Roshan Interview: క్రికెటర్‌ అవ్వాలనుకున్నా.. ఈ సినీ ప్రయాణం నాలో ఓపికను పెంచింది: రోషన్‌

Eenadu icon
By Entertainment Team Published : 21 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

ఇంటర్నెట్‌డెస్క్: ‘ఛాంపియన్’ మంచి భావోద్వేగాలతో కూడిన కథ అని, అందరికీ కనెక్ట్ అవుతుందని యువ కథానాయకుడు రోషన్‌ (Roshan) అన్నారు. స్వప్న సినిమాస్ పతాకంపై ప్రదీప్‌ అద్వైతం దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘ఛాంపియన్‌’ (Champion). అనస్వర రాజన్ (Anaswara Rajan) కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. (champion movie 2025 release date) ఈ సందర్భంగా హీరో రోషన్ పంచుకున్న విశేషాలు..

అద్భుతమైన డ్రామా..

‘‘ఇది 1948లో జరిగిన కథ. యాక్షన్, డ్రామా, వార్ అన్నీ ఉంటాయి. చరిత్రలో బైరాన్‌పల్లి గురించి చాలామందికి తెలుసు. అందులో మైఖేల్ అనే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి ఈ కథని ప్రజెంట్ చేశారు. నేను తెలుగు బాగానే మాట్లాడతాను. ఇందులో నేను పోషించిన పాత్ర పూర్తిగా హైదరాబాదీ. ఆ యాస స్పష్టంగా రావడం కోసం వర్క్ షాప్స్‌ కూడా చేశాం. ఇక ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి కాలంలో జరిగిన కథ ఇది. మా డైరెక్టర్ అనేక రిఫరెన్సులు ఇచ్చారు. ఇందులో అద్భుతమైన డ్రామా ఉంది. ప్రతి దానికి ఒక కనెక్షన్ ఉంటుంది’’

ఎన్నో విషయాలు నేర్చుకున్నా..

‘‘నటనలో భావోద్వేగాలు పండించాలంటే అందుకు తగిన మానసిక పరిపక్వత రావలి. ఈ మూడేళ్లలో నా ప్రయాణం చాలా భిన్నంగా జరిగింది. చాలా నేర్చుకున్నాను. స్క్రిప్ట్ విషయంలో నేను పెద్దగా తలదూర్చను. కథ వినగానే నచ్చింది. కచ్చితంగా ఈ సినిమానే చేయాలనుకున్నాను. అయితే నా క్యారెక్టర్ ఎలా చేయాలి? ఎలా ఉంటే బాగుంటుందనేది దర్శకుడు ప్రదీప్‌తో చర్చించే వాడిని. నేనొక్కడినే కాదు బైరాన్‌ పల్లి గ్రామంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక ప్రారంభం ముగింపు ఉంటుంది. కోవై సరళ అద్భుతమైన టైమింగ్ ఉన్న నటి. ఈ సినిమాలో నాన్న గారితో పనిచేసిన చాలామంది నటీనటులతో కలిసి నటించే అవకాశం దొరికింది. ఇందులో హీరో హీరోయిన్ మధ్య డ్రామా అనే కాన్సెప్ట్‌తో చాలా మంచి ఫన్ ఉంటుంది. అనస్వర మలయాళంలో దాదాపు 25 సినిమాలు చేసింది. అనుభవం ఉన్న నటి. తన క్యారెక్టర్‌లో చాలా డెప్త్ ఉంటుంది’’

కొత్త రోషన్‌ను చూస్తారు..

‘‘ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకుంటాను. ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ పోతే బోర్. ఇప్పుడు ఆడియన్స్ మనస్తత్వం కూడా మారిపోయింది. ప్రేక్షకులు థియేటర్ రావాలంటే చక్కటి అనుభూతి పంచే కథ చేయాలి. ఈ సినీ ప్రయాణం నాలో ఓపికను పెంచింది. నటుడిగా కొత్త రోషన్‌ని చూస్తారు. ఇక ఇండస్ట్రీలో అఖిల్ మంచి ఫ్రెండ్. అలాగే తమన్‌తో కలిసి క్రికెట్ ఆడుతుంటా. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ గారు నన్ను ప్రశంసించడం చాలా ఆనందంగా ఉంది. చరణ్ అన్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా గురించి మా సినిమా గురించి టీం గురించి ఆయన చాలా బాగా మాట్లాడారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది’’

క్రికెటర్‌ అవ్వాలనుకున్నా..

