
ఇదిగో మిత్రుడు.. సేవల ఆప్తుడు

- A
- A+
- A++
న్యూస్‌టుడే, విజయనగరం అయ్యన్నపేట, గ్రామీణం, రాజాం: పాలనలో డిజిటల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మనమిత్ర పేరిట ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. అన్ని శాఖలకు సంబంధించి సేవలను సులభతరం చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. తాజాగా ఆర్టీసీ, పోలీసు, పౌర సరఫరాలు తదితర విభాగాల్లోనూ అమల్లోకి వచ్చింది. 95523 00009 నంబరును సంప్రదించవచ్చని అధికారులు చెబుతున్నారు.
కాంప్లెక్స్‌కు వెళ్లనక్కర్లే..
ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకోవాలంటే గతంలో కాంప్లెక్స్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. సంస్థ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చినా కొందరికి అవగాహన లేదు. మనమిత్రలో ఆయా సేవలన్నీ సులువు కానున్నాయి. టికెట్ బుకింగ్, రద్దు ఆప్షన్స్ ఉంటాయి. యూపీఐ, ఇతర పద్ధతుల్లో ఛార్జీలు చెల్లించవచ్చని విజయనగరం డిపో ప్రబంధకుడు జె.శ్రీనివాసరావు తెలిపారు.
మిగిలిన విభాగాల్లో..
- కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- రేషన్ దుకాణాల్లో అక్రమాలపై ఫిర్యాదు చేయొచ్చు.
- ఫొటోలు తీసి, పంపవచ్చు.
- ధాన్యం అమ్మకాల్లో ఇబ్బందులున్నా.. మిల్లర్ల దోపిడీని తెలియజేయవచ్చు.
- 1967కు గానీ, 73373 59375 నంబరు ద్వారా వాట్సప్ సేవలను సైతం సద్వినియోగం చేసుకోవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు.
ఎఫ్ఐఆర్ నమోదు, ప్రస్తుత స్థితి, ఈ- చలానా తదితర వివరాలను క్షణాల్లో పొందవచ్చు. కచ్చితత్వంతో పాటు పారదర్శకంగా ఉంటాయి. ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్‌ను అందుబాటులో ఉంచామని ఎస్పీ దామోదర్ తెలిపారు.
ఎస్‌హెచ్‌జీ, ఎస్‌హెచ్‌జీ-ఓబీ, ఎస్‌ఎల్‌ఎఫ్-ఓబీ, టీఎల్‌ఎఫ్-ఓబీ, జడ్‌ఎస్-ఓబీ, ఎస్‌హెచ్‌జీ- పొదుపు, ఎస్‌హెచ్‌జీ- రుణ వివరాలు తెలుసుకోవచ్చు. ఆడిట్ నివేదికలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మెప్మా సిబ్బంది వివరాలు సైతం అందుబాటులోనే ఉంటాయని పీడీ శ్రీనివాస్ వెల్లడించారు.
► Read latest Vizianagaram Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:04 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వైకాపా నేత.. భూమేత [ 19-02-2026] అవి అసైన్డ్ భూములు.. విక్రయానికి వీలుపడని వాటిపై ఓ వైకాపా నాయకుడి కన్ను పడింది. పేదల నుంచి అనధికారికంగా కొనుగోలుచేశారు. అంతటితో ఆగలే. అక్రమంగా మరికొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు రహదారినే యంత్రాలు పెట్టి తవ్వించేశారు.
- మీతోనే శక్తి.. మీలోనే శక్తి.. [ 19-02-2026] ఆపదలో ఉండే మహిళలకు అండగా నిలుస్తోంది శక్తి యాప్. 2025 మార్చిలో ఈ సేవలు ప్రారంభం కాగా.. ఉమ్మడి జిల్లాలో వేల మంది వినియోగిస్తున్నారు.
- రాష్ట్ర ఉత్సవంగా పైడితల్లి జాతర [ 19-02-2026] రాజాం పట్టణంలోని పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- గుండెపోటు దాటేలా.. పచ్చనిగూడు నిలిచేలా.. [ 19-02-2026] ఛాతిలో నొప్పి అనిపించినప్పుడు తక్షణ వైద్యసాయం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.
- ప్రేమ పేరిట మోసం.. [ 19-02-2026] ప్రేమ పేరుతో ఓ బాలికను మోసం చేసిన నిందితుడికి జైలు శిక్ష, జరిమానా పడింది.
English Translation

Here is a friend.. a friend of service

- A
- A+
- A++
Newstoday, Vizianagaram Ayyannapet, Graminam, Rajam: The coalition government is taking special steps to bring digital policy in governance. As part of this, WhatsApp governance has already been started in the name of Manamitra. This process will serve to facilitate services in respect of all departments. Recently it has come into force in RTC, Police, Civil Supplies and other departments as well. Officials say that you can contact the number 95523 00009.
If you don't want to go to the complex...
In order to book a ticket at RTC, you had to go to the complex in the past. Although the company's website is available, some people are not aware. All those services will be easy in Manamitra. There are ticket booking and cancellation options. Vizianagaram Depot Manager J.Srinivasa Rao said that charges can be paid through UPI and other methods.
In other departments..
- You can apply for a new ration card.
- You can complain about irregularities in ration shops.
- Photos can be taken and sent. If there is a problem.. the exploitation of the millers can be reported.
- Even for 1967, the concerned officials said that WhatsApp services can also be utilized through the number 73373 59375.
AFIR registration, current status, e-challan etc. details can be obtained in moments. Accurate as well as transparent. SP Damodar said that QR code has already been made available in all police stations and offices.
ASHG, SHG-OB, SLF-OB, TLF-OB, ZDS-OB, SHG-Savings, SHG-Loan details can be known. Audit reports can be downloaded. PD Srinivas disclosed that the details of Mepma staff will also be available.
► Read latest Vizianagaram Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 20 Dec 2025 08:04 ISTNote:Advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- Vaikapa leader. 19-02-2026] They are assigned lands.. A Vaikapa leader's eye fell on those that could not be sold. Purchased informally from the poor. Can't stop with that. In order to occupy some more government land illegally, the road has been excavated with machines.
- The power is with you. 19-02-2026] Shakti App is standing by women in distress. These services will start in March 2025. Thousands of people are using it in the combined district. 19-02-2026] The government has decided to organize the festival of Polipalli Paidithalli Ammavari in Rajam town as a state festival. 19-02-2026] When they feel pain in the chest, many people lose their lives due to lack of immediate medical attention.
- Deception in the name of love.. [ 19-02-2026] The accused who cheated a girl in the name of love was sentenced to jail and fined.