హడావుడి.. పెళ్లి సందడి!

Eenadu icon
By Telangana News Desk Published : 17 Jun 2026 04:34 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

తెలుగు లోగిళ్లలో మళ్లీ పెళ్లి సందడి మొదలైంది. గత నెలన్నర రోజులుగా మూఢం, అధిక జ్యేష్ఠ మాసంలో మంచి రోజులులేక వివాహాలు జరగలేదు. ఈ నెల 15 నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలవగా... రాబోయే రోజుల్లో (18 నుంచి జులై 9 వరకు) పరిమితంగా శుభముహూర్తాలున్నాయి. తిరిగి జులై 15 నుంచి ఆషాఢమాసం, గురుమూఢం ప్రారంభమై ఆగస్టు 15 వరకూ పెళ్లి ముహూర్తాలు లేవు. ఆ తరవాత శ్రావణ మాసంలోనే పెళ్లిళ్లకు అవకాశాలుండటంతో ప్రస్తుత సీజన్‌లో కల్యాణాలు కుదిరిన కుటుంబాల్లో హడావుడి మొదలైంది. మరోవైపు పరిమిత  ముహూర్తాల కారణంగా పురోహితులు, ఫంక్షన్‌హాళ్లు, క్యాటరింగ్‌ తదితరాలకు డిమాండ్‌ పెరగడంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. 

మెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా పెట్రోలు, డీజిల్‌ సహా నిత్యావసర ధరలు పెరగడం వల్ల పెళ్లి వ్యయం కూడా ఆకాశాన్నంటుతోంది. ‘వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయన్న కారణంతో క్యాటరింగ్‌ నిర్వాహకులు ధరలు పెంచేశారు. వాహనాల కిరాయిలూ పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా వేసవిలో ఫంక్షన్‌హాళ్లకు డిమాండు అధికంగా ఉంటుంది. ఈసారి అధిక జ్యేష్ఠం కారణంగా వాటికి గిరాకీ లేదు. ఇప్పుడు ముహూర్తాలు ప్రారంభమైనందున నిర్వాహకులు వాటి ధరలనూ పెంచుతున్నారు’ అని వధూవరుల తండ్రులు శివరామకృష్ణయ్య, నాగేశ్వరరావు తెలిపారు. 

అమ్మో బంగారం!

