Andhra King Taluka OTT: ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (Andhra King Taluka). ఓ అభిమాని కథగా ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ నెట్‌ఫ్లిక్స్ ( Netflix) అధికారిక ప్రకటన విడుదల చేసింది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. మహేశ్‌బాబు.పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర, యువ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే కీలక పాత్రల్లో నటించారు.
- రివ్యూ: ఫార్మా.. క్రైమ్ డ్రామా సిరీస్ ఎలా ఉందంటే?
కథేంటంటే: వందో సినిమా చేస్తున్న ఓ అగ్ర కథానాయకుడు సూర్య (ఉపేంద్ర). అభిమానులు ఆయన్ను ఆంధ్ర కింగ్ అంటూ ఆరాధిస్తుంటారు. ఆ సినిమా ముందుకు కదలాలంటే రూ.3 కోట్లు అవసరమవుతాయి. సూర్య చాలామందిని సాయం కోరతాడు. ఫలితం మాత్రం దక్కదు. చివరికి తాను ఉంటున్న ఇంటిని, కార్లని అమ్మేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఆ సంఘర్షణ కొనసాగుతుండగానే... సూర్య అకౌంట్‌లో రూ.3 కోట్లు జమ అవుతాయి. ఆ డబ్బు తనకు వీరాభిమాని అయిన సాగర్ (రామ్ పోతినేని) అకౌంట్ నుంచి జమ అయినట్టు తేలుతుంది. ఒక అభిమాని తనకు అంత డబ్బు పంపాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. పరిచయం కూడా లేని ఆ అభిమానిని కలుసుకోవాలని బయల్దేరతాడు సూర్య. ఆ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ గురించి సూర్యకు ఎలాంటి విషయాలు తెలిశాయి? తన హీరో కోసం సాగర్ చేసిన త్యాగం ఎలాంటిది? సాగర్‌ని ప్రేమించిన మహాలక్ష్మి ఎవరు? తదితర విషయాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 11:55 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- థియేటర్‌లో విడుదలైన వారంలోనే ఓటీటీలోకి.. రెజ్లింగ్ నేపథ్య కథతో రూపొందిన పాన్ ఇండియా చిత్రం ‘చథా పచ్చ’. ‘ది రింగ్ ఆఫ్ రౌడీస్’ అనేది ఉపశీర్షిక.
- స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ‘శ్రీచిదంబరం గారు’.. మలయాళం మూవీని తలపించేలా.. వంశీ తుమ్మల కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘శ్రీ చిదంబంర గారు’. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
- ఈ వారం ఓటీటీలో 20కు పైగా చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు.. ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయి. ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
- ఒక్క రోజులోనే.. 200 మిలియన్ల మినిట్స్.. ఓటీటీలోనూ చిరు సినిమా హవా చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్‌లలో సందడి చేసి రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.
- ఓటీటీలోకి ‘సుబేదార్’.. యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుబేదార్’. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.
- 11 దేశాల్లో నం.1.. పది రోజుల్లో 16 మిలియన్ల వ్యూస్: ఓటీటీలోనూ ‘ధురంధర్’ హవా థియేటర్‌లో అదరగొట్టిన ‘ధురంధర్’.. ఓటీటీలోనూ హవా కొనసాగిస్తోంది.
- ఓటీటీలోకి ట్రయాంగిల్ లవ్‌స్టోరీ.. ‘మరువ తరమా’ స్ట్రీమింగ్ ఎక్కడంటే? ‘మరువ తరమా’ సినిమా ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది.
- ఓటీటీలో ఈ వారం వినోదాలు పంచేందుకు కొత్త వారం రానే వచ్చింది. ఈసారి ఎంటర్‌టైన్ చేయనున్న కథలేంటోనని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. ఓటీటీలు కూడా క్రేజీ కాంబోలు, వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సన్నద్ధమయ్యాయి.
- ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ రానుంది. తాజాగా విడుదల తేదీ ఖరారైంది.
- ఓటీటీలోనూ అదరగొడుతున్న ‘ధురంధర్’.. పాక్‌లో నెం.1 బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్’ (Dhurandhar) ఓటీటీలోనూ అదరగొడుతోంది.
- ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు చూశారా? ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. మరి అవేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? చూసేయండి.
- ఓటీటీలోకి ‘అనగనగా ఒక రాజు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో విడుదలైన సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) ఒకటి. ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది.
- ఓటీటీలోకి వచ్చిన అవార్డు సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? ‘సబర్ బొండా’ సినిమా ఓటీటీలో విడుదలైంది.
- ఓటీటీలోకి మరో మలయాళ థ్రిల్లర్ మూవీ.. ‘బేబీ గర్ల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే? మలయాళ సినిమా ‘బేబీ గర్ల్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
- ఒకే ఓటీటీలోకి ‘మన శంకరవరప్రసాద్ గారు’, ‘పరాశక్తి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? ‘మన శంకరవరప్రసాద్‌గారు’, ‘పరాశక్తి’ సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి.
- ‘నెట్‌ఫ్లిక్స్’లో.. నేరుగా విడుదల కానున్న సినిమాలు/సిరీస్‌లివే నేరుగా స్ట్రీమింగ్ కానున్న ప్రాజెక్టుల వివరాలను ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ సంస్థ మంగళవారం ప్రకటించింది.
- ఓటీటీలో ఈ వారం కొత్త వారం.. కొత్త కథల కోసం సిద్ధమా? అయితే ఓటీటీలు కూడా విభిన్న కంటెంట్‌తో రెడీ అంటున్నాయి. ఇదంతా ఈ వారాంతం అలరించే కథల గురించే.
- ఓటీటీలో ‘శంబాల’ దూకుడు.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ఓటీటీలో ‘శంబాల’ దూకుడు కొనసాగుతోంది. 10 రోజుల్లోనే రికార్డు నెలకొల్పింది.
- ఈ వారం ఓటీటీలో 30కు పైగా క్రేజీ చిత్రాలు.. థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ప్రేక్షకులకు వినోదం పంచడానికి పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు వచ్చేశాయి. ఏ ఓటీటీ వేదికగా ఏ మూవీ, వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
- ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? సంక్రాంతి కానుకగా విడుదలై, విజయం అందుకున్న కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ‘నారీ నారీ నడుమ మురారి’ (Naari Naari Naduma Murari). ఈ సినిమా ఓటీటీ విడుదల తేదీ తాజాగా ఖరారైంది.