Bengaluru Tenant Reveals Difficulty Rent House Security Deposit Back

బెంగళూరులో అద్దె ఇల్లు అంటేనే అమ్మో అనాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు చిన్న ఇళ్లకే భారీ అద్దెలు.. మరోవైపు అంతకుమించిన భారీ సెక్యూరిటీ డిపాజిట్లు.. నగరంలోని ఇళ్లలో అద్దెకు దిగేవారిని హడలెత్తిస్తున్నాయి. ఉన్నన్నాళ్లూ క్రమం తప్పకుండా అద్దెలు కట్టించుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు డిపాజిట్లు తిరిగి చెల్లించకుండా కొర్రీలు పెడుతూ వేధిస్తున్నారు ఇంటి ఓనర్లు.

నగరంలో ఇళ్ల అద్దెలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఇంటి యజమానుల నుంచి అద్దెకుంటున్నవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. మూడేళ్లుగా సకాలంలో అద్దె కడుతూ వచ్చినప్పటికీ, ఇంటి యజమాని తన సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని బెంగళూరుకు చెందిన ఓ అద్దెదారుడు సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ప్రతి నెలా క్రమం తప్పకుండా అద్దె చెల్లించినప్పటికీ, సెక్యూరిటీ డిపాజిట్‌ కోసం పదేపదే యజమానిని సంప్రదించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన సొంత డబ్బును తాను తిరిగి పొందడానికి కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి రావడం అవమానకరమని వాపోయారు. ఈ విషయంలో అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తర్వాత సోషల్‌ మీడియా ద్వారా లభించిన సహాయంతో ఎలాగోలా తన డిపాజిట్‌ సొమ్మునైతే తిరిగి రాబట్టుకున్నట్లు సదరు అద్దెదారుడు వెల్లడించారు.

ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు స్పందించారు. డిపాజిట్‌ తిరిగి ఇవ్వడంలో యజమాని జాప్యం చేస్తే న్యాయ సహాయం తీసుకోవాలని సూచించారు. కొందరు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదరయ్యాయని వాటిని పంచుకున్నారు. సెక్యూరిటీ డిపాజిట్ల వసూళ్లలో అద్దెదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సర్వీస్‌ లాంటిదేదైనా ప్రారంభించాల్సిన అసరముందంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:రియల్‌ ఎస్టేట్‌లోకి మరో బడా కంపెనీ


English Translation
Bengaluru Tenant Reveals Difficulty Rent House Security Deposit Back

There are situations in Bengaluru where you have to say, ``A house on rent.'' On the one hand, huge rents for small houses. On the other hand, huge security deposits. The house owners have been harassing the house owners by not paying back the deposits when they vacate the house after paying regular rents.

In the background of the huge increase in the house rents in the city, the problems faced by the tenants from the house owners have become a topic of discussion once again. A Bengaluru-based tenant expressed his grief on social media that despite paying the rent on time for three years, the landlord bothered him by not returning his security deposit.

He claimed that he had to approach the landlord repeatedly for the security deposit despite paying the rent regularly every month. He lamented that he had to beg even to get his own money back. He warned that legal action will be taken if necessary in this regard. Later, the tenant revealed that he somehow got his deposit back with the help of social media.

Many netizens responded to this post. If the owner delays in returning the deposit, legal help is advised. Some shared that they too had similar experiences. He commented that there is a need to start something like a special service to solve the problems faced by tenants in the collection of security deposits.

Read this:Another foray into real estate Company