Chikadpally Techie Susmitha News

సాక్షి, హైదరాబాద్‌:నగరంలో డ్రగ్స్‌ దందా మరోసారి బయటపడింది. ఈసారి.. చిక్కడపల్లిలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్‌ను విక్రయిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

సుస్మిత అనే యువతి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తోంది. అయితే.. తన బాయ్ ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతోంది. ఈ క్రమంలో ముఠా గుట్టు రట్టు కావడంతో ఈ ప్రేమ జంట కటకటాల పాలైంది. 

సుస్మిత, ఇమాన్యుయెల్‌ సహా మొత్తం నలుగురి పోలీసులు అదుపులోకి తీసుకుని వాళ్ల నుంచి ఎండీఎంఏ, LSD బాటిళ్లు, ఓజీ కుష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షల దాకా ఉండొచ్చని అధికారులు తెలిపారు.


English Translation
Chikadpally Techie Susmitha News

Sakshi, Hyderabad:Drugs in the city. Danda is out once again. This time, the police arrested a software engineer who was selling drugs along with his boyfriend in Chikkadapally. According to the police..

A young woman named Sushmita is working as an engineer in a leading software company in the city. However.. she is running a drug gang with her boyfriend Immanuel. In this process, this love couple was put behind bars as the gang got involved. 

All four persons including Sushmita and Emmanuel were detained by the police and MDMA, LSD bottles and Ozy kush were seized from them. Officials said that the value of these could be up to Rs.4 lakh.