Shubman Gill: టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో గిల్‌కు నో ఛాన్స్.. కారణం చెప్పిన చీఫ్ సెలక్టర్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 (T20 World Cup 2026) కోసం భారత సెలక్టర్లు శనివారం జట్టును ప్రకటించారు. మొన్నటివరకు వైస్‌కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు వరల్డ్ కప్ జట్టులో కల్పించకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాన్ని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) వెల్లడించాడు. జట్టు కాంబినేషన్‌లో భాగంగా ఈ సారి అతడికి చోటు దక్కలేదని అగార్కర్ పేర్కొన్నాడు.
‘‘శుభ్‌మన్ గిల్ ఆట గురించి ఎటువంటి సందేహం లేదు. అతడు ఇటీవల ఎక్కువ పరుగులు చేసి ఉండకపోవచ్చు. కానీ ఎంత విలువైన ఆటగాడో మాకు తెలుసు. మేం డిఫరెంట్ కాంబినేషన్‌తో జట్టును ఎంపిక చేయడంతో టీ20 ప్రపంచ కప్‌లో గిల్‌కు చోటు దక్కలేదు. వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి కాకుండా జట్టు సమత్యులత గురించి ఆలోచించి టాప్ ఆర్డర్‌లో ఇద్దరు వికెట్ కీపర్లను తీసుకున్నాం. ఈ క్రమంలో గిల్‌కు చోటు దక్కలేదు’ అని చీఫ్ సెలక్టర్ వివరించాడు.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా గిల్ ( Shubman Gill)ను ఎంపిక చేయకపోడంపై మాట్లాడాడు. ‘గిల్ ఫామ్‌లో లేకపోవడంతో అతడిని పక్కనపెట్టలేదు. జట్టు కాంబినేషన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. టాప్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్ ఉండాలనేది మా ఆలోచన. గిల్ సామర్థ్యం విషయంలో మాకు ఎలాంటి అనుమానాలు లేవు. అతడు అద్భుతమైన ఆటగాడు. లోయర్ ఆర్డర్‌లో ఓ ఫినిషర్ ఉండాలని రింకు సింగ్‌ను తీసుకున్నాం’ అని సూర్యకుమార్ అన్నాడు. ఈ ఏడాది గిల్ టీ20ల్లో పెద్దగా రాణించలేదు. 15 మ్యాచ్‌లు ఆడి కేవలం 291 పరుగులు మాత్రమే చేశాడు.
- టీ20 ప్రపంచకప్‌నకు భారత జట్టు ప్రకటన.. గిల్‌కి షాక్.. ఇషాన్‌కు ఛాన్స్..
2026 టీ20 ప్రపంచ కప్‌నకు భారత జట్టు ఇదే:అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్, కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 16:27 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.