Key Stress Factors in 2025 faces by Aviation sec­tor

భారత పౌర విమానయాన చరిత్రలో 2025వ సంవత్సరం ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది ఒకవైపు కుంభమేళా వంటి పండుగలతో ఆకాశమంత సంబరాన్ని చూసింది.. మరోవైపు ఘోర విమాన ప్రమాదాలు, సర్వీసుల రద్దుతో పాతాళమంత విషాదాన్ని మిగిల్చింది. అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశీయ ఏవియేషన్ రంగానికి ఈ ఏడాది ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.

కుంభమేళా మెరుపులు.. అంతర్జాతీయ గౌరవం

సంవత్సరం ప్రారంభంలో దేశీయ విమానయాన రంగం పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన కుంభమేళా విమానయాన రంగానికి ఊపునిచ్చింది. 45 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం విమాన సంస్థలు అదనపు విమానాలను నడిపాయి. దీనివల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ ట్రాఫిక్ 10.35 శాతం వృద్ధి సాధించింది.

మరోవైపు, 42 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) 81వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

ఎయిరిండియా విషాదం..

జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 (AI171) ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం అత్యంత విషాదకరం.

  • ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 చరిత్రలో ఇది తొలి ప్రమాదం. ఈ ఘటనతో డీజీసీఏ బోయింగ్ 787 విమానాలపై కఠిన తనిఖీలను ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానాల భద్రతపై పునసమీక్ష చేపట్టింది.

ఆర్థిక, ఇండిగో సంక్షోభం

విమాన ప్రమాదాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా విమానయాన సంస్థలను దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఒ‍క్క ఎయిరియండానే సుమారు రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అమెరికా, యూరప్‌ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన ఖర్చులు, సిబ్బంది భారం పెరిగిపోయింది.

ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఊహించని విధంగా ఉన్నపలంగా రద్దయ్యాయి. నవంబర్ మాసంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు నమోదైనప్పటికీ పైలట్ల కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఇండిగో ఏకఛత్రాధిపత్యం అనేది మార్కెట్ వైఫల్యాల వల్ల ఏర్పడిందే తప్ప, ఒక పద్ధతి ప్రకారం జరిగిన అభివృద్ధి కాదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భవిష్యత్తుపై ఆశలు

ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత విమానయాన రంగం కోలుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణ డిమాండ్ బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానయాన కంపెనీలు స్మార్ట్ భాగస్వామ్యాల ద్వారా వృద్ధి సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్‌ఐఏ) వంటి ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.

2025 సంవత్సరం భారత ఏవియేషన్ రంగానికి ఒక గట్టి హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం, పైలట్ల నిర్వహణలో వైఫల్యాలు, విదేశీ పరిణామాల ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.

ఇదీ చదవండి:కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ


English Translation
Key Stress Factors in 2025 faces by Aviation sector

2025 will be an unforgettable year in the history of Indian civil aviation. It will remain a chapter. This year, on the one hand, the sky saw celebration with festivals like the Kumbh Mela, but on the other hand, the underworld was left with sadness due to serious plane accidents and cancellation of services. The challenges and future developments of the domestic aviation sector, which is on the path of development, have become a topic of discussion this year.

Kumb Mela sparkles.. International respect

At the beginning of the year, the situation of the domestic aviation sector is very promising. The Kumbh Mela that started at Prayagraj on January 13 gave a boost to the aviation sector. Airlines operated extra flights for the 45-day celebration. This led to a growth of 10.35 per cent in domestic traffic during the January-March quarter.

On the other hand, India was proud to host the 81st Annual General Meeting of the International Air Transport Association (IATA) after a gap of 42 years. India has strengthened its position as the fastest growing market in the world.

Air India Tragedy..

The Air India Boeing 787 (AI171) accident on June 12 shocked the nation. This flight, which left from Ahmedabad to London, crashed shortly after take off. It is very tragic that only one of the 242 passengers survived.

  • This is the first accident in the history of Boeing 787 which is considered safe worldwide. Due to this incident, DGCA has ordered strict checks on Boeing 787 aircraft. Air India has undertaken a review of its aircraft safety.

Financial, IndiGo crisis

Apart from flight accidents, geopolitical conditions have also hit airlines. Due to the closure of Pakistan's airspace in the wake of Operation Sindoor, a single airline suffered a loss of around Rs.4,000 crore. Due to American and European flights having to travel long routes, fuel costs and staff burden have increased.

Indigo, the largest airline in the country, has unexpectedly canceled its services. Despite a record number of passengers registered in the month of November, hundreds of flights were canceled due to pilot shortage. Analysts point out that 'IndiGo's monopoly is a product of market failures and not a methodical development'.

Hope for the future

Despite these challenges, there is hope that the Indian aviation sector will recover. Experts point out that the travel demand in domestic flights is strong. Airlines are confident that they will grow through smart partnerships. Projects like Noida International Airport (NIA) are said to increase aviation capacity in the Delhi NCR region.

The year 2025 is a stark warning for the Indian aviation sector. Negligence in compliance with safety standards, failures in the management of pilots and the impact of foreign developments have plagued the sector. However, the construction of new airports and increasing travel demand are raising hopes for the future.

Read:Dhanalakshmi in the hands of a few