Hardik Pandya: అరే.. టాప్ ప్లేస్‌ను మిస్ అయ్యానని అనుకొన్నా: హాఫ్ సెంచరీపై హార్దిక్

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: భారత్ తరఫున టీ20ల్లో రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని హార్దిక్ పాండ్య నమోదు చేశాడు. మరి దీనిపై హార్దిక్ పాండ్య ( Hardik Pandya) ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఓ సారి అంచనా వేయండి. ఎందుకంటే ఈ ఘనత యువరాజ్ సింగ్ (12 బంతుల్లో) పేరిట ఉంది. అతడిపై ఉన్న గౌరవాన్ని చెబుతూనే టాప్ ప్లేస్‌ను మిస్ అయినట్లు తన టీమ్‌తో చెప్పాడు. దక్షిణాఫ్రికాతో ఐదో టీ20లో 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ సందర్భంగా పాండ్య మాట్లాడాడు.
‘‘జట్టు విజయాల్లో మన భాగస్వామ్యం ఉంటే ఆ ఆనందమే వేరు. టీ20ల్లో భారత్ తరఫున రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశానని నాకు తొలుత తెలియదు. డగౌట్‌కు వెళ్లాక సోషల్ మీడియా సహచరులు చెప్పారు. అప్పుడు నేను ‘ అరే.. టాప్ ప్లేస్‌ను మిస్ అయ్యానే’ అనుకున్నా. కానీ, ఆ రికార్డు ఇప్పటికీ యువీ పాజీ పేరిటే ఉండటం ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్‌లో నేను తొలి బంతి నుంచే దూకుడుగా ఆడతానని ముందే సహచర బ్యాటర్‌కు చెప్పా. సిక్స్ కొట్టడంతో నా కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇలాంటి పరిస్థితులు నాకు చాలా సూట్ అవుతాయి. అందుకోసం చాలా శ్రమించా. రిస్క్ కూడా తీసుకున్నా. ఏం చేసినా సరే నాకు కలిసొచ్చింది. సవాళ్లను ఆస్వాదించడం నాకిష్టం. ఈ సిరీస్‌కు ముందే చాలా బలంగా నా ప్రదర్శన ఉండాలని భావించా. అందుకోసం నా సన్నద్ధత, ప్రణాళిక, శ్రమించే విధానం మాత్రం ఆపలేదు’’ అని హార్దిక్ వ్యాఖ్యానించాడు.
► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కోహ్లీతో బాబర్‌ను పోల్చడం అన్యాయం: దినేశ్ కార్తిక్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ స్టేజిలో టీమ్ఇండియాతో (Team India) జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ అజామ్ విఫలమయ్యాడు. 7 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు.
- భారత్‌తో మ్యాచ్‌లో.. పాకిస్థాన్ చేసిన తప్పిదం అదే: రవిచంద్రన్ అశ్విన్ పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా టీమ్‌ఇండియా (Team India), పాకిస్థాన్ కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా ఆదివారం తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
- వచ్చాడో బేబీ యువరాజ్ అతడి దేశంలో క్రికెట్‌కు అనుకూలమైన పరిస్థితుల్లేవ్.. ఏడాదికి మూడు నెలలే ఆట. అలాంటి చోట నుంచి క్రికెట్లో ఎదిగి జాతీయ జట్టుకు ఆడడమే గొప్ప. అలాంటిది ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం వచ్చింది.
- అజేయమేనా? హ్యాట్రిక్ విజయాలు.. గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారీ గెలుపు.. టోర్నీలో మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా అత్యధిక నెట్ రన్‌రేట్.. ఇలా టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా హవా మామూలుగా లేదు.
- ఆస్ట్రేలియా ఔట్ మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య గ్రూప్-బి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కంగారూ జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడిన ఆసీస్..
- కివీసూ ముందుకు టీ20 ప్రపంచకప్‌లో సమీకరణాలతో పని లేకుండా న్యూజిలాండ్ సూపర్-8కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-డి పోరులో కివీస్ 8 వికెట్ల తేడాతో కెనడాను చిత్తు చేసింది. మొదట కెనడా 4 వికెట్లకు 173 పరుగులు చేసింది.
- కంగారు పడింది.. ఎన్నోసార్లు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఆస్ట్రేలియా, ప్రపంచకప్ అనగానే టాప్ ఫామ్‌ను అందుకునే జట్టు టీ20 ప్రపంచకప్ నుంచి ఇంత త్వరగా నిష్క్రమించడం ఏమాత్రం ఊహించనిదే.
- పాక్ నిలుస్తుందా? టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు భవితవ్యం బుధవారం తేలిపోనుంది. గత మ్యాచ్‌లో భారత్ చేతిలో గట్టి దెబ్బ తిన్న పాకిస్థాన్.. తన చివరి గ్రూప్ పోరులో నమీబియాను ఢీకొనబోతోంది.
- ముగింపులో నేపాల్ మెరుపు పెద్ద జట్టు ఇంగ్లాండ్‌పై విజయానికి అత్యంత చేరువగా వెళ్లి, త్రుటిలో ఓడిన నేపాల్.. టీ20 ప్రపంచకప్‌ను అదిరే విజయంతో ముగించింది. గ్రూప్-సిలో తొలి మూడు మ్యాచ్‌లూ ఓడి సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించిన ఆ జట్టు.. స్కాట్లాండ్‌తో మంగళవారం చివరి పోరులో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
- సంక్షిప్త వార్తలు (5) రంజీ ట్రోఫీలో జమ్ముకశ్మీర్ చరిత్రకు చేరువైంది. బ్యాటింగ్.. బౌలింగ్‌లో స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో సత్తాచాటుతున్న ఆ జట్టు రంజీ చరిత్రలో తొలిసారిగా ఫైనల్ దిశగా అడుగులేస్తోంది.
- శర్మా.. మొదట నువ్వు సింగిల్ తీసుకో: సునీల్ గావస్కర్ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
- యువరాజ్ సింగ్ పేరు.. శతకంతో రికార్డ్: కెనడా ‘యువీ’ సెన్సేషన్ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.