Ravi Mohan, Sreeleela At Parashakti Exhibition In Chennai

చెన్నై:శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్‌ మూవీ పరాశక్తి. ఇది ఆయన హీరోగా యాక్ట్‌ చేసిన 25వ చిత్రం. రవిమోహన్‌ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో అధర్వ కీలక పాత్ర పోషించారు. శ్రీలీల కథానాయిక. డాన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2026 జనవరి 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.

గురువారం సాయంత్రం చిత్ర ప్రత్యేక కార్యక్రమాన్ని చెన్నైలోని వళ్లువర్‌కొట్టంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరాశక్తి సినిమాకు సంబంధించిన ఫోటోలు, ఇతర వస్తువులతో ఎగ్జిబిషన్‌ను 'వరల్డ్‌ ఆఫ్‌ పరాశక్తి' పేరుతో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్‌ నాలుగు రోజులదాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

శివకార్తికేయన్‌ మాట్లాడుతూ.. పరాశక్తి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌ కుమార్‌కు 100వ సినిమా అన్నారు. తన 25వ చిత్రాన్ని వేరే కథతో చేయాలని భావించానన్నారు. అయితే నిర్మాత ఆకాశ్‌ భాస్కర్‌ పరాశక్తి కథను చేయండి అని చెప్పారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ మనల్ని 1960 కాలానికి తీసుకెళ్తుందన్నారు.

తానీ చిత్రం చేయడానికి కారణం దర్శకురాలు సుధా కొంగరనేనన్నారు. ఆమె 4 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ చిత్రకథ రాశారన్నారు. ఈ సినిమా చేయడమన్నది సవాల్‌తో కూడుకుందన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. పరాశక్తి తనకు చాలా ముఖ్యమైన సినిమా అన్నారు. రవిమోహన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఊరే మాట్లాడోతుందన్నారు. ఇందులో నటించడానికి ముందు సంకోచించానని, అయితే అందరూ ఎంతో శ్రమ పెట్టి పనిచేశారన్నారు.


English Translation
Ravi Mohan, Sreeleela At Parashakti Exhibition In Chennai

Chennai:Sivakarthikeyan in the lead role. The latest movie is Parashakti. This is his 25th film as a hero. Atharva played a pivotal role in Ravimohan as the antagonist. Srileela is the heroine. Sudhakongara is handling the story and direction of this big budget story film being produced by Dawn Pictures. The film, which has music by Anirudh, is all set to hit the screens on 14th January 2026.

A special event of the film was held at Valluvarkottam, Chennai on Thursday evening. In this event, an exhibition titled 'World of Parashakti' was organized with photos and other items related to the movie Parashakti. Organizers said that the exhibition will last for four days.

Sivakarthikeyan said.. Parashakti is the 100th film for music director Jeevi Prakash Kumar. He said that he thought of making his 25th film with a different story. But producer Akash Bhaskar said to do the story of Parashakti. He said that the exhibition organized here will take us back to the 1960s.

The reason for making the film is director Sudha Kongara. She said that she researched for 4 years and wrote this film. Making this film is challenging. Srileela said that Parashakti is a very important film for her. Ravimohan said that everyone is talking about this movie. He said that he hesitated before acting in this, but everyone worked hard.