- కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్‌కర్నూల్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) :ఆహార భద్రత ప్రమా ణాలను పాటించని హోటళ్లు, రెస్టారెం ట్లు, షాపుల యజమానులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతో ష్ ఆహార ప్రమాణాల తనిఖీ అధికా రులను ఆదేశించారు. శనివారం కలె క్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ సమా వేశ మందిరంలో ఆహారభద్రత, ఆరోగ్యకరమైన ఆహారాలపై జిల్లాస్థాయి సలహా కమిటీ సమా వేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలోని ప్రైవే ట్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఇతర ఆహారం తయారు చేసే కేంద్రాల్లో నాణ్యత తని ఖీలు ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రభుత్వ వసతి గృహాలు, అంగ న్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న ఆహార వస్తువులు, వంటకు వినియోగిస్తున్న సరుకుల నాణ్యతను కూడా పరిశీలించాలన్నారు. ఈ స మావేశంలో అదనపు కలెక్టర్ పి.అమరేందర్, ఉమ్మడి జిల్లా ఆహార తనిఖీ అధికారి ఆనంద్ రావు, డీఈవో రమేష్‌కుమార్, డీఎంహెచ్‌వో డాక్టర్ రవికుమార్, డీటీడబ్ల్యూవో ఫిరంగి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీలత, నీలిమ పాల్గొన్నారు.
విద్యార్థులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేయాలి
నాగర్‌కర్నూల్, (ఆంధ్రజ్యోతి) :జాతీయ ర హదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలోని రహదారి భద్రత, రోడ్డు ప్రమాదాలు నివారించడానికి రోడ్డు సేఫ్టీ మాసంలో విద్యార్థు లను, ఉద్యోగులను, వివిధ సంస్థలను భాగస్వా మ్యం చేసేలా వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు-2026పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేందర్, ఎం. భగవత్, జాతీయ రహదారుల, ఆర్టీసీ, పోలీస్, వైద్యారోగ్యశాఖ అధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్లుతో హైదరాబాద్ నుంచి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి వీసీ హాల్ నుంచి ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, అదనపు కలెక్టర్ పి.అమరేందర్, ఆర్టీఏ నెంబరు గోపాల్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో గోపాల్‌నాయక్, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ పాల్గొన్నారు.