
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఇట్లు అర్జున’. మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఈ చిత్ర బృందం విశాఖపట్నంలోని గీతం కళాశాలలో మూడో పాట విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్లో సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ అనస్వర రాజన్ కలిసి స్టేజ్పై డ్యాన్స్ చేశారు. వీరిద్దరి సందడి అక్కడున్న వారిని అలరించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
మూగవాడిగా అనీష్..
‘ఇట్లు అర్జున’ సినిమాలో అనీష్ మూగవాడైన అర్జున పాత్రలో కనిపించనున్నాడు. అనస్వర రాజన్ కీర్తి పాత్రలో ప్రేక్షకులను పలకరించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.
( ఇదీ చదవండి:నానా పటేకర్ మృతి.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఎమోషనల్)
English Translation

Another one in Tollywood. An interesting film is getting ready to hit the audience. Anish and Anaswara Rajan are acting in the movie 'Itlu Arjuna'. The film is directed by Mahesh Uppala and produced by Venky Kudumula. The movie will be released in theaters on October 30. The songs and teasers that have already been released from this movie are impressing the audience.
Recently, the film team organized a third song release event at Geetham College in Visakhapatnam. In this event, music director Taman and heroine Anaswara Rajan danced together on stage. The noise of both of them entertained the people there. Now the video related to this has become viral on social media.
Anish as a mute..
Anish will be seen in the role of a mute Arjuna in the movie 'Itlu Arjuna'. Anaswara Rajan will greet the audience in the role of Keerthy. With the already released promotional pictures and songs, there has been interest in this movie. And let's see what kind of response this film will get at the box office on October 30.
( Read this:Nana Patekar passed away.. Former Pakistan cricketer Cricketer Emotional)