సంతబొమ్మాళి:రొయ్యల ఫీడ్‌ ధరలు తగ్గించాలని ఆక్వా రైతులు కోరారు. ఈ మేరకు స్టేట్‌ ఆక్వా ఫెడరేషన్‌ పిలుపుతో తహసీల్దార్‌ హేమసుందర్‌రావుకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఫీడ్‌ ధరలు విపరీతంగా పెరగడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగానికి విదేశీ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్నప్పటికీ, రైతులు మాత్రం నష్టాలను చవిచూస్తున్నారని వాపోయారు. ఫీడ్‌ ధరలతో పాటు సాగు ఖర్చులు భారీగా పెరిగినప్పటికీ.. రొయ్యల ధరలు మాత్రం తగ్గాయన్నారు. దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆక్వా రైతులు కెల్లి జగన్నాయకులు, పాల వసంతరెడ్డి, మేరుగు అప్పారావు, నక్క భీమారావు, జోగి రాములమ్మ, బి.మోహన్‌రెడ్డి, ఎం.నాగభూషణరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.


English Translation

Santabommali:Aqua farmers have asked to reduce shrimp feed prices. To this extent, a petition was handed over to Tehsildar Hemasunder Rao on Wednesday at the call of the State Aqua Federation. He expressed concern that we are facing severe financial difficulties due to the extreme increase in feed prices. Although there is a good demand for the aqua sector in the foreign market, the farmers complain that they are suffering losses. He said that despite the huge increase in the cost of cultivation along with feed prices, the prices of prawns have come down. Due to this, he expressed his grief that he was stuck in a swamp of debts. He asked the government to respond and help. Aqua farmers Kelli Jagannayakulu, Pala Vasantha Reddy, Merugu Apparao, Nakka Bhimarao, Jogi Ramulamma, B. Mohan Reddy, M. Nagabhushan Rao and Lakshmana Rao participated in the program.