా జాగ్రత్తగా ధ్రువీకరించుకోవాలి. అలాగే అదనపు భద్రత కోసం టూ స్టెప్ వెరిఫికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- తొలి ట్రిలియనీర్‌గా మస్క్? రికార్డు దిశగా కుబేరుడు Elon Musk: ఈ ఏడాదిలో మస్క్ ట్రిలియనీర్‌గా మారే అవకాశం ఉంది.
- చలామణిలో రూ.40 లక్షల కోట్ల నగదు దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవం కొనసాగుతున్నా, ప్రజల చేతుల్లో నగదు వినియోగమూ అదే స్థాయిలో పెరుగుతోంది.
- ఉద్యోగం ఉండాలంటే ఏఐ టూల్స్ నేర్చుకోండి కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళన చెందుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు భరోసానిచ్చే సలహాను టెక్ పరిశ్రమ దిగ్గజాలు సూచిస్తున్నారు. ‘ప్రశాంతంగా ఉండండి, నైపుణ్యాలు పెంచుకోండి’ అని తెలిపారు.
- మన వ్యవసాయ రంగానికి రూ.36 లక్షల కోట్ల అవకాశాలు అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ)తో కుదిరిన వాణిజ్య ఒప్పందాల కారణంగా, భారత వ్యవసాయ రంగానికి 400 బి. డాలర్ల (దాదాపు రూ.36 లక్షల కోట్ల) అవకాశాలు లభించగలవని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
- రాణించిన బ్యాంకింగ్, విద్యుత్ షేర్లు విద్యుత్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్ల రాణింపుతో సోమవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అమెరికా- ఇరాన్ చర్చల ప్రభావంతో, అంతర్జాతీయంగా చమురు ధరలు సానుకూలంగా కదలాడటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసింది.
- 2035కు రూ.215 లక్షల కోట్ల రిటెయిల్ విపణి మన దేశ భారత రిటెయిల్ రంగ విపణి పరిమాణం 2035 నాటికి రూ.210-215 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ఓ నివేదిక తెలిపింది. 2025లోని రూ.90- 95 లక్షల కోట్ల స్థాయితో పోలిస్తే, ఈ విలువ రెట్టింపు కంటే ఎక్కువ.
- టోకు ధరలూ పెరిగాయ్ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా మూడో నెలా పెరిగి, జనవరిలో 1.18 శాతంగా నమోదైంది. ఆహార, ఆహారేతర ఉత్పత్తులు, తయారీ వస్తువులు ప్రియం కావడం ఇందుకు కారణం.
- స్నాప్‌డీల్‌పై రూ.5 లక్షల జరిమానా భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) ధ్రువీకరణకు అనుగుణంగా లేని బొమ్మలు విక్రయించినందుకు, 2020 టాయ్స్ (నాణ్యతా నియంత్రణ) ఆర్డర్‌ను ఉల్లంఘించినందుకు..
- వేణుగోపాల్ ధూత్ సహా 12 సంస్థలకు దిల్లీ న్యాయస్థానం నోటీసులు మొజాంబిక్‌లోని కంపెనీ చమురు-గ్యాస్ ఆస్తులకు నిధులు సమకూర్చడంలో భాగంగా రూ.61,700 కోట్ల బ్యాంకు రుణ మోసానికి పాల్పడిన వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, ఆ గ్రూప్ అనుబంధ డజను సంస్థలకు దిల్లీ న్యాయస్థానం..
- నేడు ఈడీ ముందుకు టీనా అంబానీ! మనీలాండరింగ్ కేసు వ్యవహారంలో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందుకు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీ భార్య, మాజీ నటి టీనా అంబానీ హాజరయ్యే అవకాశం ఉంది.
- సంక్షిప్త వార్తలు (9) జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఈ ఏడాది 4 కొత్త మోడళ్లను ఆవిష్కరించాలని యోచిస్తోంది. వాటిలో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎస్‌యూవీ కూడా ఉంది.
English Translation
GhostPairing: Ghost Pairing.. Did you get this message on WhatsApp?