‘‘స్వప్న అక్క, ప్రియాంక అక్క, దత్తు గారు అందరూ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాం. దత్తుగారు ఎంతోమందిని వెండితెరకు పరిచయం చేశారు. ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. అలాంటి ప్రొడ్యూసర్ నాకు ఇంత గ్రాండ్‌గా ఛాంపియన్ సినిమా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను మొదట క్రికెటర్ అవ్వాలనుకున్నాను. నిజానికి మా నాన్న కోరిక కూడా అదే. సినిమాలపై ఆసక్తి ఏర్పడటంతో ఇటు వచ్చేశా. ఈసారి ఎక్కువ గ్యాప్ లేకుండా కనీసం రెండు సంవత్సరాలకి మూడు సినిమాలు చేయాలని అనుకుంటున్నాను’’


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘వరుస సినిమాలు చేయకపోతే కనిపించకుండా పోతావు’ అన్నారు: శివానీ తనకు 100 సినిమాలు చేసేయాలని లేదని, ప్రేక్షకులు తనకు ఇచ్చిన విలువను కాపాడుకోవడమే ముఖ్యమని అంటున్నారు కథానాయిక శివానీ నాగరం (Shivani Nagaram). అందుకే కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నానని అన్నారు.
  • ‘వారణాసి’ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీనా?.. క్లారిటీ ఇచ్చిన రాజమౌళి ‘వారణాసి’ జానర్‌పై దర్శకుడు రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.
  • వైబ్‌ మ్యాచ్‌ అయితేనే పెళ్లి.. జెన్‌-జీకి లావణ్య త్రిపాఠి సలహా ప్రెగ్నెన్సీతోనే ‘సతీ లీలావతి’ సినిమా మొత్తం పూర్తి చేశానని లావణ్య త్రిపాఠి అన్నారు. 
  • వీఎఫ్‌ఎక్స్‌.. తొందరపడితే ప్రేక్షకులు క్షమించడం లేదు: నిఖిల్‌ ‘‘పేర్లు చెప్పను కానీ, వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో కొన్ని సినిమాలు తొందరపడ్డాయి. వాటికి చాలా నష్టం జరిగింది. ‘స్వయంభు’ (Swayambhu) చిత్రానికి అలా జరగకూడదనే ఆలస్యమైనా మంచి అవుట్‌ఫుట్‌తో వస్తున్నాం’’
  • ‘ప్రిన్స్‌’ అందుకే ఆడలేదు.. ‘ఫంకీ’ విషయంలో అలా జరగదు: కేవీ అనుదీప్‌ ‘‘మన సృష్టించే ప్రపంచం, పాత్రలు నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. హాస్య సన్నివేశాల్లో సహజత్వం ఉట్టిపడాలి. అప్పుడే ప్రేక్షకులకు చేరువ అవుతాం’’అంటున్నారు దర్శకుడు కేవీ అనుదీప్‌.
  • అందుకే.. మరో జన్మంటూ ఉంటే దర్శకుడిగా పుట్టను అని చెప్పాను: గుణశేఖర్‌ గుణశేఖర్‌ తెరకెక్కించిన లేటెస్ట్‌ మూవీ ‘యుఫోరియా’. శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.
  • రాముడిగా కనిపిస్తాను..: ‘వారణాసి’లో తన పాత్ర గురించి చెప్పిన మహేశ్‌ ‘వారణాసి’లో నటించడానికి మొదట భయపడినట్లు మహేశ్‌ బాబు వివరించారు.
  • పొలిటికల్‌ ఎంట్రీపై రజనీకాంత్‌ నిర్ణయం.. కుమార్తె స్పందన ఇదీ! సౌందర్యా రజనీకాంత్‌ నిర్మించిన సినిమా ‘విత్‌ లవ్‌’. ఈ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో.. తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయంపై ఆమె స్పందించారు.
  • తరుణ్‌ భాస్కర్‌ ఆ సీన్‌లో నిజంగానే చెంపదెబ్బ కొట్టారు: ఈషా రెబ్బా కెరీర్‌లో ఒక్కసారైనా శాంతిలాంటి పాత్ర చేయాలని అనుకునేదాన్నని.. ‘ఓం శాంతి శాంతి శాంతిః’తో (Om Shanti Shanti Shantihi) ఆ కోరిక నెరవేరిందని అంటోంది ఈషా రెబ్బా (Eesha Rebba).
