-జనరల్‌ స్థానాల్లో వారికే ఎక్కువ సీట్లు

-91 స్థానాల్లో జెండా ఎగురవేసిన బీసీలు

-రిజర్వేషన్‌ కోటా కింద మరో 23 స్థానాలు

-జిల్లాలో 114 సీట్లు కైవసం

-మొత్తంగా 38 శాతం స్థానాల్లో పాగా

మంచిర్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పంచా యతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వెనుకబడ్డ కులస్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడం ద్వారా తమ ఉనికిని మరోసారి నిరూపించుకున్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చే యాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి హై కోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండ కూడదన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వ నిర్ణయాన్ని కొం దరు హై కోర్టులో సవాల్‌ చేశారు. హై కోర్టు కూడా అ దే అంశాన్ని ప్రస్తావిస్తూ 42 శాతం అమలు చేయడా న్ని వ్యతిరేకించింది. దీంతో ప్రత్యామ్నాయ చర్యలు చే పట్టిన రాష్ట్ర ప్రభుత్వం అన్‌ రిజర్వ్‌డ్‌ స్థానాల్లో బీసీలకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. అయితే ముందుగా నిర్ణయించినట్లు 42 శాతం రిజర్వేష న్లు కాకుండా ఆ సంఖ్యకు దగ్గరగా ఉండేలా జనరల్‌ స్థానాలను ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించేలా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వెనుకబడ్డ కులస్థులకు రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేయ డం కష్టసాఽధ్యమైన నేపథ్యంలో...పార్టీ పరంగా ఆ మే ర కు అవకాశం కల్పించినట్లు సమాచారం.

జనరల్‌ కేటగరీలో బీసీలకు అవకాశం....

సుప్రీం కోర్టు గైడ్‌ లైన్స్‌ ఆధారంగా అన్ని కేటగరీల రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదన్న నిబం ధన ఉంది. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కులగణన సర్వే ప్రకారం బీసీలు 50 శాతానికి పైగా ఉండటంతో, జనా భా దామాషా రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వం ఆ సామాజిక వర్గానికి చెందిన వారికి 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మిం చి ఉండరాదన్న సుప్రీం కోర్టు ఆదేశాలతో పునరా లో చనలో పడ్డ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనరల్‌ కేటగరీలో అవకాశం కల్పి స్తూ నిర్ణయం తీసుకుంది. అధికారికంగా బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు కల్పించగా, మిగతా స్థానాలకు జనర ల్‌ కేటగరీ నుంచి అవకాశం కల్పించారు.

జనరల్‌కు 44.8 శాతం సీట్లు....

జిల్లాలోని 306 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు ని ర్వహించగా, వాటిలో ఏజెన్సీ పంచాయతీలు 35 ఉన్నా యి. వాటితోపాటు నాన్‌ ఏజెన్సీ కింద మరో 268 గ్రామ పంచాయతీలు ఉండగా, ప్రత్యేకంగా షెడ్యూల్‌ ట్రైబ్‌ జీ పీలు మూడు ఉన్నాయి. జిల్లాలోని మొత్తం 306 పం చాయతీల్లో జనాభా దామాషాన వివిధ వర్గాలకు సీట్లు కేటాయించారు. సర్పంచ్‌ స్థానాల్లో ఎస్టీ కేటగిరీకి 21.2 శాతం కోటా కింద మొత్తం 65 సీట్లు కేటాయించారు. అలాగే ఎస్సీ కేటగరీలో 26.5 శాతం కింద 81 స్థానాలు, బీసీ కేటగరీలో 7.5 శాతంతో 23 సీట్లు కేటాయించారు. అలాగే అన్‌ రిజర్వుడ్‌ కోటాలో 44.8 శాతంతో మరో 137 సీట్లు కేటాయించారు. అదే మాదిరిగా వార్డు సభ్యు ల స్థానాల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలు కల్పించారు. జిల్లాలోని 2680 వార్డు స్థానాలకు గాను ఏజెన్సీ ఏరి యాలో 204, నాన్‌ ఏజెన్సీ ఏరియాలో 2452 స్థానాలు ఉండగా, వంద శాతం ఎస్టీ వార్డులు 24 ఉన్నాయి. మొత్తం వార్డుల సంఖ్యలో ఎస్టీలకు 17 శాతం రిజర్వేష న్‌ కింద 457 స్థానాలు, 22 శాతం రిజర్వేషన్‌తో ఎస్సీ లకు 599, బీసీలకు 12.4 శాతం రిజర్వేషన్‌తో 334 స్థా నాలు కేటాయించగా, 48.13 శాతంతో జనరల్‌ కేటగరీకి 1290 సీట్లు రిజర్వ్‌ చేశారు.

38 శాతం సీట్లు బీసీల కైవసం...

పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జిల్లాలో మొత్తంగా 38 శాతం సీట్లు దక్కాయి. అధికారికంగా ఆ సామాజిక వర్గానికి 7.5 శాతం రిజర్వేషన్‌ కింద 23 సీట్లు కేటా యించారు. అలాగే జిల్లాలో జనరల్‌ కేటగరీకి 44.8 కిం ద 137 స్థానాలను కేటాయించారు. వీటిలో బీసీలకు కే టాయించిన 23 సీట్లతోపాటు జనరల్‌ కేటగరీ నుంచి మరో 91 స్థానాలను బీసీలు కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలో బీసీలు మొత్తంగా 114 సర్పంచ్‌ సీట్లను గెలు చుకోగా, 37.74 శాతం స్థానాల్లో ఆ సామాజిక వర్గం నాయకులు పాగా వేశారు. ఈ లెక్కన బీసీలకు అనధి కారికంగా దాదాపు 38 శాతం రిజర్వేషన్‌ అమలు చేసిన ట్లయింది. బీసీలు గెలిచిన జనరల్‌ కేటగరీ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ సహా బీఆర్‌ఎస్‌, బీజేపీలు బలపరిచిన అభ్యర్థులు ఉండటంతో.... అన్ని ప్రధాన పార్టీలు ఆ సా మాజిక వర్గానికే పెద్దపీట వేశాయన్న ప్రచారం పల్లెల్లో జోరుగా జరుగుతోంది.


English Translation

-Most of the seats in general positions

-BCs who raised the flag in 91 seats

-23 more seats under reservation quota

-114 seats won in the district

-Total 38 percent seats won

Manchiryala, December 19 (Andhra Jyoti): Pancha Yati Backward castes across the district proved their presence once again by winning the most seats in the elections. It is known that the High Court put brakes on the state government's decision to implement 42 percent reservation for BC social groups in Sarpanch elections. According to the Supreme Court's order that reservations should not be more than 50 percent, some challenged the government's decision in the High Court on the implementation of BC reservations. The High Court also cited the same point and opposed the implementation of 42 percent. As a result, the state government, which has taken alternative measures, has decided to give priority to BCs in unreserved seats. However, it seems that it has been decided to allocate the general positions to the candidates belonging to that social group, instead of the 42 percent reservation as decided earlier. In the background of difficult implementation of reservations for backward castes officially... it is reported that they have been given an opportunity in terms of the party.

An opportunity for BCs in the general category...

Based on the Supreme Court guidelines, there is a provision that reservation for all categories should not be more than 50 percent. As per the comprehensive caste census survey conducted in the state, as the BCs are more than 50 percent, it is known that the Congress state leadership has decided to provide 42 percent reservation to those belonging to that social group in order to provide proportionate reservation to the population. Relieved by the Supreme Court's order that the total reservation should not exceed 50 percent, the government has taken corrective measures. As a part of this, a decision was taken by giving an opportunity in the general category. Officially, 23 percent reservation has been given to the BCs, while the rest of the seats have been given an opportunity from the general category.

44.8 percent seats for the general...

While the elections were held in 306 gram panchayats of the district, 35 of them are agency panchayats. Apart from them, there are 268 Gram Panchayats under non-agency, especially Schedule Tribe GPs and three. In total 306 pan chayats in the district, seats are allotted to different communities in proportion to the population. A total of 65 seats have been allotted to the ST category under a quota of 21.2 percent in Sarpanch posts. Also, 81 seats under 26.5 percent in SC category and 23 seats in BC category with 7.5 percent have been allotted. Also, another 137 seats with 44.8 percent of the unreserved quota have been allotted. Similarly, BCs have been given the highest number of ward member posts. Out of 2680 ward seats in the district, 204 seats are in agency area, 2452 seats are in non-agency area and 24 are 100 percent ST wards. Out of the total number of wards, 457 seats are reserved for STs under 17 percent reservation, 599 seats are reserved for SCs with 22 percent reservation, 334 seats are reserved for BCs with 12.4 percent reservation, and 1290 seats are reserved for general category with 48.13 percent.

38 percent seats are reserved for BCs. Kaivasam...

BCs got a total of 38 percent seats in the district in the panchayat elections. Officially, 23 seats have been allotted to that social group under 7.5 percent reservation. Also, 137 seats out of 44.8 have been allocated to the general category in the district. Out of these, 23 seats won by BCs and another 91 seats from general category were won by BCs. In this order, BCs won a total of 114 Sarpanch seats, while the leaders of that social group won 37.74 percent of the seats. According to this calculation, about 38 percent reservation has been implemented unofficially for BCs. In the general category seats won by BCs, there are candidates supported by BRS and BJP including the ruling Congress.... The campaign is going on in the villages that all the major parties have given priority to the social class.