
మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో ముస్కాన్ రస్తోగి , సాహిల్ శుక్లాలకు మరణశిక్ష విధించిన రెండు రోజుల తర్వాత ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ కోర్టు ఒక సంచలన తీర్పు వెలువరించింది. భర్తను దారుణంగా హత్య చేసి, అది పాము కాటు వల్ల జరిగిన సహజ మరణంగా చిత్రీకరించేందుకు మృతదేహం పక్కన పామును ఉంచిన భార్యకు, ఆమె ప్రియుడికి కోర్టు ఉరిశిక్ష (మరణశిక్ష) విధిస్తూ తీర్పు చెప్పింది.
మీరట్ 'బ్లూ డ్రమ్' హత్య కేసులో ఉరిశిక్ష పడిన ముస్కాన్ రస్తోగి, ఈ రవితా కశ్యప్ ఇద్దరూ మీరట్ చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలులోని ఒకే బ్యారక్ (బ్యారక్ 2B) లో ఉండటం ఆసక్తికరం.మీరట్‌లోని అక్బర్పూర్ సాదత్ గ్రామానికి చెందిన టైల్స్ వర్కర్ అమిత్ కశ్యప్ (32) హత్య కేసులో రవితా కశ్యప్ (30), ప్రియుడు అమర్దీప్ (23)లను కోర్టు దోషులుగా తేల్చింది. మీరట్ అదనపు జిల్లా ,షన్స్ న్యాయమూర్తి జైవీర్ సింగ్ నాగర్ వీరిద్దరికీ మరణశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి:మీరట్ బ్లూ డ్రమ్ కేసు : దోషులకు మరణ శిక్ష
పాము కరిచిందంటూ డ్రామా
అమిత్ వద్ద పనిచేసే అమర్‌దీప్‌కు, అమిత్ భార్య రవితకు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం అమిత్‌కు తెలియడంతో, వారిద్దరూ కలిసి అతడిని వదిలించుకోవాలని కుట్ర పన్నారు.పూజ కోసమని చెప్పి ఒక పాములవాడి వద్ద నుంచి రూ. 1,000 పెట్టి ఒక పామును కొనుగోలు చేశారు. గతేడాది ఏప్రిల్ 12, 2025 రాత్రి అమిత్ నిద్రపోతున్న సమయంలో అమర్‌దీప్‌ను ఇంటికి పిలిపించి, ఇద్దరూ కలిసి అమిత్‌ను గొంతు నులిమి చంపేశారు.
ఇదీ చదవండి:నమ్మించి ఏకంగా రూ. 9.6 కోట్లు కొట్టేసిన నర్స్. కట్ చేస్తే!
అమిత్ చనిపోయిన తర్వాత, అతడి మృతదేహం పక్కన ఆ పామును వదిలేశారు. మరుసటి రోజు ఉదయం అమిత్ పాముకాటుతో చనిపోయాడని రవితా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే అమిత్ మెడపై ఉన్న గుర్తులను చూసి అనుమానం వచ్చిన బంధువులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపాలని పట్టుబట్టారు. పోస్టుమార్టం నివేదికలో అతడు గొంతు నులిమి చంపబడ్డాడని తేలింది. పైగా అక్కడ వదిలిన పాము తీవ్రమైన విషపూరితమైనది కాదని బయటపడింది. పోలీసుల విచారణలో రవితా నిజం ఒప్పుకోవడంతో ఇద్దరినీ అరెస్ట్ చేశారు. కోర్టులో 12 మంది సాక్షులను విచారించిన అనంతరం ఇద్దరికీ ఉరిశిక్ష ఖరారు చేశారు.