GV Prakash, Anaswara Rajan Latest Film Lucky Now Streaming In This OTT Platform

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ ఇటీవల ఒక సూపర్‌ హిట్‌ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారనే చెప్పాలి. ఈయన సమీప కాలంలో కథానాయకుడిగా నటించిన బ్లాక్‌ మెయిల్‌ చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణనే పొందింది. తాజాగా జీవీ ప్రకాష్‌కుమార్‌ కథానాయకుడుగా నటించిన చిత్రం లక్కీ. నటి అనస్వర రాజన్‌ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని పుష్ప కందస్వామి నిర్మించారు. ఉదయ్‌ మహేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వినోదంతోపాటు ప్రేమ, ఫ్యామిలీ సెంటిమెంట్‌, సమకాలీన రాజకీయ అంశాలతో రూపొందింది. 

తప్పిపోయిన లక్కీ అనే ఒక కుక్క పిల్ల, ఒక ఆటిజం చిన్నారి చుట్టూ తిరిగే కథాంశంగా ఈ చిత్రం రూపొందింది. తప్పిపోయిన కుక్కపిల్ల ఒక రాజకీయ నాయకుడి చేతిలో చిక్కడంతో దాన్ని హీరో ఎలా రక్షించాడు అన్నదే లక్కీ చిత్రంలోని ప్రధాన అంశం.

నటి మేఘన సుమేష్‌, దేవదర్శిని ఇలంగో కుమరవేల్‌, ఉదయ్‌ మహేష్‌, సుబ్బు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రంలో నటి కోవై సరళ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్‌ల వాయిస్‌ చోటు చేసుకుంటుంది. మంచి కుటుంబ కథాచిత్రంగా రూపొందిన లక్కీ నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకొని గత 20వ తారీఖున నేరుగా జియో హాట్‌ స్టార్‌ ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తోంది.


English Translation
GV Prakash, Anaswara Rajan Latest Film Lucky Now Streaming In This OTT Platform

Music Director, Actor GV Prakash Kumar recently It should be said that they are waiting for a super hit movie. His recent film Blackmail, in which he acted as the protagonist, was well received by the audience. Lucky is the latest film starring Jeeves Prakashkumar. The film is produced by Pushpa Kandaswamy, starring actress Anaswara Rajan. Directed by Uday Mahesh, this film is made with entertainment along with love, family sentiment and contemporary political themes. 

The film revolves around a lost puppy named Lucky, an autistic child. Lucky movie is about how the hero rescues a lost puppy when it is caught by a politician.

Actress Meghna Sumesh, Devadarshini Ilango Kumaravel, Uday Mahesh, Subbu and others played the lead roles in this movie and the voice of actress Kovai Sarla, Tambiramaiah and Mottai Rajendran are featured in this movie. Lucky, which is a good family drama, is entertaining the audience on Jio Hot Star OTT on the 20th after completing its production.