


ACB: ఏసీబీ వలలో భారీ తిమింగలం!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు ఖరీదైన తిమింగలం చిక్కింది. రవాణాశాఖలో పనిచేస్తూ అక్రమార్జనలో ఆరితేరిన రవాణాశాఖ మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) మూడ్ కిషన్‌ను ఏసీబీ పట్టుకుంది. సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లి రాజరాజేశ్వరి నగర్‌లోని కిషన్ ఇంటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా మరో 11 ప్రాంతాల్లో ఏసీబీ హైదరాబాద్ రేంజి-2 డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించి నగదు, నగలతోపాటు అక్రమాస్తుల కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నాయి. హైదరాబాద్‌తోపాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాల్లో మొత్తం రూ.12.72 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా. తెలంగాణ ఏసీబీ చరిత్రలో ఇంత భారీ మొత్తంలో అక్రమాస్తులు బహిర్గతం కావడం ఇదే తొలిసారి. ఆ మధ్య నీటిపారుదలశాఖ ఇంజినీర్ల అక్రమాస్తులను ఏసీబీ గుర్తించినా, వాటన్నిటి కంటే కిషన్ ఆస్తిపాస్తులే అధికమని అంచనా. మంగళవారం సోదాలు ముగిసిన అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కిషన్‌ను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
బంధువు ఇంట్లో పత్రాలు.. పాట్ మార్కెట్‌లో ఆభరణాలు
సోదాల సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయమే బోయిన్‌పల్లిలోని కిషన్ ఇంటి తలుపు తట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆ సమయంలో కిషన్ కొంతసేపు స్నానాల గదిలోనే ఉండిపోయారు. ఆయన బయటికి వచ్చాక సోదాలు ప్రారంభించగా.. ఆస్తుల పత్రాలేవీ లభ్యం కాకపోవడంతో ఏసీబీ అధికారులకు అనుమానమొచ్చి లోతుగా ఆరా తీశారు. కిషన్ సెల్‌ఫోన్‌లో బంగారు ఆభరణాలకు సంబంధించిన ఓ పత్రం లభ్యమైంది. అది సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని ఓ దుకాణానిది కావడంతో విచారించారు. కిషన్ ముందు రోజే బంగారు ఆభరణాల్ని తన దుకాణానికి తెచ్చి అప్పగించారని ఆ వ్యాపారి చెప్పడంతో ఏసీబీ అధికారులు వాటిని తెప్పించారు. అలాగే ముందు రోజు రాత్రే ఓ బంధువు ఇంటికి వెళ్లి ఆస్తుల పత్రాలను అప్పగించినట్లు విచారణలో తేలడంతో వాటినీ తెప్పించి స్వాధీనం చేసుకున్నారు.
ఆది నుంచే అక్రమాలు..
1994లో అసిస్టెంట్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా రవాణాశాఖలో అడుగుపెట్టిన కిషన్‌పై ఆదినుంచీ ఆరోపణలున్నాయి. బోధన్‌లో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. అక్కడే మద్నూర్‌లో చెక్‌పోస్ట్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. నిజామాబాద్‌లోనూ ఎంవీఐగా పనిచేశారు. తాజా సోదాల్లో నిజామాబాద్‌లోనూ అక్రమాస్తులు బహిర్గతం కావడంతో తొలినాళ్లలోనే వాటిని కూడబెట్టినట్లు బహిర్గతమైంది. అనంతరం మేడ్చల్, మెహిదీపట్నం ఆర్టీవోగా పనిచేసి పదోన్నతి పొందిన కిషన్.. ఏడాది కిందటే మహబూబ్‌నగర్ డిప్యూటీ కమిషనర్‌గా వెళ్లారు.
ఏసీబీ గుర్తించిన కిషన్ ఆస్తుల చిట్టా..
- నిజామాబాద్‌లోని ఒక ప్రముఖ లగ్జరీ హోటల్‌లో 50 శాతం వాటా.
- నిజామాబాద్‌లో ప్రముఖ ఫర్నిచర్ దుకాణం నడుస్తున్న 3 వేల చ.గ. స్థలం కిషన్‌దే.
- నిజామాబాద్‌లోని అశోకా టౌన్‌షిప్‌లో 2 ఫ్లాట్లు.
- సంగారెడ్డి జిల్లా నిజాంపేట రెవెన్యూ పరిధిలో 31 ఎకరాల వ్యవసాయ భూమి. నిజాంపేట మండలంలో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్.
- నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 10 ఎకరాల వాణిజ్యస్థలం.
- రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్.
- కిలో బంగారు ఆభరణాలు.
