Roshan Kanakala: మోగ్లీ.. ఎవర్నీ నిరుత్సాహపరచదు

- A
- A+
- A++

‘‘మోగ్లీ’ని తప్పకుండా థియేటర్లలో చూడండి. ఇది కచ్చితంగా ఎక్కడా.. ఎవర్నీ నిరుత్సాహపరచదు’’ అన్నారు హీరో రోషన్ కనకాల. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాని సందీప్ రాజ్ తెరకెక్కించారు. టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. సాక్షి మడోల్కర్ కథానాయిక. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. హీరో సాయి దుర్గా తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం చిన్నప్పటి నుంచి టీవీల్లో చూసిన టైటిల్ మోగ్లీ. ఇప్పుడది సినిమా అయింది. దాన్ని రోషన్ మనకి పరిచయం చేశాడు. సాక్షి, బండి సరోజ్, వైవా హర్ష.. అందరూ అద్భుతంగా నటించారు. దర్శకుడు సందీప్ రాజ్ ఈ మధ్య బ్యాడ్‌లక్ అని ఓ ట్వీట్ వేశారు. ఈ ఇండస్ట్రీలో హార్డ్‌వర్క్ తప్ప బ్యాడ్‌లక్ అనేది ఉండదు. తనింకా బాగా కష్టపడి మరిన్ని మంచి స్క్రిప్ట్‌లు తెరపైకి తీసుకురావాలని కోరుకుంటున్నా. ఇలాంటి మంచి చిత్రాల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘మా చిన్న చిత్రాన్ని పెద్ద సినిమాలా ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రోషన్ మాట్లాడుతూ.. ‘‘ఈ మోగ్లీ గాణ్ని గెలిపించినందుకు.. ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సాక్షి దీంట్లో అద్భుతంగా నటించింది. నిర్మాత విశ్వప్రసాద్ లేకపోతే ఈ చిత్రం లేదు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సాక్షి, హేమంత్ మధుకర్ పాల్గొన్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అదే బాధగా అనిపిస్తుంది ‘‘మంచి వినోదంతో పాటు బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమా ‘హే బల్‌వంత్’’ అన్నారు హీరో సుహాస్. ఇది తన కెరీర్‌లోనే చాలా వేగంగా పూర్తి చేసిన చిత్రమని.. దీనితో తాను ఎదురు చూస్తున్న విజయం అందుకుంటాననే నమ్మకముందని ధీమా వ్యక్తం చేశారు.
- ప్రియమణి.. ఇండో-హాలీవుడ్ చిత్రం తెరపై వైవిధ్యమైన పాత్రలతో భావోద్వేగాలను పంచడంతోపాటు.. యాక్షన్ సన్నివేశాలతోనూ అదరగొడుతుంది నటి ప్రియమణి. ఇప్పుడామె ఖాతాలో ఓ హాలీవుడ్ నిర్మాణసంస్థ రూపొందించనున్న కొత్త ప్రాజెక్ట్ చేరింది.
- బాలీవుడ్ వైపు తొలి అడుగు? గతేడాది ‘మదరాసి’, ‘కాంతార 2’ లాంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది కథానాయిక రుక్మిణీ వసంత్. చిత్రపరిశ్రమకు వచ్చిన తక్కువ రోజుల్లోనే భాషతో సంబంధం లేకుండా అవకాశాల్ని అందుకుంటోన్న ఈ భామ..
- జోడీ కుదిరేనా! గతేడాది ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించారు కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ. ఇప్పుడు మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
- మరకతమణి 2కి శ్రీకారం ఆది పినిశెట్టి నుంచి వచ్చిన ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ ‘మరకతమణి’ 2017లో విడుదలై.. ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకి కొనసాగింపుగా ‘మరకతమణి 2’ని పట్టాలెక్కించారు ఆది.
- ఆ పాటలు వాడొద్దు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. సరిగమ సంగీత సంస్థకు, ఆయనకు కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించి దిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- వెబ్‌సిరీస్ కోసం! ‘క’, ‘కె-ర్యాంప్’ విజయాలతో జోరు మీదున్నారు యువ హీరో కిరణ్ అబ్బవరం. ఇప్పుడాయన ఓటీటీలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ దర్శకత్వంలో ముస్తాబు
- గ్రామీణ కథ ‘సెయాన్’ ‘సెయాన్’ సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు శివ కార్తికేయన్. ‘అమరన్’ విజయం తర్వాత ఆయన.. కమల్‌హాసన్ సొంత నిర్మాణ సంస్థలో చేస్తున్న రెండో చిత్రమిది. శివకుమార్ మురుగేశన్ తెరకెక్కిస్తున్నారు.
- అలియాకు బాఫ్టా గౌరవం ప్రముఖ బాలీవుడ్ కథానాయిక అలియా భట్‌కు మరోసారి అంతర్జాతీయ గౌరవం దక్కింది. బాఫ్టా(బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్) 79వ ఎడిషన్ పురస్కారాలను అందించే ప్రెజెంటర్ల జాబితాను ప్రకటించింది.
- సంక్షిప్త వార్తలు (5) ప్రముఖ హిందీ సినీ రచయిత, నటుడు, సల్మాన్‌ఖాన్ తండ్రి సలీం ఖాన్(90) అనారోగ్య పరిస్థితుల కారణంగా మంగళవారం ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. జావేద్ అక్తర్‌తో కలిసి ఆయన రచన చేసిన ‘షోలే’, ‘దీవార్’, ‘డాన్’ చిత్రాలు భారతీయ చిత్రసీమలో నిలిచిపోయాయి.
English Translation
Roshan Kanakala: Mowgli.. No one disappoints

- A
- A+
- A++

Be sure to watch Mowgli in theatres. It will definitely not disappoint anyone,” said hero Roshan Kanakala. Sandeep Raj directed this movie in which he played the title role. Produced by TG Vishwaprasad and Kriti Prasad. Sakshi Madolkar is the heroine. A thank you meeting was organized in Hyderabad on Friday in the wake of the recent release of this movie. Hero Sai Durga Tej was the chief guest. On this occasion, he said, "Mowgli is the title we have seen on TV since childhood. Now it's a movie. Roshan introduced it to us. Sakshi, Bandi Saroj, Viva Harsha.. all acted brilliantly. Director Sandeep Raj recently tweeted that it is bad luck. In this industry there is no bad luck except hard work. Taninka wants to work hard and bring more good scripts to screen. Thanks to all the audience who are encouraging such good films. Producer TG Vishwaprasad said, "Thank you to the audience for accepting our small film like a big film." Roshan said.. "I bow my head to all the audience for supporting this Mowgli Gan. Sakshi acted brilliantly in this. Without producer Vishwaprasad, this film would not exist. Sakshi and Hemanth Madhukar participated in this program.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no need for correspondence in this matter.
"Hey Balwant is a movie full of good entertainment and strong emotions," said hero Suhas. Dhima confidently expressed that this is the fastest film she has completed in her career. She is confident that she will get the success she is waiting for.
Apart from sharing emotions with various roles on screen, actress Priyamani also entertains with action scenes. Now a new project to be made by a Hollywood production company has been added to her account.