ఏడాది క్రితంతో పోలిస్తే బంగారం ధర బాగా పెరిగింది. పేద, దిగువ మధ్య తరగతి వారైనా కుమార్తెకు పెళ్లిచేసే సమయంలో మంగళసూత్రాలు, బంగారుగొలుసు, కమ్మలు, ముక్కుపుడక, గాజులు వంటి అవసరాలకు కనీసం 5-6 తులాలు కొనడం ఆనవాయితీ. ప్రస్తుతం ఆ మేరకు కొనుగోలు చేయాలన్నా రూ.7-8 లక్షలు ఖర్చవుతోంది. ఇక కల్యాణ మండపాలు, అలంకరణ, భోజనాలు, రాకపోకలకు తక్కువలో తక్కువ మరో రూ.5-10 లక్షల వరకూ వెచ్చించక తప్పని పరిస్థితి. ‘వంటకాల రకాలను బట్టి కనీసం ప్లేటుకు రూ.500 తక్కువ కాకుండా వెచ్చించాల్సి వస్తోంది. పాతిక రకాల వంటకాలు లేకుండా భోజనం పెట్టడం నామోషీగా భావిస్తున్నందున భోజనాల వ్యయం చాలా ఎక్కువగా ఉంటోందని ఫంక్షన్‌ హాలు యజమాని హరి ‘ఈనాడు’కు చెప్పారు. అమెరికా-ఇరాన్‌ యుద్ధం ముందు నాటితో పోలిస్తే ఒక పెళ్లికి అదనంగా కనీసం రూ.5 లక్షల వరకూ ఖర్చు పెరిగిందని ఆయన తెలిపారు. పరిమిత ముహూర్తాల నేపథ్యంలో పురోహితుల దగ్గర్నుంచి..క్యాటరింగ్, డెకరేషన్, అద్దె వాహనాల వరకు అందరూ అధిక మొత్తం డిమాండ్‌ చేయడం కూడా భారం పెంచుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • గింజ... ఒంటికి పట్టాలంటే! శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కావాలి. ఆ పోషకాలు ఎండు గింజల్లో (డ్రైనట్స్‌) పుష్కలం. అందుకే చాలామంది రోజూ డ్రైనట్స్‌ను తీసుకుంటూ ఉంటారు.
  • 89 మిల్లుల్లో రూ.927 కోట్ల ధాన్యం మాయం! రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
  • స్వాతంత్య్రోద్యమ దీపధారులకు జేజేలు స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా, ప్రతి భారతవాసికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో భాగంగా ఈ నెల 9న అండమాన్, నికోబార్‌ దీవుల పర్యటనలో మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాను.
  • నాలుగున్నరేళ్లకే ఫీజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల కాలానికి మాత్రమే ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ(టీఏఎఫ్‌ఆర్‌సీ) శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
  • పత్తి.. బంగారమే భారత్‌లో పత్తి... బంగారంగా మారుతోందని, దేశీయ వినియోగం పెరగడంతో పాటు ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లలిత్‌కుమార్‌ గుప్తా చెప్పారు.
  • ప్రతి విద్యార్థికీ సంపూర్ణంగాఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు సంపూర్ణంగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏటా రూ.2,400 కోట్లు ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సిద్ధం చేసుకున్నామన్నారు.
  • పైన రేకులు... చుట్టూ బహిరంగం! చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో టీచర్‌ బోర్డుపై రాస్తూ పాఠాలు చెబుతున్నప్పుడే విద్యార్థులు ఏకాగ్రతతో వింటుంటారు. కానీ ఇక్కడి పిల్లలకు అటువంటి సదుపాయాలేమీ లేవు.
  • గెలలొచ్చే.. గలగల తెచ్చే రెండు నెలలుగా గెలల రాక లేక బోసిపోయిన ఆయిల్‌పాం కర్మాగారాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి.
  • దేశ ప్రగతిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి విదేశీ శక్తులతోపాటు స్వదేశంలోనే కొందరు భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, దేశ ప్రగతిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
  • ‘బయో ఎనర్జీ’పై కర్ణాటకతో కలిసి పనిచేస్తాం జీవ ఇంధన (బయో ఎనర్జీ) రంగంలో కర్ణాటకతో కలిసి పనిచేయడానికి, రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
  • పోలీసన్నా సైడ్‌సైడ్‌.. వచ్చేసింది మహిళా బ్యాండ్‌ శాంతిభద్రతలు కాపాడటమే కాదు.. చేతిలో వాయిద్యం పడితే సంగీతంతోనూ శ్రోతలను మంత్రముగ్ధులను చేయగలమంటున్నారు తెలంగాణ మహిళా పోలీసులు.
  • ప్రతి పేద వ్యక్తి ఓటూ కాపాడాల్సిన బాధ్యత కార్యకర్తలది: మీనాక్షి అర్హత గల ప్రతి పేద వ్యక్తి ఓటూ కాపాడాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు.
  • రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణిస్తాం ప్రభుత్వం, పార్టీ పైన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్‌ అధిష్ఠానంతో చర్చిస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ చెప్పారు.
  • ఈ-కేవైసీకి 23 వరకు గడువు పొడిగించిన ఆయిల్‌ కంపెనీలు ఎల్పీజీ వినియోగదారులకు చమురు సంస్థలు స్వల్ప ఊరటను ఇచ్చాయి. ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు ముందు ఆగస్టు 16 వరకు గడువును నిర్దేశించగా, తాజాగా ఆగస్టు 23 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించాయి.
  • 67 పుష్కర ఘాట్లు..రూ.వెయ్యి కోట్లతో ఏర్పాట్లు గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని నదీ తీరంలోని 67 పుష్కర ఘాట్లను మూడు దశల్లో అభివృద్ధి చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సంకల్పించింది.
  • పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం హైదరాబాద్‌లోని చారిత్రక గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కోటలోని తారామతి మసీదు వద్ద ముఖ్యమంత్రి జెండా ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
  • రాజకీయ హామీలను అమలు చేయాలని చెప్పలేం ఒక విధానం, పథకం గురించి బహిరంగ వేదికలపై ఇచ్చిన రాజకీయ హామీలను అమలు చేయాలని న్యాయస్థానాలు ఆదేశించలేవని హైకోర్టు శుక్రవారం తేల్చి చెప్పింది.
  • సైబర్‌ నేరాల నియంత్రణకు అవగాహనే రక్షణ కవచం సైబర్‌ నేరాలు వేగంగా రూపాంతరం చెందుతున్న క్రమంలో చట్టం అమలు ద్వారానే ఈ పోరాటంలో గెలవలేమని.. అప్రమత్తత, అవగాహనతో ప్రతి పౌరుడు బలమైన రక్షణ కవచంగా మారాలని డీజీపీ సీవీ ఆనంద్‌ సూచించారు.
  • అద్దంకి దయాకర్‌కు హార్వర్డ్‌ వర్సిటీలో ఉన్నత విద్యావకాశం అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ కెన్నెడీ స్కూల్‌లో అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు డాక్టర్‌ అద్దంకి దయాకర్‌కు అవకాశం లభించింది.
  • హెచ్‌ఎండీఏకే టీడీఆర్‌ అధికారం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణకు బదులు ఇచ్చే ట్రాన్స్‌ఫరబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌(టీడీఆర్‌) సర్టిఫికెట్ల జారీ బాధ్యతను హెచ్‌ఎండీఏకే అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

English Translation

Hurry.. wedding buzz!

