IND vs SA: వరుణ్‌ మ్యాజిక్‌తో సఫారీలు చిత్తు.. టీమ్‌ఇండియాదే పొట్టి సిరీస్‌

Eenadu icon
By Sports News Team Updated : 20 Dec 2025 01:53 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

టీమ్‌ఇండియా 2025వ ఏడాదిని అద్భుతంగా ముగించింది. వరుసగా రెండు సిరీస్‌లను నెగ్గింది. మరికొద్ది రోజుల్లో పొట్టి ప్రపంచ కప్‌ ప్రారంభం కానున్న వేళ.. భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సఫారీలను చిత్తు చేసింది. ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇక భారత పర్యటనను టెస్టు సిరీస్‌ విజయంతో మొదలు పెట్టిన  సఫారీలకు షాక్‌ తగిలింది. వన్డే, టీ20 సిరీస్‌లను కోల్పోయి ఓటమితో ఇంటిముఖం పట్టింది. 

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ 30 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 20 ఓవర్లలో 231 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో సఫారీ జట్టు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. వరుణ్ చక్రవర్తి (4/54) మ్యాజిక్‌తో దక్షిణాఫ్రికాను చిత్తు చేశాడు. ఐదు టీ20ల సిరీస్‌ను 3-1 తేడాతో టీమ్‌ఇండియా సొంతం చేసుకుంది. లఖ్‌నవూలో జరగాల్సిన నాలుగో మ్యాచ్‌ మంచు కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 8 టీ20 సిరీస్‌లను టీమ్‌ఇండియా గెలుచుకోవడం విశేషం. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా హార్దిక్ పాండ్య, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా వరుణ్‌ చక్రవర్తి నిలిచారు.

చెలరేగిన పాండ్య, తిలక్..

మంచు ప్రభావం కారణంగా లక్ష్య ఛేదన సులువుగా మారుతుంది. అందుకే టాస్‌ నెగ్గిన సఫారీ జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. స్కోరు బోర్డుపై భారీ టార్గెట్‌ ఉంచితేనే మ్యాచ్‌పై పట్టు సాధించే అవకాశం ఉందని మన బ్యాటర్లు ముందే గ్రహించారు. అందుకు తగినట్టుగానే పవర్‌ ప్లేలో టీమ్‌ఇండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ (34), సంజు శాంసన్‌ (37) తొలి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 63 పరుగులు జోడించారు. గిల్ స్థానంలో వచ్చిన ఛాన్స్‌ను సంజు అద్భుతంగా ఒడిసిపట్టాడు. దూకుడుగా ఆడి పరుగులు రాబట్టాడు. అయితే, కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్ (5) మరోసారి విఫలమయ్యాడు. కానీ, ఆ లోటును కనిపించకుండా తిలక్‌ వర్మ (73) హార్దిక్ పాండ్య (63) అదరగొట్టారు. నాలుగో వికెట్‌కు ఏకంగా 105 పరుగులు జోడించి భారత్‌కు భారీ స్కోరు అందించారు. ఈ క్రమంలో హార్దిక్‌ 16 బంతుల్లోనే రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీని నమోదు చేశాడు. శివమ్‌ దూబె (3 బంతుల్లో 10 పరుగులు) వచ్చీ రాగానే ఫోర్, సిక్స్‌ బాదాడు. సఫారీ బౌలర్లలో బాష్ 2, బార్ట్‌మన్, లిండే చెరో వికెట్‌ తీశారు.

వరుణ్ దెబ్బకు..

దక్షిణాఫ్రికా ఆరంభం చూస్తే టీమ్‌ఇండియా నిర్దేశించిన 232 పరుగుల టార్గెట్‌ ఏమాత్రం సరిపోదేమో అనిపించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ఓపెనర్ క్వింటన్ డికాక్ (65) చెలరేగాడు. భారత టాప్‌ బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్‌ను టార్గెట్‌ చేస్తూ తొలి ఓవర్‌లోనే మూడు బౌండరీలు రాబట్టాడు. ఆ తర్వాత కూడా డికాక్ అదే దూకుడు కొనసాగించాడు. అయితే, పవర్‌ ప్లేలో అనూహ్యంగా వరుణ్‌ను కాదని వాషింగ్టన్ సుందర్‌తో కెప్టెన్ సూర్య మూడు ఓవర్లు వేయించాడు. అతడు కట్టడి చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకోగలిగింది. లేకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారేది. ఈ క్రమంలో  బౌలింగ్‌కు వచ్చిన వరుణ్‌ తన తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి టీమ్‌ఇండియాకు బ్రేక్‌ ఇచ్చాడు. రీజా హెండ్రిక్స్ (13)ను ఔట్ చేశాడు.

అయితే, వచ్చీ రావడంతోనే టాప్‌ గేర్‌లో బ్యాటింగ్‌ చేసిన డేవాల్డ్ బ్రెవిస్‌ (31) డేంజరస్‌గా కనిపించాడు. హార్దిక్‌ పాండ్య వేసిన స్లో షార్ట్‌పిచ్‌ బంతికి బ్రెవిస్‌ దొరికిపోయాడు. బౌండరీ లైన్‌ వద్ద సుందర్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. మరోవైపు డికాక్ మాత్రం పరుగులు రాబడుతూనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, వరుణ్‌ తన రెండో స్పెల్‌లో కీలకమైన ఐదెన్ మార్‌క్రమ్‌ (6), ఫెర్రీరా (0)ను వరుస బంతుల్లో ఔట్ చేయగా.. లిండే (16)ను కూడా పెవిలియన్‌కు పంపి భారత్‌ విజయావకాశాలను మెరుగుపర్చాడు. కీలకమైన డికాక్‌ను బుమ్రా రిటర్న్‌ క్యాచ్‌తో ఔట్ చేసి సఫారీలను దెబ్బకొట్టాడు. ఆఖర్లో మార్కో యాన్సన్‌ (14), బాష్ (17) కాస్త పోరాడినా తమ జట్టును గెలిపించుకోలేకపోయారు. భారత బౌలర్లలో వరుణ్‌ 4, బుమ్రా 2.. అర్ష్‌దీప్‌, పాండ్య చెరో వికెట్ తీశారు.


► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Dec 2025 22:59 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • కప్‌ మీద కాళ్లు.. అప్పటి నుంచి ఆసీస్‌కు తిప్పలు! ఐసీసీ ఈవెంట్లలో ఆస్ట్రేలియా (Australia) ప్రదర్శన దారుణంగా పడిపోతూ వస్తోంది.
  • యువరాజ్‌ సింగ్‌ పేరు.. శతకంతో రికార్డ్‌: కెనడా ‘యువీ’ సెన్సేషన్‌ Yuvraj Samra: ప్రస్తుతం పొట్టి ప్రపంచకప్‌లో ఓ కుర్రాడి పేరు నెట్టింట మార్మోగుతోంది. అతి చిన్న వయసులో టీ20 ప్రపంచకప్‌లో శతకంతో అదరగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 
  • ఐర్లాండ్‌ - జింబాబ్వే మ్యాచ్‌ రద్దు.. ఆస్ట్రేలియాకు షాక్‌! టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా షెడ్యూల్‌ ప్రకారం మధ్యాహ్నం 3.00 గంలకు ఐర్లాండ్‌, జింబాబ్వే మధ్య మ్యాచ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం వల్ల మ్యాచ్‌ జరగలేదు.
  • తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ జరిగి నేటికి సరిగ్గా 21 ఏళ్లు! ప్రస్తుతం భారత్‌, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2026 జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే మొదటి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఏ ఏ జట్ల మధ్య ఎప్పుడు జరిగిందో తెలుసా..
  • శర్మా.. మొదట నువ్వు సింగిల్‌ తీసుకో: సునీల్‌ గావస్కర్‌ టీమ్ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) బ్యాటింగ్‌లో తడబడుతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌లో అతడు ఇప్పటి వరకు రెండు మ్యాచులు ఆడితే రెండింట్లోనూ డకౌట్‌గా వెనుదిరిగాడు.
  • టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8... మిగిలిన ఒక్క బెర్తు ఎవరికి? టీ20 ప్రపంచకప్‌ సూపర్‌ 8 దశకు ఏడు టీమ్‌లు క్వాలిఫై అవ్వగా.. మరో స్థానం పెండింగ్‌లో ఉంది.
  • రచిన్‌ రవీంద్ర, గ్లెన్‌ ఫిలిప్స్‌ హాఫ్‌ సెంచరీలు.. కెనడాపై న్యూజిలాండ్‌ ఘన విజయం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా పొట్టిప్రపంచకప్‌లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 
  • ఇమ్రాన్‌ఖాన్‌కు అనారోగ్యం.. పాకిస్థాన్‌కు కపిల్‌దేవ్, గావస్కర్ రిక్వెస్ట్ Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు మెరుగైన చికిత్స అందించాలని దిగ్గజ క్రికెటర్లు పాక్‌ను కోరారు. 
  • అభిషేక్‌ శర్మ.. అభిమన్యుడు కాదు అర్జునుడు అతడు..! టీమ్‌ఇండియా (Team India) టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) పేరు చెబితే సునామీ ఇన్నింగ్స్‌లే గుర్తుకువస్తాయి. ప్రత్యర్థి బౌలర్లను అతడు హడెలెత్తించే ఊచకోతే జ్ఞప్తికి వస్తుంది. కానీ.. అభిషేక్‌ శర్మ గత కొన్ని ఇన్నింగ్స్‌లుగా తడబడుతున్నాడు.
  • యువరాజ్‌ సమ్రా సూపర్‌ సెంచరీ.. న్యూజిలాండ్‌ విజయ లక్ష్యం 174 టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌, కెనడా జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్‌ గెలిచిన కెనడా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 173 పరుగులు చేసింది.
  • గౌతమ్‌ గంభీర్‌కు కీలక పదవిని ఆఫర్‌ చేసిన రాజస్థాన్‌ రాయల్స్‌! ప్రస్తుతం టీమ్ఇండియా (Team India) హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న గౌతమ్‌ గంభీర్‌కు (Gautam Gambhir) ఐపీఎల్‌ (IPL) ఫ్రాంఛైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ (Rajasthan Royals) కీలక పదవిని ఆఫర్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
  • తిరుమల శ్రీవారి సేవలో అమెరికా క్రికెటర్లు తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు.
  • తూచ్‌.. నేను నఖ్వీని అలా అనలేదు..: మాట మార్చిన షోయబ్‌ అక్తర్‌! పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ 24 గంటలైనా గడవక ముందే మాట మార్చాడు. తాను పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డ్‌ (PCB) అధ్యక్షుడు నఖ్వీని అసమర్థుడు, నిరక్షరాస్యుడు అనలేదని యూటర్న్‌ తీసుకున్నాడు.
  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.