  • ‘ఖైదీ 2’ అప్పుడే.. ‘ఎల్‌సీయూ’ ఆగిపోలేదు..: లోకేశ్‌ కనగరాజ్‌ క్లారిటీ ‘ఖైదీ 2’పై వచ్చిన రూమర్స్‌పై దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ స్పందించారు.
  • పవన్‌కల్యాణ్‌తో మూవీపై క్లారిటీ.. టైటిలే విచిత్రంగా ఉంటుంది: అనిల్‌ రావిపూడి తన తర్వాతి చిత్రం కూడా 200శాతం ఎంటర్‌టైనరేనని దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) స్పష్టం చేశారు. ఆయన దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన తాజా మూవీ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ (Mana Shankara Vara Prasad Garu).
  • అలాంటి లెక్కలు వేసుకోను! ‘గూఢచారి’, ‘మేజర్‌’ విజయాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించిన నటి శోభితా ధూళిపాళ్ల. ఇప్పుడామె తొలిసారి తెలుగులో ‘చీకటిలో’ అనే ఓటీటీ చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. దీన్ని శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించగా.. డి సురేశ్‌బాబు నిర్మించారు.
  • ‘యుఫోరియా’.. అందుకే నాపై కోపం వస్తుంది: గుణశేఖర్‌ తన కొత్త సినిమా ‘యుఫోరియా’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో దర్శకుడు గుణశేఖర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • ‘మన శంకరవరప్రసాద్‌గారు’కు చిరంజీవి పారితోషికం.. అనిల్‌ ఏమన్నారంటే? చిరంజీవితో సినిమా అనుకున్న తర్వాత ఆయనకు తనకూ ఓ మినీ ఛాలెంజ్‌ జరిగిందని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నారు.
  • తొలిరోజే సెట్‌లో ఏడ్చేశా.. ‘ ‘గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మరిచిపోలేని పండగ విజయాన్ని అందుకున్నా. ఇప్పుడు ‘అనగనగా ఒక రాజు’తో మరోసారి ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంటాననే నమ్మకముంది’’ అంటోంది నటి మీనాక్షి చౌదరి.
  • అందుకేనేమో నయన్‌ ప్రమోషన్స్‌ చేశారు.. అది మెగా మ్యాజిక్‌: అనిల్‌ రావిపూడి సంక్రాంతికి వస్తే తిరుగు లేదనే ట్రాక్ రికార్డు ఉన్నా, అలా ముద్ర పడటం మంచిది కాదని, దాని వల్ల ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి.
  • నేను కారణజన్మురాలిని.. ఫ్యాన్స్‌ అసోసియేషన్‌పై అనసూయ కామెంట్‌.. స్వేచ్ఛ మనకు మనం ఇచ్చుకునేదని, స్వాతంత్ర్యం బయట నుంచి వచ్చేదని నటి, వ్యాఖ్యాత అనసూయ అభిప్రాయపడ్డారు. ఇన్‌స్టా వేదికగా ఆమె అభిమానులతో ముచ్చటించారు.
  • మెగాస్టార్‌తో పోటీ.. నవీన్‌ పొలిశెట్టి ఏమన్నారంటే! తనకు సినిమాల్లోనే పెళ్లి చేసుకోవాలని రాసి ఉన్నట్లుందని నవీన్‌ పొలిశెట్టి సరదాగా అన్నారు.
  • దిష్టి తీయించుకోమని చిరంజీవికి చెప్పా: అనిల్‌ రావిపూడి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో అనిల్‌ రావిపూడి మాట్లాడారు.
  • ఆ రోల్‌కు సందీప్‌ రెడ్డి వంగాను అనుకున్నా.. కానీ: ‘పతంగ్‌’ డైరెక్టర్‌ ‘పతంగ్‌’ సినిమా దర్శకుడు పలు విశేషాలు పంచుకున్నారు.