Eenadu icon
By Telangana News Desk Published : 17 Jun 2026 04:34 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Marriage buzz has started again in Telugu Logis. For the last month and a half, there were no auspicious days in the month of Mudha and High Jyeshtha, so marriages did not take place. The real first month starts from 15th of this month... There are limited auspicious times in the coming days (18th to 9th July). Again, from July 15, there are no weddings until August 15, when Ashadham and Gurumood begin. After that, as there are opportunities for marriages in the month of Shravan itself, the rush started in the families who got married in the current season. On the other hand, the families are worried due to the increased demand for priests, function halls, catering, etc. due to the limited time available. 

Catering operators have increased the prices due to the huge increase in the prices of commercial gas cylinders. Vehicle rentals have also increased. Demand for function halls is usually high in Telugu states during summer. This time there is no demand for them due to high seniority. Now that the muhurtas have started, the organizers are increasing their prices,'' said Sivaramakrishnaiah and Nageswara Rao, fathers of the bride and groom. 

It is customary to buy at least 5-6 talas for the needs of a poor and lower middle class daughter at the time of marriage such as mangalsutras, gold necklaces, kammas, nose rings and bangles. At present, it costs Rs. 7-8 lakhs to buy to that extent. At least another Rs. 5-10 lakhs should be spent on welfare mandapams, decorations, meals and transportation. Depending on the types of dishes, at least Rs. 500 per plate has to be spent. Hari, the owner of the function hall, told 'Eenadu' that the cost of meals is high as it is considered embarrassing to have meals without traditional dishes. He said that as compared to before the US-Iran war, the cost of a wedding has increased to at least Rs.5 lakh. He opined that in the context of limited time, everyone from the priests to catering, decoration and rental vehicles is demanding a high amount. News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no need for correspondence in this matter.

More

  • Nut... to shit! The body needs nutrients to be healthy. Those nutrients are abundant in dry nuts. That's why many people take drynuts daily.
  • Rs. 927 crores of grain wasted in 89 mills! Sensational matters are coming to light as the government is cracking down on the massive irregularities in the Custom Milling Rice (CMR) case in the state. On the auspicious occasion of Independence Day, my heartiest wishes to every Indian. I unveiled our national flag during a visit to Andaman and Nicobar Islands on 9th of this month as part of the 'Harghar Tiranga' campaign.
  • Fee for four and a half years only The State Admissions and Fees Regulatory Agency (TAFRC) has issued clear instructions on Friday that students joining MBBS and BDS courses in all private medical colleges across the state will have to pay fees only for a period of four and a half years. Cotton Corporation of India (CCI) Chairman and Managing Director Lalit Kumar Gupta said that cotton is turning into gold in India and exports are growing along with domestic consumption.
  • Complete fee reimbursement for every student Chief Minister Revanth Reddy said that every student will be given full fee reimbursement money from this academic year. Annually Rs. 2,400 crores have been prepared to be deposited in bank accounts in advance. The students listen intently while the teacher is writing on the board and lecturing in a calm environment. But the children here do not have any such facilities. Can bring The oil palm factories, which have been idle for two months, are suddenly bursting into flames.
  • Oppositions are blocking the progress of the country. Union Minister G. Kishan Reddy has accused foreign forces and some within the country of conspiring against India and trying to block the country's progress.
  • We will work with Karnataka on 'Bio Energy'. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka said that the state government is ready to work with Karnataka in the field of bio-energy and create a favorable environment to attract more investments in the coming days. Not just maintaining peace and order.. Telangana Mahila Police say that they can mesmerize listeners with music if an instrument falls in their hands.
  • Activists are responsible to vote and protect every poor person: Meenakshi Congress state affairs in-charge Meenakshi Natarajan said that it is the responsibility of the party workers to vote and protect every eligible poor person.
  • Rajagopal Reddy's comments will be taken seriously. PCC president Mahesh Kumar Goud said that he will discuss with the Congress leadership the comments made by former MLA Komatireddy Rajagopal Reddy against the government and the party and the steps to be taken. Oil companies have given some relief to LPG consumers. Before completing the e-KYC process, the deadline was fixed till August 16, but it was announced on Friday that it has been extended till August 23.
  • 67 Pushkar Ghats. The ministerial sub-committee decided to develop 67 pushkara ghats on the banks of the river in three phases in honor of Godavari pushkaras. Officials have completed the arrangements for the official Independence Day celebrations organized by the state government at the historic Golconda Fort in Hyderabad. The Chief Minister will unfurl the flag at Taramati Masjid in Kota and address the people of the state.
  • It cannot be said that political promises should be implemented. The High Court on Friday ruled that the courts cannot order the implementation of political promises made in public forums about a policy or scheme. DGP CV Anand suggested that the fight cannot be won only through the implementation of law in the course of cyber crimes.. Every citizen should become a strong defense shield with vigilance and awareness. Dr. Addanki Dayakar, Telangana Government Whip and Member of the Legislative Council, got an opportunity to study at the world famous Harvard University Kennedy School in America.
  • HMDAK TDR authority. The government has taken a key decision by handing over the responsibility of issuing transferable development rights (TDR) certificates to HMDA in lieu of land acquisition for infrastructure development projects under the jurisdiction of HMDA and GHMC.