Mekathoti Sucharita Slams AP Govt Leaders Over Laddu Issue

గుంటూరు: పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వుతో తయారు చేశారని ఎటువంటి ఆధారాలు లేకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పటం దారుణమన్నారు మాజీ మంత్రి మేకతోటి సుచరిత.  సీబీఐ తన చార్జ్‌షీట్లో తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని స్పష్టం చేసిందని, అయినా కూటమి నేతలకు ఇంకా సిగ్గు రాలేదని ధ్వజమెత్తారు సుచరిత.

‘మొన్నటి వరకు జంతువుల కొవ్వు తిరుమల లడ్డులో ఉందని విష ప్రచారం చేశారు. సిపిఐ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత బాత్రూములు కడిగే హార్పిక్ ను లడ్డు తయారీలో ఉపయోగించారంటూ మరో విషపు ప్రచారాన్ని మొదలుపెట్టారు. దిగజారుడు రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. స్వామి వారి లడ్డు ప్రసాదం పై విష  ప్రచారం చేసిన వారికి త్వరలోనే దేవుడు గుణపాఠం చెప్తాడు’ అని హెచ్చరించారు.

ఒక పథకం ప్రకారం విష ప్రచారం..
తిరుమల లడ్డు ప్రసాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒక పథకం ప్రకారం విష ప్రచారం చేశారని  వైఎస్సార్‌సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. ‘ తిరుమల లడ్డులో ఎటువంటి జంతువుల కొవ్వు లేదని నిజాన్ని సిబిఐ  బయటపెట్టినా తెలుగుదేశం నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రతిపక్ష నాయకుల ఇళ్లను దహనం చేస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వాన్ని దహనం చేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు.

 

 


English Translation
Mekathoti Sucharita Slams AP Govt Leaders Over Laddu Issue

Guntur:  Former Minister Mekathoti Sucharita said that Deputy Chief Minister Pawan Kalyan said that the sacred Tirumala Laddu Prasad was made from animal fat without any evidence.  Dhwajamettaru Sucharita said that the CBI has clarified that there is no animal fat in Tirumala Laddu in its charge sheet, yet the leaders of the alliance have not yet felt shame. After giving the CPI report, they started another poison campaign saying that Harpic used to wash bathrooms was used in the preparation of laddu. Degenerate people are doing politics. Chandrababu Naidu and Pawan Kalyan should immediately apologize to the people. He warned that God will soon teach a lesson to those who spread poison on Swami's laddu prasad.

Poisonous propaganda according to a scheme..
YSRCP Ponnur constituency coordinator Ambati Muralikrishna criticized that Chief Minister Chandrababu Naidu Pawan Kalyan has spread poisonous propaganda on Tirumala laddu prasad according to a scheme. Even though the CBI has revealed the fact that there is no animal fat in Tirumala Laddu, Telugu Desam leaders are spreading false propaganda. The leaders of the alliance are spreading false propaganda and burning the houses of the opposition leaders. People are ready to burn down the coalition government whenever the elections come. Coalition government has no right to rule the state. They demanded that Chandrababu Naidu and Pawan Kalyan immediately apologize to the people of the state.