- హోండా సిటీ కారు.. ఇన్నోవా క్రిస్టా కారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- హస్తానికి ‘పుర’స్కారం పట్నం ‘చెయ్యె’త్తి జై కొట్టింది.. పుర ఎన్నికల్లో హస్తానికే పట్టం కట్టింది. ఏడింట ఆరు కార్పొరేషన్లు, మూడొంతులకు పైగా మున్సిపాలిటీలను ‘చే’జిక్కించుకునేంతగా అధికార పార్టీ సత్తా చాటింది. 52 శాతానికి పైగా మున్సిపల్ వార్డులను చేజిక్కించుకుని.. ‘పీఠా’ధిపత్యం దిశగా పావులు కదుపుతోంది.
- సతీసమేత విజయం.. పలుచోట్ల భార్యాభర్తల గెలుపు రాష్ట్రంలో హోరాహోరీగా జరిగిన పుర పోరులో పలుచోట్ల భార్యాభర్తలు గెలుపొందారు. జంటగా పుర, నగరపాలికల్లోకి అడుగుపెట్టనున్నారు. మరికొన్ని చోట్ల అత్తాకోడళ్లు, తండ్రీకుమారులు, తల్లీకుమారుడు గెలుపొందారు.
- ఫలించిన సీఎం వ్యూహం ఉత్కంఠ మధ్య సాగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ప్రాంతాల్లో విజయ దుందుభి మోగించి కాంగ్రెస్ పట్టు సాధించింది. నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచీ పార్టీ అత్యధిక వార్డులు, డివిజన్లలో నెగ్గడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది.
- ఒక్క ఓటు మ్యాజిక్ ‘పుర’ ఎన్నికల ఓట్లు లెక్కింపు ఉత్కంఠగా సాగింది. విజయం దోబూచులాడిన చోట్ల అభ్యర్థులు రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో అధికారులు తిరిగి ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో చాలామంది ఒక్క ఓటు తేడాతో తమ ప్రత్యర్థులపై విజయం సాధించారు.
- వరుస విజయాలతో కాంగ్రెస్‌లో జోష్.. వరుస విజయాలు కాంగ్రెస్‌లో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల ఫలితాలు, ఇప్పుడు నగర..
- మేయర్, ఛైర్‌పర్సన్ పదవులకు16న ఎన్నికలు తెలంగాణలో ‘పుర’ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవడంతో ఏడు నగరపాలక సంస్థల మేయర్లు, ఉప మేయర్లు, 116 పురపాలికల ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఈ నెల 16న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టింది.
- లక్షల మంది కార్యకర్తల శ్రమ ఫలితమిది ‘రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
- మాకు ఓట్లు పెరిగాయి పుర ఫలితాలతో తాము సంతృప్తికరంగా ఉన్నామని, తమకు ఓట్లు, సీట్లు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అన్నారు. చాలా చోట్ల కాంగ్రెస్, మజ్లిస్, భారాస ఒక్కటై భాజపా గెలవకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు.
- ‘తిరుగుబాటు’తో తడబాటు తమకు వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు సీటు కావాల్సిందేనని వారు పట్టుబట్టారు. ప్రధాన పార్టీలు ససేమిరా అనడంతో తిరుగుబావుటా ఎగురవేసి.. స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు.
- స్వీపర్‌గా పని చేసి..కౌన్సిలర్‌గా గెలిచి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురపాలికలో సుదీర్ఘకాలం స్వీపర్‌గా పనిచేసి 2019లో పదవీ విరమణ పొందిన ఇంజమూరి వెంకటమ్మ కౌన్సిలర్‌గా గెలిచి ఔరా అనిపించారు.
- పురపాలికల్లో కాంగ్రెస్‌కే పట్టం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 50 శాతానికిపైగా వార్డులతో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. మరో ఐదు మున్సిపాలిటీల్లో సగం వార్డులు సాధించింది.
- ఇక్కడా లెక్కింపు కోలాహలమే! కొత్తగూడెం నగరపాలిక ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద శుక్రవారం నెలకొన్న కోలాహలమిది. పాల్వంచ పట్టణంలోని అనుబోస్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటుచేయగా..
- కార్పొరేషన్లలో భారాసకు చుక్కెదురు రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల్లో భారత రాష్ట్ర సమితి (భారాస)కు చుక్కెదురైంది. ఎన్నికలు జరిగిన ఏడు కార్పొరేషన్లలోనూ పార్టీ నామమాత్రపు పోటీ ఇచ్చింది.
- పండుగ..సందడి హైదరాబాద్ శివారు బాట సింగారం మార్కెట్‌కు వివిధ రకాల పండ్లు తీసుకొచ్చిన వాహనాలతో జాతరను తలపిస్తున్న దృశ్యమిది.
- పార్టీల క్యాంప్ ఫైర్ రాష్ట్రవ్యాప్తంగా క్యాంపు రాజకీయాల హడావుడి మొదలైంది. ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాని మున్సిపాల్టీల్లో పీఠాలను దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల వ్యూహరచనతో రాజకీయాలు వేడెక్కాయి.
