Bhartha Mahasayulaku Wignyapthi: ‘మాస్‌ మహారాజా’ టైటిల్‌ వద్దన్న రవితేజ.. కారణమిదే!

Eenadu icon
By Entertainment Team Published : 21 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌: మనం ఎలాంటి సినిమాలు చూసి పెరుగుతామో దాని ప్రభావం మనపై ఉంటుందని దర్శకుడు కిషోర్‌ తిరుమల (Kishore Tirumala) అన్నారు.  ఆయన దర్శకత్వంలో రవితేజ ( Ravi Teja) కథానాయకుడిగా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi). ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతీ కథానాయికలు. ఎస్‌ఎల్వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. రవితేజను దృష్టిలో పెట్టుకుని ఈ కథను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దామని దర్శకుడు కిషోర్‌ తిరుమల అన్నారు.

‘‘మీకు కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాం. నా అభిప్రాయాలు, రవితేజవి కలుస్తాయి. మా ఇద్దరికి ఎంటర్‌టైన్‌మెంట్‌ జానర్‌ అంటే ఇష్టం. ఆయన నటించిన ‘పవర్‌’ కోసం పనిచేశా. అప్పటి నుంచి పరిచయం ఉంది. ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ కథ రవితేజకు చెప్పా. డేట్స్‌ కుదరకపోవడం వల్ల ఆ కథ చేయలేకపోయాం. నేనెప్పుడూ కథ, అందులోని పాత్ర బట్టే  సినిమాను ముందుకు తీసుకెళ్తాను. అది నచ్చి, ‘ఈ సినిమా వరకూ మాస్‌ మహారాజ్‌ వద్దు కిషోర్‌. కేవలం రవితేజ అని వేద్దాం’ అన్నారు.  నేను ‘గీతాంజలి’ 27 సార్లు, ‘నిన్నే పెళ్లాడుతా’ 52 సార్లు, ‘స్వర్ణ కమలం’ 23 సార్లు చూశా. ఆ సినిమాలే నన్ను ఎక్కువగా ప్రభావితం చేశాయి. నా అనుభవాలతోనే ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘చిత్రలహరి’ సినిమాలు చేశాను. ఈ సినిమా తీస్తున్నప్పుడు ఒక విషయం మీద నేను రియలైజ్ అయ్యాను. సంక్రాంతికి వచ్చే ఈ చిత్రం మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తుంది’’ అని కిషోర్‌ తిరుమల అన్నారు.

  • స్టేజ్‌పై డ్యాన్స్‌ చేసి అలరించిన డింపుల్‌, ఆషిక

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకు గవర్నమెంట్ రేట్ల ప్రకారమే టికెట్‌ ధరలు ఉంటాయని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి అన్నారు. ‘‘హీరో రవితేజ ఈ సినిమా ఒప్పుకునే సమయంలోనే ఇది సంక్రాంతికి రావాలని చెప్పారు. ఈ సీజన్‌లో ఇలాంటి సినిమా ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచుతుంది. ఇప్పటివరకూ రవితేజ రూపాయి కూడా రెమ్యునరేషన్‌ తీసుకోలేదు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ జీ5 వాళ్లకు ఇచ్చాం. వాళ్లకు కథ బాగా నచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ అని వాళ్లు తీసుకున్నారు. సినిమా మొదలవగానే ఇచ్చేశాం. ఇక శ్రీకాంత్‌ ఓదెల, నాని కాంబినేషన్‌లో ‘ప్యారడైజ్’ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. మార్చి 26వ తేదీకి సినిమాను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాం. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇక శ్రీకాంత్ - చిరంజీవి గారి సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా సమాంతరంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది మధ్యలో దాన్ని మొదలు పెడతాం’’ అని అన్నారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్‌’’ అన్నారు హీరో సుహాస్‌. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
  • ప్రియమణి.. ఇండో-హాలీవుడ్‌ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్‌ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్‌ చేరింది.
  • బాలీవుడ్‌ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్‌. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
  • జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్‌’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
  • మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్‌ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
  • ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
  • వెబ్‌సిరీస్‌ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్‌’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్‌ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్‌ కామ్రేడ్‌’ ఫేమ్‌ భరత్‌ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
  • గ్రామీణ కథ ‘సెయాన్‌’ ‘సెయాన్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్‌. ‘అమరన్‌’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్‌ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్‌ మురుగేశన్‌ తెరకెక్కిస్తున్నారు.
  • అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) 79వ ఎడిషన్‌ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
  • సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్‌ తండ్రి సలీం ఖాన్‌(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్‌ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్‌’, ‘డాన్‌’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
  • ‘లైకా’ కేసు.. విశాల్ పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్‌ హైకోర్టు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘లైకా ప్రొడక్షన్స్‌’కు సంబంధించిన కేసులో ఉత్తర్వులను పాటించేందుకు గడువు కోరుతూ నటుడు విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది.
  • చెక్‌బౌన్స్‌ కేసు.. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్‌ ఏమన్నారంటే? బాలీవుడ్‌ నటుడు రాజ్‌పాల్‌ యాదవ్‌ తిహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు.