English Translation

Roshan Interview: Even if I want to be a cricketer.. this film journey has increased my patience: Roshan

Eenadu icon
By Entertainment Team Published : 21 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

Internet Desk: Young protagonist Roshan said that 'Champion' is a story with good emotions and will connect with everyone. He acted in the film 'Champion' under the banner of Swapna Cinemas under the direction of Pradeep Advaitaham. Anaswara Rajan is the heroine. This movie, which has already completed its shooting, will hit the screens on December 25. (champion movie 2025 release date) Hero Roshan shared the details on this occasion..

A wonderful drama..

''This is a story that happened in 1948. Action, drama, war are all there. Many people know about Byranpally in history. In it, a fictional character named Michael was created and this story was presented. I speak Telugu very well. The role I play in this is completely Hyderabadi. We also conducted workshops to make the accent clear. This is the story that happened after the independence of India. Our director has given many references. It has great drama. Everything has a connection''

Though many things have been learned..

''In order to develop emotions in acting, one must have adequate mental maturity. My journey has been very different in these three years. I learned a lot. I don't bother much with the script. I liked the story as soon as I heard it. I definitely wanted to do this film. But what about my character? He is the one who discusses with the director Pradeep how it would be better. Not only me but every role in Byron Pally village is important. A beginning has an end. Kovai Sarala is an actress with excellent timing. In this movie, I got a chance to act with many actors who worked with my father. It has great fun with the concept of drama between hero and heroine. Anaswara has done around 25 movies in Malayalam. An experienced actress. There is a lot of depth in his character. If you keep doing the same kind of movies, you will get bored. Now the mentality of the audience has also changed. In order for the audience to come to the theater, you need to tell a good story. This film journey has increased my patience. A new Roshan will be seen as an actor. Akhil is a good friend in the industry. I also play cricket with Taman. I am very happy that Ram Charan praised me at the trailer launch event. I know Charan since childhood. He spoke very well about me, about our film, about the team. I am really very happy. Dattugaru introduced many people to the silver screen. Made many great films. I am very happy that such a producer has given me such a grand champion film. I wanted to be a cricketer first. In fact, my father's wish is the same. It came with interest in movies. This time I want to do at least three movies in two years without much gap''


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • 'If you don't do successive films, you will disappear': Shivani Actress Shivani Nagaram says that she doesn't want to do 100 films and it is important to preserve the value given to her by the audience. That is why he said that he does films only if he likes the story and character.
  • Is 'Varanasi' a science fiction movie?.. Rajamouli gave clarity. Director Rajamouli has given clarity on the genre of 'Varanasi'.
  • Marriage only if the vibe is a match.. Lavanya Tripathi's advice to Gen-Z Lavanya Tripathi said that she completed the entire movie 'Sati Lilavati' during her pregnancy. 
  • VFX.. Audience will not forgive if rushed: Nikhil "I won't mention names, but some films were rushed in terms of VFX. They suffered a lot of damage. 'Swayambhu' film should not be like that but we are coming with a good output"
  • That's why 'Prince' didn't play.. It won't happen in case of 'Funky': KV Anudeep "The world and characters we create should be close to real life. Comedy scenes should be spontaneity. Only then will we reach the audience,'' says director KV Anudeep.
  • That's why I said that if I had another birth, I would not be born as a director: Gunasekhar. Gunasekhar's latest movie is 'Euphoria'. The team of the film participated in the press meet on the eve of its release on Friday.
  • I will be seen as Ram..: Mahesh talks about his role in 'Varanasi' Mahesh Babu explained that he was initially scared to act in 'Varanasi'.
  • Rajinikanth's decision on political entry.. This is his daughter's reaction! Soundarya Rajinikanth produced movie 'With Love'. At the trailer launch event of this movie.. she reacted to a decision taken by her father.
  • Tarun Bhaskar really slapped her in that scene: Esha Rebba Eesha Rebba says that she wanted to play a role like Shanti at least once in her career.. That wish has been fulfilled with 'Om Shanti Shanti Shantihi'. Director Lokesh Kanagaraj responded to the rumors about 'Khaidi 2'.
  • Clarity on the movie with Pawan Kalyan.. The title will be strange: Anil Ravipudi Director Anil Ravipudi has clarified that his next film will also be 200 percent entertaining. Directed by him is the latest movie 'Mana Shankara Vara Prasad Garu' starring Chiranjeevi (Chiranjeevi) as the protagonist. Actress Sobhita Dhulipalla who impressed the Telugu audience with the success of 'Gudhachari' and 'Major'. Now she is ready to entertain for the first time with an OTT film in Telugu titled 'Cheekatilo'. It was directed by Saran Koppishetty and produced by D Suresh Babu.
  • 'Euphoria'...that's why I get angry: Gunasekhar Director Gunasekhar made interesting comments at the trailer launch event of his new movie 'Euphoria'.
  • Chiranjeevi's award for 'Mana Shankaravaraprasadgaru'.. What does Anil think? Director Anil Ravipudi said that after planning a film with Chiranjeevi, he also had a mini challenge.
  • I cried on the set on the first day. Now I am confident that I will once again steal the hearts of the audience with 'Anaganaga Oka Raju', says actress Meenakshi Chaudhary. Crazy director Anil Ravipudi says that even if you have a track record that there is no turning back when it comes to Sankranti, it is not good to give that impression and it will increase the pressure. She was delighted with her fans on the Insta stage.
  • Competition with Megastar.. What is Naveen Polishetty! Naveen Polishetty jokingly said that it is written that he wants to get married in the movies.
  • Tell Chiranjeevi to marry Dishti: Anil Ravipudi The song launch event of 'Mana Shankaravaraprasad Garu' will be held in Guntur. Anil Ravipudi spoke in the press meet organized on this occasion.
  • Sandeep Reddy was expected to play the role, but: 'Patang' director The director of the movie 'Patang' shared many features.