Transfer Of 2018 Batch Group 1 Officers In Ap

సాక్షి, విజయవాడ:ఏపీలో 2018 గ్రూప్‌-1 అధికారులను ప్రభుత్వం మూకుమ్మడి బదిలీ చేసింది. 2018 గ్రూప్-1 రిక్రూట్‌మెంట్ వివాదంపై విచారణ కొనసాగుతున్న క్రమంలో ఈ నియామక ప్రక్రియపై కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ హైకోర్టు.. 2018 రిక్రూట్‌మెంట్‌ లోపాలపై విచారణ పూర్తయ్యే వరకు అప్రాధాన్య పోస్టులో ఉంచాలంటూ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో 26 మందిని సాధారణ పరిపాలన శాఖ (GAD)కి సీఎస్‌ అటాచ్‌ చేశారు.

ఈ నియామకాల్లోని అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించవద్దంటూ హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలతో సీఎస్‌.. ప్రస్తుతం విధుల్లో ఉన్న 26 మంది అధికారులను వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తప్పించి.. జీఏడీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 


English Translation
Transfer Of 2018 Batch Group 1 Officers In Ap

Sakshi, Vijayawada:Government has done mass transfer of 2018 Group-1 officers in AP. As the inquiry into the 2018 Group-1 recruitment dispute is ongoing, the AP High Court, which has taken a key decision on this recruitment process, has ordered that they be kept in non-priority posts until the inquiry into the 2018 recruitment errors is completed. 26 people have been attached to the General Administration Department (GAD) by the High Court. According to the orders of the High Court, the CS has issued orders removing 26 officers who are currently on duty and attaching them to the GAD.