తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్డు ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. హోల్ సేల్ మార్కె్ట్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.7:30 ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో రూ.8కి చేరింది. ఉత్పత్తి తగ్గడం వల్లే రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దాణా, మక్కలు, చేపపొట్టు ధరలు పెరగడంతోనూ ధర పెరిగినట్లు చెబుతున్నారు. కారణం ఏదైనా గుడ్డు కొనాలంటే సామాన్యుల నడ్డి విరిగే పరిస్థితి ఏర్పడింది.


Updated at - Dec 23 , 2025 | 12:59 PM