IND vs ZIM: India coach confirms Sanju Likely To play Then Who Will Axed

సంజూ శాంసన్‌ (PC: BCCI)

టీ20 ప్రపంచకప్‌-2026టోర్నమెంట్లో కీలక మ్యాచ్‌కు టీమిండియా సన్నద్ధమైంది. సూపర్‌-8 దశలో భాగంగా గురువారం చెన్నై వేదికగా జింబాబ్వేతో తలపడనుంది. ఈ నేపథ్యంలో తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

ఇషాన్‌ హిట్‌.. అభిషేక్‌ ఫ్లాప్‌
కాగా ఓపెనింగ్‌ జోడీగా ఇషాన్‌ కిషన్‌- అభిషేక్‌ శర్మలకు అవకాశాలు వస్తుండగా.. సంజూ శాంసన్‌ బెంచ్‌కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. అయితే వరల్డ్‌కప్‌ టోర్నీలో ఇషాన్‌ మెరుగ్గా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుండగా.. అభిషేక్‌ శర్మ లీగ్‌ దశలో తొలి మూడు మ్యాచ్‌లలోనూ డకౌట్‌ అయ్యాడు.

ఇక సూపర్‌-8లో తొలుత సౌతాఫ్రికాతో టీమిండియా తలపడగా.. ఈసారి ఇషాన్‌ డకౌట్‌ కాగా.. అభిషేక్‌ 15 పరుగులు చేయగలిగాడు. మరోవైపు.. సంజూ లీగ్‌ దశలో నమీబియాతో మ్యాచ్‌లో బరిలోకి దిగి 8 బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.

తిలక్‌ వర్మపై విమర్శలు
ఇదిలా ఉంటే.. మూడో స్థానంలో ఆడుతున్న తిలక్‌ వర్మ ఇప్పటి వరకు పెద్దగా బ్యాట్‌ ఝులిపించనేలేదు. అతడి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వస్తున్నాయి. 

ముగ్గురూ లెఫ్టాండర్లే
ఇక ఓపెనర్లు ఇషాన్‌- అభిషేక్‌.. వన్‌డౌన్‌లో వచ్చే తిలక్‌.. ఈ ముగ్గురూ లెఫ్టాండ్‌ బ్యాటర్లే. దీంతో ప్రత్యర్థి జట్టు బౌలర్లు, కెప్టెన్‌కు పని సులువు అయిపోతోంది. వ్యూహాల్లో పెద్దగా మార్పులు లేకుండానే వాళ్లు అనుకున్న ఫలితాలు రాబట్టగలుగుతున్నారు.

లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం
ఇలాంటి తరుణంలో లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం టీమిండియా టాపార్డర్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమైంది. బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుదిజట్టులో సంజూ శాంసన్‌ను చేర్చే విషయమై చర్చ నడుస్తోంది.

సంజూ వస్తాడని సంకేతం
జింబాబ్వేతో మ్యాచ్‌ సందర్భంగా మార్పులు ఉండవచ్చు. మా ఓపెనర్లతో పాటు వన్‌డౌన్‌లో వచ్చే ఆటగాడు కూడా లెఫ్టాండర్‌ బ్యాటరే కావడం ఇందుకు కారణం. అందుకే ఈ విషయంలో పునరాలోచన చేస్తున్నాం. అయితే, మ్యాచ్‌ సమయంలోనే మేము తుది నిర్ణయం తీసుకుంటాం’’ అని కొటక్‌ తెలిపాడు.

ఎవరిపై వేటు?
ఒకవేళ సంజూ గనుక తుదిజట్టులోకి వస్తే ఎవరిపై వేటు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. రింకూ సింగ్‌ స్థానంలో సంజూను ఆడిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే సంజూను వన్‌డౌన్‌లో ఆడించి.. తిలక్‌ను డిమోట్‌ చేయడం ఓ ఆప్షన్‌. అయితే, ఇప్పటికే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించినా రింకూ జట్టుతో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు కొటక్‌ తెలిపాడు.

