Bandi Sanjay Fires On Congress Leaders

సాక్షి, వికారాబాద్‌:రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేయడమేంటి? అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమర్జెన్పీ రోజులు ప్రారంభమయ్యాయని.. ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరాచకాలను అడ్డుకోవడానికి సిద్ధకావాలంటూ బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘‘కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో జరిగిన సంఘటనలను గుర్తుంచుకోండి. కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం దుర్మార్గం. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషం. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గు చేటు.

..బాన్సువాడలో 70 మందిని అరెస్ట్ చేయడం అక్రమం. రాళ్ల దాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి?. బాన్సువాడ వెళ్లేందుకు యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం అన్యాయం. ఎంఐఎంను కాపాడటానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది’’ అంటూ బండి సంజయ్‌ ఆరోపించారు.


English Translation
Bandi Sanjay Fires On Congress Leaders

Sakshi, Vikarabad: Is there a rowdy kingdom running in the state? If you ask, why did the Congress leaders attack? Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar was furious. Speaking to the media on Sunday, he expressed his anger that the days of Emergen P have begun... MIM and Congress are creating anarchy together. "Remember the events that happened during the two years of Congress rule. Congress and MIM parties taking the law into their hands is evil. The attack on BJP MLA Venkataramana Reddy's house is inhumane. Congress has fueled the fire in Kamareddy. It's a shame to say that they were attacked if they prevented self-defense.

..arresting 70 people in Bansuwada is illegal. Although the stone attack is clearly visible, what are the actions? It is unfair to arrest the BJP state president who tried to go to Bansuwada. Congress is trying to save MIM'', accused Bandi Sanjay.