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet Desk: In this age of tech, cybercriminals are emerging in new ways all the time. In this background, a new type of fraud targeting WhatsApp users has come to light. Device Linking feature is misused and user accounts are infiltrated. Tech experts call it Ghost Pairing. He warned that the scammers are doing their work without stealing the details of passwords, verification codes and SIM cards.
Social engineering plays a key role in this ghost pairing. Scammers trick the user to connect with a fraudulent device through WhatsApp (WhatsApp scam). This fraud is difficult to detect. This scam starts with a message like 'Hey, I just found your photo!' from known contacts. A link is embedded in the message. After that, a fake webpage will be displayed that resembles the Facebook photo viewer. In order to see its content, you have to verify it first. Although it looks like this on the surface.. the device pairing process starts internally. Then the user will get a request to enter the phone number.
- Who is using your account?
After that WhatsApp will generate a numeric pairing code. The fake page will show an instruction to enter this code on WhatsApp ( Whatsapp). It states that this is all part of the security checks. After entering this code, we will connect with the scammer device without our knowledge. With this, the entire WhatsApp web access goes into the hands of the hacker. Reads all the victim's messages. Sends messages to others as sent by the user. All this violation is done unconsciously.
This ghost pairing was first spotted in the Czech Republic. Experts warn that it may not stop here. It is mentioned that there is a possibility of sending those fraudulent links to contacts and group chats using accounts already caught in the hands of hackers. A linked device remains active until the user manually removes it. The user remains infringed until they recognize it. Experts have warned that in cases like ghost pairing, attacks are targeted at psychological behavior like trust, fear and need of people rather than software errors. Scammers understand human behavior for this. It tricks the user into revealing confidential information. This is called social engineering.
If you don't want to get caught in such scams..?
- Sometimes you should go to the settings in WhatsApp and check the linked device option. Note that any unknown devices are linked.
- Be alert to requests such as scan QR code or enter pairing codes.
- Check any messages from known contacts carefully. Also enable two step verification for added security. href="https://x.com/eenadulivenews/" target="_blank" rel="noopener">Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 13:05 IST
- Musk as the first trillionaire? Kubera towards the record Elon Musk: Musk is likely to become a trillionaire this year.
- Rs.40 lakh crore cash in circulation Even as the digital payments revolution continues in the country, the use of cash in the hands of people is increasing at the same rate.
- Learn AI tools for employment. Tech industry giants offer reassuring advice to software workers worried about job losses due to artificial intelligence (AI). He said, 'Keep calm, improve your skills.'
- Rs. 36 lakh crore opportunities for our agriculture sector. A senior central government official has claimed that due to the trade agreements signed with the US and the European Union (EU), India's agriculture sector will get $400 billion (about Rs. 36 lakh crore) opportunities. The stock market ended with gains on Monday due to the performance of power, banking and financial sector shares. Due to the effect of US-Iran talks, the positive movement of international oil prices has strengthened the market sentiment.
- Rs. 215 lakh crore retail market by 2035 According to a report, the market size of our country's Indian retail sector is likely to reach Rs.210-215 lakh crores by 2035. Compared to the level of Rs.90-95 lakh crore in 2025, this value is more than double.
- Wholesale prices have also increased. Inflation based on the Wholesale Price Index (WPI) rose for the third month in a row and was recorded at 1.18 percent in January. The reason for this is that food, non-food products and manufactured goods are dear.
- Rs 5 lakh fine on Snapdeal Delhi court issues notices to 12 firms, including Venugopal Dhoot, for violating the Toys (Quality Control) Order, 2020, for selling toys that do not conform to the certification of the Board of Indian Standards (BIS). Videocon group promoter Venugopal Dhoot, who committed a Rs 61,700 crore bank loan fraud as part of financing the company's oil and gas assets in Mozambique, and a dozen of the group's affiliates, will be brought before the Delhi court..
- Today Tina Ambani before the ED! Former actress Tina Ambani, wife of Reliance Group Chairman Anil Ambani, is likely to appear before the Enforcement Directorate (ED) on Tuesday in connection with the money laundering case.
- Brief News (9) JSW MG Motor India plans to launch 4 new models this year. Among them is a plug-in hybrid SUV.
Note:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.