Woman Police Officer Shyamala Challenge To Success

హైదరాబాద్‌:అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జలవిహార్‌ వేదికగా ఆదివారం షీ పవర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళా భద్రతా బైక్‌ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్‌ ర్యాలీని ప్రారంభించారు.  బైక్‌ ర్యాలీ ఇందిరాగాంధీ చౌరస్తా నుంచి తిరిగి జలవిహార్‌ వరకు సాగింది. నగరానికి చెందిన మహిళా రైడర్లతో పాటు నేపాల్, భూటాన్, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి మహిళా సూపర్‌ బైకర్లు, స్కూటీ రైడర్లు, మహిళా పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు జూపల్లి, పొన్నం మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజ వేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో డీసీపీ శిల్పవల్లి, షీ పవర్‌ ఫౌండర్‌ మహేష్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.  

ఆ్రఫ్టాల్‌ ఉమెన్‌ అన్న పదం నచ్చక..  
2013లో ఆ్రఫ్టాల్‌ ఉమెన్‌ అన్న ఒక్క మాట నాకు నచ్చక చాలెంజింగ్‌గా తీసుకున్నా. మొదట్లో బుల్లెట్‌ బండి నడుపుతున్నప్పుడు వేస్ట్‌ అన్నారు. పంజాగుట్ట పీఎస్‌లో పని చేస్తుండగా 5జీ బుల్లెట్‌  బైక్‌ తీసుకున్నా. 60 రోజుల పాటు నేను ఒక్కదాన్నే రాత్రి వేళ పెట్రోలింగ్‌ చేశా. ఆల్‌ ఇండియా చాలెంజింగ్‌ ఉమెన్‌ అవార్డు అందుకున్నా. షార్ట్‌పుట్‌లో జాతీయ, అంతర్జాతీయ అవార్డులతో పాటు రెండు డాక్టరేట్లు సాధించాను. వెపన్‌ షూటింగ్‌లో గోల్ట్‌మెడల్‌ అందుకున్నా.  
– శ్యామల, బేగంపేట్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ 


English Translation

Translation pending...