
స్మృతి చేతుల మీదుగా క్యాప్ అందుకున్న నికీ (PC: BCCI Women X)
భారత మహిళల క్రికెట్ జట్టు స్వదేశంలో జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. ఇందులో భాగంగా రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం నాటి తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక ఈ సిరీస్‌తో భారత జట్టు పూర్తిస్థాయి కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన ప్రయాణం మొదలుపెట్టింది.
అందుకే ముందుగా బౌలింగ్
అంతేకాదు రాయ్‌పూర్‌లో మహిళల అంతర్జాతీయ క్రికెట్లో ఇదే తొలి మ్యాచ్ కావడం మరో విశేషం. ఇక టాస్ సందర్భంగా భారత జట్టు సారథి స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘‘మంచు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ముందుగా ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. చాంపియన్స్ ట్రోఫీకి సన్నద్ధమయ్య క్రమంలో మేము ఎక్కువగా రాత్రి వేళల్లో మంచు పడే వేళ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
తుదిజట్టు ఎంపిక కష్టమే
కాబట్టి ఇది సరైన నిర్ణయం అనుకుంటున్నాం. మా జట్టులో ప్రతిభావంతులైన యువ ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. కాబట్టి తుదిజట్టు ఎంపిక కాస్త కష్టంగానే ఉంటుంది. ఇక ఈరోజు మేము ముగ్గురు పేసర్లు, ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ ఆరో ఆప్షన్‌గా ఉంటుంది.
వాళ్లకు చోటు లేదు
అయితే, జట్టు కూర్పు దృష్ట్యా దురదృష్టవశాత్తూ ప్రేమా రావత్, జింతిమణి కలిత, మిన్ను మణి, కమలిని తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వారంతా మంచి ప్లేయర్లే. కానీ ప్రస్తుత కాంబినేషన్లో వాళ్లకు అవకాశం లేకుండా పోయింది.
ఈరోజు నికీ ప్రసాద్ అరంగేట్రం చేస్తోంది. ఇక కెప్టెన్‌గా గతంలోనూ జట్టును ముందుకు నడిపించాను. మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ సారథిగా నాకు అనుభవం ఉంది. కాబట్టి కెప్టెన్సీ గురించి కొత్తగా ఆలోచించాల్సింది ఏమీ లేదు’’ అని పేర్కొంది.
నికీ అరంగేట్రం
కాగా 20 ఏళ్ల నికీ ప్రసాద్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన ఆమె.. రైటార్మ్ ఆఫ్ బ్రేక్ స్పిన్నర్ కూడా. భారత అండర్-19 జట్టు తరఫున, ఇటీవల ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన అనధికారిక సిరీస్‌లోనూ నికీ రాణించింది. ఫలితంగా ఆమెకు భారత టీ20 జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. కెప్టెన్ స్మృతి మంధాన చేతుల మీదుగా నికీ టీమిండియా క్యాప్ అందుకుంది.
భారత్ వర్సెస్ జింబాబ్వే తొలి టీ20 తుదిజట్లు
భారత్
షఫాలీ వర్మ, స్మృతి మంధాన(కెప్టెన్), అనుష్క శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రీ చరణి, అరుంధతి రెడ్డి, నందనీ శర్మ, క్రాంతి గౌడ్.
జింబాబ్వే
కెలిస్ ఎంధ్లోవు, బిలవ్డ్ బిజా, చిపో ముగేరి-టిరిపానో, షేర్న్ మేయర్స్, మిచెల్లి మవూంగ, నైయాషా గ్వాన్జురా, ఫ్రాన్సిస్క చిపారే, మాడెస్టర్ ముపాచిక్వా (వికెట్ కీపర్), జోసెఫైన్ ఎంకోమో (కెప్టెన్), ఒలిండెర్ చారే, టెండాయ్ మకూష.
చదవండి: IND vs WI: విండీస్‌తో ఐదో టీ20.. భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన