Fitness Coach Dies at HYROX Impact of Extreme Exercise on Heart

బ్యాంకాక్‌:తీవ్రమైన వ్యాయామం గుండెపై చూపే ప్రతికూల ప్రభావాలు, సడన్ కార్డియాక్ అరెస్ట్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగిన ‘హైరాక్స్ (HYROX) 2026’ ఫిట్‌నెస్ పోటీల్లో పాల్గొన్న 41 ఏళ్ల ఫిట్‌నెస్ కోచ్ లెరాయ్ సాండర్స్ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందారు. దక్షిణాఫ్రికాకు చెందిన సాండర్స్ బ్యాంకాక్‌లో ‘ఐఏవోటీ క్రాస్‌ఫిట్’ వ్యాయామశాల యజమాని. ‘ఫైట్ బై డిజైన్’ వ్యవస్థాపకుడు.

పోటీల సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయిన ఆయనకు సీఆర్‌పీ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదని, అధికారిక నివేదిక వచ్చేవరకు వేచి చూడాలని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో తీవ్ర శారీరక శ్రమ గుండెపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశం తెరపైకి వచ్చింది. తీవ్రమైన వ్యాయామం చేసేటప్పుడు కండరాలకు ప్రాణవాయువును అందించేందుకు గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం సహజం.

సాధారణంగా వ్యాయామం వల్ల గుండెకు మేలు జరుగుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొన్నప్పటికీ, ముందస్తుగా గుర్తించని గుండె సమస్యలు ఉన్నప్పుడు లేదా శరీర సామర్థ్యానికి మించి శ్రమించినప్పుడు ప్రమాదకరమైన హృదయ స్పందనల లోపాలు (వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటివి), సడన్ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కార్డియోమయోపతి, కొరోనరీ ఆర్టరీ వ్యాధులు, జన్యుపరమైన సమస్యలు ఉన్నవారిలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఛాతీలో నొప్పి, తీవ్రమైన ఆయాసం, మైకం, కళ్లు తిరగడం, అసాధారణ హృదయ స్పందనలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే శిక్షణ ఆపి వైద్యులను సంప్రదించాలి. ఫిట్‌నెస్‌గా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు రావనే భావన సరికాదని, శరీర సామర్థ్య పరిమితులను తెలుసుకుని వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి:రాఖీ 27నా? 28నా?.. గ్రహణ ప్రభావమెంత?
 


English Translation
Fitness Coach Dies at HYROX Impact of Extreme Exercise on Heart

Bangkok:Negative effects of extreme exercise on heart, The threat of sudden cardiac arrest has once again started to be debated. 41-year-old fitness coach Leroy Sanders, who participated in the 'HYROX 2026' fitness competition in Bangkok, Thailand, suddenly collapsed and died. Saunders, who hails from South Africa, is the owner of the 'IAOT CrossFit' gym in Bangkok. He is the founder of 'Fight by Design'.

He suddenly lost consciousness during the competition but was rushed to the hospital after undergoing CRP but did not survive. The family members said that the exact cause of his death is yet to be revealed and they have to wait for the official report. With this incident, the effect of intense physical activity on the heart has come to the fore. During intense exercise, it is natural for the heart to beat faster to supply oxygen to the muscles and blood pressure to rise.

Although the American Heart Association states that exercise is generally good for the heart, medical experts warn that there is a risk of dangerous heart rhythm disorders (such as ventricular fibrillation) and sudden cardiac arrest when there are undiagnosed heart problems or when the body is overworked.

This risk is higher in people with cardiomyopathy, coronary artery disease, and genetic problems will be If symptoms such as chest pain, severe fatigue, dizziness, dizziness, abnormal heartbeats occur during exercise, stop training immediately and consult a doctor. Experts suggest that it is not correct to think that just because you are fit, you will get heart problems, you should know your body's capacity limits and exercise.

Also Read:Rakhi 27? 28?.. What is the effect of perception?