Farmers And Tdp Leaders Shock To Minister Nadendla Manohar

సాక్షి, విజయవాడ:మంత్రి నాదెండ్ల మనోహర్‌కు రైతులు, టీడీపీ నేతలు షాక్‌ ఇచ్చారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేతలు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా అందిందన్నారు. కూటమి పాలనలో రైతు భరోసా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం(డిసెంబర్‌ 20) తోట్లవల్లూరు మండలంలో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మిల్లర్లు తమ కష్టాన్ని దోచేస్తున్నారంటూ రైతులు నిలదీశారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రైతులు.. చంద్రబాబు సర్కార్‌ గాలితీసేశారు. ధాన్యం కొనుగోళ్లలో దోపిడీని ఆధారాలతో సహా రైతులు బయటపెట్టారు.

రైతులకు మేమే మేలు చేశామని డబ్బాలు కొట్టిన చంద్రబాబు సర్కార్‌.. ధాన్యం కొనుగోళ్లపై గొప్పలు చెప్పుకుంటుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ సాక్షిగా ప్రభుత్వం డొల్లతనం బయటపడింది. వైఎస్సార్‌సీపీ హయాంలోనే రైతులకు మేలు జరిగిందన్న టీడీపీ నేత తోట సాయిబాబు.. గత ప్రభుత్వంలో రైతు భరోసా సక్రమంగా ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ అరకొరగానే ఇచ్చారన్నారు. దీంతో టీడీపీ నేతలు సైతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకోవడంతో మంత్రి నాదెండ్ల మనోహర్‌, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కంగుతిన్నారు.


English Translation
Farmers And Tdp Leaders Shock To Minister Nadendla Manohar

Sakshi, Vijayawada: Minister Nandla Farmers and TDP leaders shocked Manohar. The TDP leaders said that farmers were benefited only in YS Jagan's government. Farmers' assurance was properly received in the previous government. The farmers have expressed their concern that the farmers are not getting assurance under the coalition rule.

On Saturday (December 20), the farmers denounced the Minister Nadendla Manohar who visited Thotlavallur mandal saying that the millers are robbing them of their hard work. In the face-to-face program with the farmers, the farmers. Farmers have exposed the exploitation in the purchase of grain along with the evidence.

Chandrababu Sarkar, who beat the cans saying that we have done good to the farmers.. brags about the purchase of grain. Minister Nadendla Manohar witnessed the government's indolence. TDP leader Thota Saibabu said that the farmers were benefited during the YSRCP regime. Farmers were assured properly in the previous government. He said that in the alliance government, the breadwinner gave only a small amount. Minister Nadendla Manohar and Palmer MLA Varla Kumar Raja were shocked as TDP leaders also praised the YSRCP government.