రింకూ, తిలక్‌, అభిషేక్‌!
అంటే రింకూ జింబాబ్వేతో మ్యాచ్‌ ఆడటం ఖాయమే అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అభిషేక్‌ శర్మపై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వరుస వైఫల్యాల నేపథ్యంలో రీసెట్‌ అయ్యేందుకు.. లెఫ్ట్‌-రైట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ కోసం అతడిని పక్కనపెడతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు.. అభిషేక్‌- ఇషాన్‌ జోడిని కొనసాగిస్తే.. తిలక్‌ వర్మపై వేటు వేసి.. సంజూను మూడోస్థానంలోనే ఆడిస్తారనే ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. సితాన్షు కొటక్‌ చెప్పినట్లు మ్యాచ్‌ ఆరంభానికి ముందు వరకు భారత తుదిజట్టు ఎలా ఉండబోతుందో అంచనా వేయడం ఈసారి కాస్త కష్టమే అనిపిస్తోంది. 

కాగా చివరగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌ ఆడిన భారత తుదిజట్టులో ఏకంగా ఏడుగురు ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో సఫారీల చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

చదవండి: T20 WC 2026: రింకూ సింగ్‌కు సంబంధించి బిగ్‌ అప్‌డేట్‌


English Translation
IND vs ZIM: India coach confirms Sanju Likely To play Then Who Will Axed

Sanju Samson (PC: BCCI)

T20 World Cup-2026 Team India is prepared for the crucial match of the tournament. Chennai will face Zimbabwe on Thursday as part of the Super-8 stage. What will be the composition of the final team in this background? That topic has become a topic of discussion.

Ishaan hit.. Abhishek flop
While Ishan Kishan and Abhishek Sharma are getting opportunities as the opening pair, Sanju Samson has to be restricted to the bench. But while Ishan performed better in the World Cup tournament and played a key role in the team's victories.. Abhishek Sharma was ducked in the first three matches in the league stage.

When India first faced South Africa in the Super-8.. This time Ishan was ducked.. Abhishek was able to score 15 runs. On the other hand.. Sanju came into the ring in the match against Namibia in the league stage and was able to score 22 runs in 8 balls. Criticism is coming on his strike rate. 

All three are left-handers
The other openers are Ishan-Abhishek.. Tilak who comes in one down.. These three are left-hand batters. This makes the work of the bowlers and captain of the opposing team easy. They are able to get the desired results without much changes in the strategies.

For left-right combination
At such a moment, Team India is ready to make changes in the taparder for the left-right combination. Batting coach Sitanshu Kotak himself revealed this. Speaking to the media before the match against Zimbabwe.. There is a discussion about the inclusion of Sanju Samson in the final team.

Signal that Sanju will come
There may be changes during the match against Zimbabwe. The reason for this is that along with our openers, the player who comes in one down is also a left-hander batter. That is why we are rethinking this matter. However, we will take the final decision during the match itself,'' said Kotak.

Who will be targeted?
If Sanju Ganuka makes it to the final team, who will be targeted? Opinions are being expressed that Sanju will be played in place of Rinku Singh. If that happens, playing Sanju in one down and demoting Tilak is an option. However, Kotak said that Rinku is willing to join the team even though his father's health condition has already worsened. In this background, there are reports that Abhishek Sharma will be hunted. There are opinions that he will be kept aside for the left-right opening combination in order to reset in the background of consecutive failures. On the other hand, if Abhishek-Ishaan pair continues, Tilak Verma will be targeted and Sanju will be played in the third position. However.. as said by Sitanshu Kotak, this time it seems a bit difficult to predict how the final Indian team will be until the start of the match. 

And lastly, there were seven left-handed players in the Indian final team that played a match against South Africa. In this match, Team India lost by 76 runs at the hands of Safaris, which complicated the chances of the semis. 

Read: T20 WC 2026: Big Update Regarding Rinku Singh