మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎన్నో వింతలు, అంతు చిక్కని రహస్యాలతో నిండి ఉంది. ఎంతో అభివృద్ధి చెందిన సైన్స్ కూడా కొన్ని సందర్భాల్లో సైలెంట్‌గా ఉండిపోవాల్సిందే. ఇండోనేసియాలోని మురాంగ్ కుటుంబం కథ తెలిస్తే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే. మురాంగ్ కుటుంబ సభ్యుల మొహాలు పగలు ఒకలా, రాత్రి అయితే మరోలా మారిపోతాయి. వారిని స్థానికులు బల్లులు అని భావిస్తారు. వారి కథ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు (mysterious family story).
ఇండోనేసియాలోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన సూర్య మురాంగ్ అనే వ్యక్తి 12 ఏళ్ల వయసు వచ్చే వరకు బాగానే ఉన్నాడు. అయితే 12 ఏళ్లు నిండిన తర్వాత అతడిలో వింతైన మార్పులు రావడం మొదలయ్యాయి. అతడి ముఖ కవళికలు మారడం ప్రారంభించాయి. కళ్ళు ఉబ్బిపోయాయి, చర్మం బిగుసుకుపోయి, ముఖం బల్లిలా మారిపోతుండేది. ఉదయం సాధారణ మనిషిలా ఉండే సూర్య మురాంగ్ రాత్రి అయ్యే సరికి వింతగా మారిపోయేవాడు. ఆ పరిస్థితి సూర్యకు మాత్రమే పరిమితం కాలేదు.. అతడి పిల్లలు కూడా అలాగే మారిపోయారు (unexplained transformation).
రాత్రి అయ్యే సరికి వారి ముక్కులు భిన్నమైన ఆకారంలోకి మారుతుండేవి. కొన్నిసార్లు వారి దవడలు పెద్దవి అయ్యేవి. మరి కొన్నిసార్లు వారి కళ్ళు పూర్తిగా బల్లుల తరహాలో మారిపోయేవి. సమీపంలో నివసించే ప్రజలు ఈ కుటుంబాన్ని చూసి భయపడేవారు. వీరు మనుషులు కాదని గ్రామంలో పుకార్లు వ్యాపించాయి. స్థానికులు వీరిని మనుషులుగా అంగీకరించడానికి ఇష్టపడరు. చాలా మంది స్థానికులు వీరితో మాటలు కూడా కలపరు (shocking viral story).
వైద్యులు వీరిని పరిశోధించి ఇదొక జన్యుపరమైన రుగ్మత అని తేల్చారు (science unsolved mystery). ఇది ముఖ ఎముకలు, చర్మం అసాధారణంగా మారిపోయే అరుదైన జన్యుపరమైన రుగ్మత కావచ్చునని నమ్ముతున్నారు. ఈ వ్యాధికి ఖచ్చితమైన పేరు ఇప్పటికీ లేదు. స్పష్టమైన చికిత్స కూడా లేదు. సైన్స్‌కు కూడా అందని అరుదైన వ్యాధి. అందుకే ఈ సమస్య నేటికీ ఒక రహస్యంగానే ఉండిపోయింది.
ఇవి కూడా చదవండి..
ప్రాణం కంటే రీల్ ముఖ్యమా.. ఈ అమ్మాయి ప్రమాదకర స్టంట్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..