ఇంటర్నెట్ డెస్క్: గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలకు బ్రేక్ పడింది. మార్కెట్ వర్గాల అంచనాల కంటే తక్కువగా అమెరికాలో ద్రవ్యోల్బణం ఉండటంతో ఫెడ్ రేట్‌ కోత అంచనాలు పెరిగాయి. అయితే, డాలర్ కూడా కాస్త బలపడటంతో బంగారం, ధరల ర్యాలీకి బ్రేక్ పడింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,34,170గా ఉంది. నిన్నటి రేటుతో పోలిస్తే సుమారు రూ.680 మేర తగ్గింది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర కూడా రూ.620 మేర తగ్గి రూ.1,22,990కు చేరింది. వెండి ధర కూడా దాదాపు రూ.3000 మేర తగ్గి రూ.2,08,900కు చేరుకుంది (Gold, Silver Rates December 20).

త్వరలో హాలిడే సీజన్ మొదలుకానుండటం, డాలర్ బలపడటం, సంవత్సరాంతం సమీపిస్తుండటంతో ఇన్వెస్టర్ల దూకుడుకు బ్రేకులు పడి బంగారం, వెండి ధరలు కాస్త నెమ్మదించాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే తక్కువగానే ఉండటంతో వచ్చే ఏడాదిలో మరోసారి ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేటులో కోతపై ఆశలు పెరిగాయని చెబుతున్నారు. కాబట్టి, ప్రస్తుతం ధరల్లో తగ్గుదల స్వల్పకాలిక దిద్దుబాటు మాత్రమేనని అన్నారు.


వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇవీ(24కే, 22కే, 18కే)

  • చెన్నై: ₹1,35,050; ₹1,23,790; ₹1,03,290
  • ముంబై: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • న్యూఢిల్లీ: ₹1,34,320; ₹1,23,140; ₹1,00,780
  • కోల్‌కతా: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • బెంగళూరు: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • హైదరాబాద్: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • విజయవాడ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • కేరళ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • పుణె: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • వడోదరా: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
  • అహ్మదాబాద్: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680

వెండి ధరలు ఇలా

  • చెన్నై: ₹2,20,900
  • ముంబై: ₹2,08,900
  • న్యూఢిల్లీ: ₹2,08,900
  • కోల్‌కతా: ₹2,08,900
  • బెంగళూరు: ₹2,08,900
  • హైదరాబాద్: ₹2,20,900
  • విజయవాడ: ₹2,20,900
  • కేరళ: ₹2,20,900
  • పుణె: ₹2,08,900
  • వడోదరా: ₹2,08,900
  • అహ్మదాబాద్: ₹2,08,900

గమనిక:పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.

ఇవీ చదవండి:


English Translation

Internet Desk: Gold and silver prices, which have been increasing for the last three days, have broken. Expectations for a Fed rate cut rose as US inflation came in below market expectations. However, as the dollar also strengthened a bit, the rally in gold and prices broke. As of 6.30 am on Saturday, 24 carat 10 gram gold was priced at Rs 1,34,170, according to the Good Returns website. It has decreased by about Rs.680 compared to yesterday's rate. The price of 22 carat ornamental gold also decreased by Rs.620 to Rs.1,22,990. The price of silver also decreased by about Rs.3000 to Rs.2,08,900 (Gold, Silver Rates December 20).

Market experts are predicting that the holiday season will start soon, the strengthening of the dollar and the year-end will put brakes on the aggressiveness of investors and the prices of gold and silver will slow down a bit. However, with inflation in the US lower than expected, hopes for another Fed rate cut next year are said to have risen. Therefore, he said that the current drop in prices is only a short-term correction.


Gold prices in different cities are as follows (24k, 22k, 18k)

  • Chennai: ₹1,35,050; ₹1,23,790; ₹1,03,290
  • Mumbai: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • New Delhi: ₹1,34,320; ₹1,23,140; ₹1,00,780
  • Kolkata: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • Bangalore: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • Hyderabad: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • Vijayawada: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • Kerala: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • Pune: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
  • Vadodara: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
  • Ahmedabad: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680

Silver Prices as

  • Chennai: ₹2,20,900
  • Mumbai: ₹2,08,900
  • New Delhi: ₹2,08,900
  • Kolkata: ₹2,08,900
  • Bangalore: ₹2,08,900
  • Hyderabad: ₹2,20,900
  • Vijayawada: ₹2,20,900
  • Kerala: ₹2,20,900
  • Pune: ₹2,08,900
  • Vadodara: ₹2,08,900
  • Ahmedabad: ₹2,08,900

Note:The above mentioned gold and silver rates are subject to change from time to time in the markets. So buyers can check prices again at that time.

Read: