ప్రస్తుతం దేశవ్యాప్తంగా డిజిటల్ షాపింగ్ జోరందుకుంది. ఓ మోస్తరు పట్టణాల్లో కూడా పలు ఈ-కామర్స్ సంస్థలు రకరకాల వస్తువులను ఇంటి వద్దకే డెలివరీ చేస్తున్నాయి. వీధుల్లో దొరికే చిన్న చిన్న వస్తువుల కోసం కూడా ఇన్‌స్టామార్ట్, జెప్టో వంటి వాటిని ఆశ్రయించే వారు వేలల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగం ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా వార్షిక నివేదికను వెల్లడించింది (Swiggy Instamart viral news).


ఈ నివేదిక ప్రకారం బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కనిష్టంగా రూ.10 చెల్లించి ప్రింటవుట్‌లు తెప్పించుకోగా, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ కోసం రూ.4.3 లక్షలు చెల్లించాడట. అలాగే చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో పలు సార్లు కండోమ్‌ల కొనుగోలు కోసం ఏకంగా లక్ష రూపాయలు వెచ్చించాడట. అలాగే ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్ ద్వారా రూ.15.16 లక్షలు విలువైన బంగారాన్ని కొనుగోలు చేశాడట. టైర్-2 నగరాల్లో కూడా ఇన్‌స్టామార్ట్ వ్యాపారంలో భారీ వృద్ధి నమోదైందట (Chennai man condoms purchase).


ఇక, ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎక్కువగా ఆర్డర్ చేసిన వస్తువుల జాబితాలో కరివేపాకు మొదటి స్థానంలో ఉందట (online grocery trends). కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ఈ ఏడాదిలో అత్యధికంగా 368 సార్లు కరివేపాకు కోసం ఆర్డర్ చేశాడట. కరివేపాకు తర్వాత స్థానాల్లో పెరుగు, గుడ్లు, పాలు, అరటిపళ్లు ఉన్నాయని ఇన్‌స్టామార్ట్ వార్షిక నివేదిక తెలిపింది. కాగా, రోజులో ఉదయం 7 నుంచి 11 గంటల మధ్యలో, సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్యలో ఎక్కువ ఆర్డర్లు వచ్చాడట.


ఇవి కూడా చదవండి..


మరిన్ని ప్రత్యేక వార్తలుకోసం క్లిక్ చేయండి..