Three Members Drown in Pond Sangareddy District

సాక్షి, సంగారెడ్డి:సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మనూరు గ్రామ శివారులో బట్టలు ఉతకడానికి చెరువు వద్దకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో మృతి చెందిన వారిని నరసింహారెడ్డి (45), సంగమేశ్వర్‌రెడ్డి (42), కృష్ణవేణి (38)గా గుర్తించారు.

కాగా, చెరువులో మునిగిపోయిన వారిని స్థానికులు బయటకు తీశారు. కృష్ణవేణిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి:రేవంత్‌ సర్కార్‌కు షాక్‌.. మెట్రో, ఆర్టీసీ కామన్‌ పాస్‌ ఫెయిల్‌!


English Translation
Three Members Drowned in Pond Sangareddy District

Sakshi, Sangareddy:Tragic incident in Sangareddy District took place. Three members of the same family drowned when they went to a pond to wash their clothes in the suburbs of Manuru village. This incident filled the local with great sadness. Those who died in this incident were identified as Narasimha Reddy (45), Sangameshwar Reddy (42) and Krishnaveni (38). Krishnaveni was taken to Narayankhed Area Hospital for treatment.. She died while undergoing treatment there. Family members and relatives are in tears after the loss of three lives from the same family. Full details of the incident are yet to be known.

Read this:Shock for Revanth Sarkar.. Metro, RTC Common Pass Fail!