
నేనిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వండి
నర్సాపూర్ రూరల్:మండలంలోని కాగజ్‌మద్దూర్‌లో బుధవారం సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని నిమిషాల్లోనే పై సల లొల్లి మొదలైంది. పంచాయతీ ఈసారి మహిళకు రిజర్వు కావడంతో మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు వారి భార్యలను బరిలో నిలిపారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఓ మండల స్థాయి నాయకుడు విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంచినట్లు తెలిసింది. ఇంతటితో ఆగకుండా రెండు కుల సంఘాలకు 1.50 లక్షల చొప్పున ముట్ట జెప్పినట్లు తెలిసింది. మరికొన్ని కుల సంఘాలకు వ్యక్తిగతంగా వారి వారి కుటుంబంలో ఉన్న ఓట్ల సంఖ్యను బట్టి రూ. 500 నుంచి రూ. 10 వేల వరకు ఇచ్చారు. దీనికి తోడు మద్యం, బిర్యానీ పొట్లాలు సైతం పంపిణీ చేశారు. ఇంత చేసినా ఓటమి చెందటంతో ఆ నాయకుడు, అతడి వర్గీయులు కలిసి కుల సంఘాలను దుర్భాషలాడుతూ ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో రెండు కుల సంఘాలకు చెందిన వారు తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చినట్లు తెలిసింది. అలాగే ఓట్ల కోసం డబ్బులు తీసుకున్న మరికొంత మంది సైతం తిరిగి డబ్బులు వాపస్ ఇచ్చినట్లు సమాచారం.
అప్పుడు తల్లి, తండ్రి.. ప్రస్తుతం కొడుకు
నర్సాపూర్ రూరల్:మండలంలోని జక్కపల్లికి చెందిన దుప్తల భ రత్ బీటెక్ పూర్తి చేసి సర్పంచ్‌గా పోటీ చేసి గెలుపొందాడు. అయితే గత సర్పంచ్‌గా అతడి తల్లి వెంకటలక్ష్మి గెలుపొందింది. అంతకు ముందు తండ్రి శ్రీనివాస్ గ్రామ సర్పంచ్‌గా పని చేశాడు. వరుసగా మూడుసార్లు ఒ కే కుటుంబానికి సర్పంచ్ గిరి వరించింది.
అన్నపై.. తమ్ముడి గెలుపు
కౌడిపల్లి(నర్సాపూర్):మండలంలోని కూకుట్లపల్లిలో సర్పంచ్ పదవికి అన్నదమ్ములు పోటీపడ్డారు. కాంగ్రెస్ మద్దతుదారుగా అన్న నీరుడి అశోక్, బీఆర్‌ఎస్ తరపున తమ్ముడు కుమార్ పోటీ చేశారు. గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. చివరికి అన్నపై తమ్ముడు కుమార్ 197 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందాడు.
చిన్న కోడలును వరించిన పదవి
కౌడిపల్లి(నర్సాపూర్):సర్పంచ్ పదవికి తోటికోడళ్లు పోటీపడగా, చివరికి చిన్న కోడలును గెలుపు వరించింది. మండలంలోని పంచాయతీలో గత ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్ జీవుల ఈసారి తన భార్య జమ్కి బీఆర్‌ఎస్ మద్దతుదారు గా పోటీ చేసింది. అతడి తమ్ముడు చెన్న భార్య లక్ష్మి కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. దీంతో తండాలో తోటి కోడళ్ల పోరులో చివరికి చిన్న కోడలు లక్ష్మి గెలుపొందింది.
ఓటమి ఎరుగని కుటుంబం
నర్సాపూర్ రూరల్:మండలంలోని లింగాపూర్‌కు చెందిన బోర్లపు శ్రీనివాస్‌గుప్తా కుటుంబం 1988 నుంచి రిజర్వేషన్ కలిసి వచ్చిన ప్రతీసారి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో శ్రీనివాస్‌గుప్తా భార్య రాజకళ సర్పంచ్‌గా గెలుపొందారు. గతంలో సైతం రాజకళ సర్పంచ్‌గా పనిచేశారు. శ్రీనివాస్‌గుప్తా రెండు పర్యాయాలు లింగాపూర్ సర్పంచ్‌గా, రెండుసార్లు లింగాపూర్ ఎంపీటీసీగా, 2006లో నర్సాపూర్ జెడ్పీటీసీగా గెలుపొందారు. అతని తండ్రి సైతం లింగాపూర్ సర్పంచ్‌గా పనిచేశారు. తండ్రి ఆశయ సాధనలో భాగంగా మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే బోర్లపు కుటుంబం కొనసాగుతూ వస్తోంది.
మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలి
మెదక్ కలెక్టరేట్/చిలప్‌చెడ్(నర్సాపూర్):కౌడిపల్లి మండలం తునికి సర్పంచ్ ఓట్ల లెక్కింపులో అక్రమాలు జరిగాయని, మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలని సర్పంచ్ అభ్యర్థి స్వాతి డిమాండ్ చేశా రు. ఈ మేరకు గురువారం డీపీఓ కార్యాలయంలో ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు బీఆర్‌ఎస్‌కు వత్తా సు పలికారని ఆరోపించారు. ఓట్లను లెక్కించే సమయంలో ఫిజికల్‌గా తమకు చూపించలేదని ఆరోపించారు. ఫలితాల లెక్కింపులో అవకతవకలు జరిగాయని బండపోతుగల్ బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్ధి రామయ్యగారి రజిత తన మద్దతుదారులతో కలిసి ఎంపీడీఓ ప్రవీణ్‌కు వినతిపత్రం అందజేశారు. మొత్తం 786 ఓట్లు పోల్ కాగా, తనకు 386 ఓట్లు, ప్రత్యర్థికి 389 ఓట్లు వచ్చాయని తెలిపారు. మిగితా 11 బ్యాలెట్ పేపర్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ విషయమై అధికారులు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. ఫలితాలపై విచారణ చేయాలని కోరారు.
సర్పంచ్ పీఠంపై పట్టభద్రుడు
కొల్చారం(నర్సాపూర్):పోతంశెట్టిపల్లి సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన అభ్యర్థి పాతూరి దయాకర్‌గౌడ్ విజయం సాధించాడు. ఎంఏ, బీఈడీ పూర్తి చేసిన దయాకర్ పార్లమె ంట్ ఎన్నికలకు ముందు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు. సమీప స్వతంత్ర అభ్యర్థిపై 256 ఓట్ల మెజార్టీతో గెలిచాడు.
English Translation

Return my money Give
Narsapur Rural:The uproar started within minutes of the declaration of election results in Kagazmaddur of the mandal on Wednesday evening. As panchayat is reserved for women this time, three leaders from three parties fielded their wives. It is known that a mandal level leader distributed alcohol and money in a way that was determined to win at any cost. Not stopping at this, it is known that two caste communities have been besieged at the rate of 1.50 lakh each. For some other caste communities individually Rs. 500 to Rs. 10 thousand was given. Besides this, liquor and biryani packets were also distributed. After being defeated, the leader and his followers insisted on returning the money given to them by abusing the caste groups. It is known that the people belonging to two caste groups have returned the money. Also, it is reported that some other people who took money for votes have returned the money.
Then mother, father.. now son
Narsapur Rural:Duptala Bharat from Jakkapally in Mandal completed his B.Tech and contested as Sarpanch and won. But his mother Venkata Lakshmi won as the previous sarpanch. Before that, father Srinivas worked as village sarpanch. Sarpanch has been given to O K family three times in a row.
Anna.. Brother's victory
Kaudipalli (Narsapur):Brothers contested for the post of Sarpanch in Kukutlapalli of Mandal. Neerudi Ashok, who was a supporter of Congress, and younger brother Kumar contested on behalf of BRS. Campaigned hard for victory. In the end, younger brother Kumar won against Anna with a huge majority of 197 votes.
Chinna Kodalu won the post
Kaudipalli (Narsapur):When sisters-in-law competed for the post of sarpanch, in the end, Chinna Kodalu won. In the last election in the panchayat of the mandal, Sarpanch Jiva, who was unanimous, contested this time with his wife Jamki as a BRS supporter. His younger brother Chenna's wife Lakshmi contested on behalf of Congress. Thus, the youngest daughter-in-law Lakshmi won in the end in the fight of fellow daughters-in-laws in Tanda.
Undefeated family
Narsapur Rural:The family of Borlapu Srinivasgupta from Lingapur in Mandal has competed and won every time the reservation came together since 1988. Srinivasgupta's wife Rajkala won as sarpanch in the recently held panchayat elections. Earlier also served as Rajkala Sarpanch. Srinivasgupta won two terms as Sarpanch of Lingapur, MPTC of Lingapur twice and Narsapur ZPTC in 2006. His father also served as Sarpanch of Lingapur. The Borlapu family has been continuing in the Congress since the beginning as a part of his father's ambition.
Counting of votes should be re-counted
Medak Collectorate/Chilapched (Narapur):Sarpanch candidate Swathi has demanded that there were irregularities in the counting of votes for Tuniki Sarpanch of Kaudipalli Mandal. Rs. In this regard, a complaint was submitted at the DPO office on Thursday. On this occasion, she said.. The officials have accused the BRS of doing wrong. They alleged that they were not physically shown during the counting of votes. Candidate Ramayyagari Rajitha along with his supporters handed over a petition to MPDO Praveen, alleging that there were irregularities in the calculation of the results. A total of 786 votes were polled and he got 386 votes while his opponent got 389 votes, he said. He asked what happened to the remaining 11 ballot papers. Officials have not given any answer in this regard. He asked for an inquiry into the results.
Sarpanch seat graduate
Kolcharam (Narapur):BJP-backed candidate Pathuri Dayakargoud won as Sarpanch of Pothamshettipalli. Dayakar, who completed his MA and BED, served as the mandal party president before the parliamentary elections. He won by a majority of 256 votes against the nearest independent candidate.