English Translation

Bhartha Mahasayulaku Wignyapthi: Ravi Teja who does not have the title of 'Mass Maharaja'.. is the reason!

Eenadu icon
By Entertainment Team Published : 21 Dec 2025 00:05 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

Hyderabad: Director Kishore Tirumala said that the kind of movies we grow up watching has an impact on us.  Under his direction is the family entertainer 'Bhartha Mahasayulaku Wignyapthi' starring Ravi Teja ( Ravi Teja). Aashika Ranganath and Dimple Hayati are the heroines. Sudhakar Cherukuri is producing under the banner of SLV Cinemas. The movie, which has already completed its shooting, will hit the screens on January 13 as a Sankranti gift. As part of the campaign, the film team organized a press meet. Director Kishore Tirumala said that we have made this story as a family entertainer keeping Ravi Teja in mind. My views and Ravi Tejavi's agree. Both of us like entertainment genre. Worked for 'Power' starring him. Since then there has been contact. Tell Ravi Teja the story of 'Adallu Uke Joharlu'. We could not do that story due to the lack of dates. I always take the film forward based on the story and the character in it. He liked it and said, 'I don't want Mass Maharaj till this movie, Kishore. Let's just call him Ravi Teja', he said.  I have seen 'Gitanjali' 27 times, 'Ninne Pelladuta' 52 times and 'Swarna Kamalam' 23 times. Those movies influenced me the most. With my experiences, I have done films like 'Nenu Shailaja', 'Unanna Ekte Zindagi' and 'Chitralahari'. I realized one thing while making this film. Kishore Tirumala said that this Sankranti movie will definitely entertain you.

  • Dimple and Aashika who danced on the stage and entertained

The ticket prices for the movie 'Bhartha Mahasayyulu Pediza' will be according to the government rates, said producer Sudhakar Cherukuri. "Hero Ravi Teja said that it should come on Sankranti at the same time as this film is accepted. A movie like this will entertain the audience more in this season. Till now Ravi Teja has not taken even a rupee of remuneration. We have given the OTT rights of this movie to G5. They liked the story. They took it as an entertainment movie. We gave it when the movie started. The shooting of 'Paradise' in the combination of Srikanth Odela and Nani is going on at a fast pace. We are getting ready to release the film on March 26. There may not be much changes. The pre-production work of Srikanth-Chiranjeevi's film is also going on parallely. We will start it in the middle of next year.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter. "Hey Balwant is a movie full of good entertainment and strong emotions," said hero Suhas. Dhima confidently expressed that this is the fastest film she has completed in her career. She is confident that she will get the success she is waiting for. Apart from sharing emotions with various roles on screen, actress Priyamani also entertains with action scenes. Now a new project to be made by a Hollywood production company has been added to her account.

  • First step towards Bollywood? Last year, heroine Rukmini Vasant got good success with films like 'Madrasi' and 'Kanthara 2'. This Bhama who is getting opportunities regardless of language within few days of entering the film industry..
  • Jodi Kudirena! Last year, protagonist Sidhu Jonnalagadda greeted the audience with the films 'Jack' and 'Telusu Kada'. Now they are gearing up for another new movie.
  • Marakatamani 2 starts It is known that Adi Pinishetti's fantasy comedy thriller 'Marakathamani' was released in 2017 and entertained the audience. Now Adi has released 'Marakatamani 2' as a sequel to the movie.
  • Don't use those songs. Noted music director Ilayaraja was arrested in the court. For Sarigama Music Company, he has a dispute going on in the court. The Delhi High Court has issued an interim order in this case.
  • For the webseries! Young hero Kiran Abbavaram is on a roll with the success of 'Ka' and 'K-Ramp'. Now he is preparing to take his first step into OTT. Mustabu
  • rural story 'Sean' directed by Bharat Kamma of 'Dear Comrade' fame. Protagonist Siva Karthikeyan is preparing to entertain the audience with the movie 'Seyan'. After the success of 'Amaran', this is Kamal Haasan's second film under his own production house. Sivakumar Murugesan is directing.
  • BAFTA honor for Alia Popular Bollywood actress Alia Bhatt has once again received international recognition. BAFTA (British Academy of Film and Television Arts) has announced the list of presenters for the 79th edition of the awards.
  • News in Brief (5) Famous Hindi film writer, actor, Salman Khan's father Salim Khan (90) was admitted to a private hospital in Mumbai on Tuesday due to health conditions. His films 'Sholay', 'Deewar' and 'Don', which he wrote with Javed Akhtar, have stopped in the Indian cinema. The Madras High Court dismissed the petition filed by actor Vishal seeking time to comply with the orders in the case related to the famous production company 'Lyca Productions'.
  • Check bounce case.. What about Rajpal who was released from jail? Bollywood actor Rajpal Yadav released from Tihad Jail.