- నేడు అనధికారికంగా మంత్రివర్గ సమావేశం రాష్ట్రమంత్రివర్గం శనివారం సమావేశం కానుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
- బజ్జీల విక్రేత.. నేడు విజేత! నిన్నటిదాకా గుబిడే నాగుబాయి వేసే వేడివేడి బజ్జీలు తినడానికి ఇష్టపడ్డ జనం.. రేపట్నుంచి సమస్యలు పరిష్కరించమని కోరనున్నారు.
- కువైట్ ఫ్లైట్ దిగగానే.. ‘గోల్డెన్’ ఛాన్స్! స్థానిక నాయకులు సుదీర్ఘంగా వ్యూహాలతో.. భారీ ప్రచారాలతో చెమటోడ్చితే.. సయ్యద్ మహబూబ్‌అలీ మాత్రం కువైట్ నుంచి వచ్చీరాగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు.
- టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన జూ.అసిస్టెంట్ల నియామకానికి చర్యలు టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైన 1,309 మంది జూనియర్ అసిస్టెంట్లతో ఖాళీలను భర్తీ చేయనున్నందున ఆ పోస్టుల్లో ఒప్పంద, పొరుగుసేవల ద్వారా పనిచేస్తున్న వారిని తొలగించనున్నారు.
- ‘స్వతంత్రం’గానే హ్యాట్రిక్! నల్గొండ జిల్లా దేవరకొండ పురపాలికలో స్వతంత్ర అభ్యర్థి తాళ్ల శ్రీధర్‌గౌడ్ వరుసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్ సాధించారు.
English Translation

> my-3">
ACB: Huge whale in ACB net!

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE
Today, Hyderabad: Telangana Anti-Corruption Bureau (ACB) caught an expensive whale. ACB has arrested Mood Kishan, Deputy Commissioner (DTC) of Transport Department, Mahbubnagar, who was involved in embezzlement while working in the Transport Department. Teams led by ACB Hyderabad Range-2 DSP Sridhar conducted simultaneous searches at Kishan's house in Rajarajeshwari Nagar, Old Boinpally, Secunderabad and 11 other places across the state and seized cash, jewelry and key documents of illegal assets. In the searches conducted in the houses of his relatives and close friends in Mahbubnagar, Nizamabad and Sangareddy districts, a total of Rs 12.72 crore worth of immovables and movables were found. The value of these in the open market is estimated to be hundreds of crores of rupees. This is the first time in the history of Telangana ACB that such a huge amount of illegality has been exposed. Even though ACB has identified the illegal activities of Irrigation Department engineers, it is estimated that Kishan's assets are more than all of them. After the search ended on Tuesday, Kishan was arrested in the case of assets beyond his income and sent to judicial remand.
Documents in the relative's house..Jewelry in the pot market
Dramatic developments took place during the search. ACB officials knocked on the door of Kishan's house in Boinpally on Tuesday morning. According to reliable information.. At that time, Kishan stayed in the bathroom for some time. After he came out, the search started. As no property documents were found, the ACB officials became suspicious and inquired deeply. A document related to gold jewelery was found in Kishan's cellphone. It was a shop in the Secunderabad pot market, so they inquired. The ACB officials brought the gold ornaments to Kishan after the trader said that they had brought them to his shop the day before. Also, it was revealed during the investigation that he had gone to a relative's house the night before and handed over the property documents, so they were recovered and seized. Worked as motor vehicle inspector in Bodh. There he was in charge of the check post at Madnoor. He also worked as MVI in Nizamabad. In the latest searches, as the illegal goods were exposed in Nizamabad as well, it was revealed that they were accumulated in the early days. After that, Kishan, who worked as RTO of Medchal and Mehidipatnam and was promoted, went to Deputy Commissioner of Mahbubnagar less than a year ago.
Kishan's property list identified by ACB..
- 50 percent share in a famous luxury hotel in Nizamabad.
- A famous furniture store in Nizamabad running 3 thousand sq. The place is Kishan.
- 2 flats in Ashoka township, Nizamabad.
- 31 acres of agricultural land under Nizampet revenue of Sangareddy district. 4 thousand square feet polyhouse in Nizampet Mandal.
- 10 acres of commercial land under Nizamabad Corporation.
- Rs.1.37 crore bank balance.
- Kg of gold ornaments.
- Honda City car.. Innova Crysta car.
Note:Business advertisements appearing on Eenadu.net are different
It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/
OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. Correspondence has no place in this matter.
Patnam has 'cheyye'tti jai. The ruling party has so much power that it has 'captured' six out of seven corporations and more than three quarters of municipalities. Having captured more than 52 percent of the municipal wards... it is moving towards the supremacy of 'Peetha'.
Husband and wife won in many places in the city war that took place in the state. As a couple, they will enter the town and city administration. In some other places mother-in-law, father-son and mother-son won.