ప్రపంచ వ్యాప్తంగా వందలాది రకాల సాలె పురుగుల జాతులు ఉన్నాయి. వాటిలో 90 శాతం వరకు విషపూరితమైనవి కాదు. మిగిలిన 10 శాతం విషపూరితమైనవి. విషపూరితమైన సాలె పురుగులు కుడితే మన పరిస్థితి విషమంగా మారుతుంది. కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. తాజాగా, ఓ యువతిని విషపూరితమైన సాలె పురుగు కరిచింది. సాలె పురుగు కాటు వేయటం వల్ల ఆ యువతి పరిస్థితి దారుణంగా తయారైంది. ఆమె చర్మం పెచ్చులు పెచ్చులుగా ఊడిపోసాగింది. పాము కుబుసం విడిచినట్లుగా పరిస్థితి మారిపోయింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన మైనిత అనే యువతికి మే 17వ తేదీన బ్రౌన్ రెక్లెస్ స్పైడర్ కరిచింది. అది కరిచిన కొన్ని గంటల్లోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కోమాలోకి సైతం వెళ్లింది. రెండు వారాల పాటు ఆస్పత్రిలో చికత్స తీసుకోవాల్సి వచ్చింది. అయినా ఆమె ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. సరిగా నడవ లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల పాటు ఆమె గుండె కొట్టుకునే వేగం 140 నుంచి 160 వరకు ఉండింది. పాము కుబుసం విడిచినట్లుగా చర్మం ఊడిపోతూ ఉంది. మైనిత పూర్తిగా కోలుకోవడానికి నెలల సమయం పట్టింది.
తన పరిస్థితి గురించి మైనిత తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. ఆ పోస్టులో తన పరిస్థితి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. చర్మం ఊడిపోతున్న వీడియోను కూడా షేర్ చేసింది. సంఘటన జరిగిన నెలల తర్వాత మైనిత వీడియో మరో సారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు రెడ్డిట్‌లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఇక, ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు.
ఇవి కూడా చదవండి
విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేతకు రూ.451 కోట్లు
Updated Date - Dec 19 , 2025 | 11:27 AMEnglish Translation
Terrifying Spider Bite: What did the spider do.. Because of that venom..
ABN, Publish Date - Dec 19 , 2025 | 07:14 AM
A young woman was bitten by a poisonous spider. The young woman's condition worsened due to the spider bite. Her skin was blistered. The situation has changed like a snake leaving its mouth.

There are hundreds of species of spiders around the world. Up to 90 percent of them are non-toxic. The remaining 10 percent are toxic. If we are bitten by poisonous spiders, our condition becomes dire. Sometimes there is a possibility of loss of life. Recently, a young woman was bitten by a poisonous spider. The young woman's condition worsened due to the spider bite. Her skin was blistered. The situation has changed like a snake leaving its mouth. Going into the full details of the incident..
A young woman named Mynita from America was bitten by a brown reckless spider on May 17. Within hours of being bitten, her health deteriorated. She also went into a coma. He had to be treated in the hospital for two weeks. However, there was no significant change in her health condition. A situation has arisen that does not work properly. For a few days her heart rate was between 140 and 160. The skin is flaking off like a snake shedding its venom. It took months for Mainita to fully recover.
Mainita made a post on her social media account about her condition. She became emotional while talking about her condition in that post. She also shared a video of the skin being blown off. Months after the incident, Mainita's video once again went viral on social media. The tribe is doing the rounds on Instagram as well as Reddit. And, the netizens reacting to the video are saying oh my god.
Also read
Visakhapatnam to Delhi.. via Secunderabad..
Winner of Football World Cup Rs.451 Crores
Updated Date - Dec 19, 2025 | 11:27 AMSubscribe