Oke Okkadu: Special Story On Ys Jagan Political Journey

హస్తిన దురహంకారం తలవంచమంది. ఆయన ఆత్మాభిమానం అది జరగదంది. ఢిల్లీ గద్దలు అక్రమ కేసుల కుట్రలు పన్నారు. ఆయన ధీరత్వం లొంగేది లేదంది. స్కామ్‌లు, స్కీమ్‌ల్లో​ మునిగిన చంద్ర బాబు సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆయన ప్రజలకు ధైర్యం చెప్పడానికి అడుగేశారు. అప్పుడు మొదలైంది ప్రజా సంకల్ప యాత్ర. తమ కష్టాలను చెప్పుకుని ఆదుకోమంది అఖిలాంధ్ర జనసందోహం. ఆయన నేనున్నానని అభయం ఇచ్చారు. అప్పుడు పుట్టింది సరికొత్త చరిత్ర. నాడు బాబు కబంధ హస్తాల్లో గాడి తప్పిన పాలన.. బేలగా స్వాగతం పలికింది. ఆయన తొలి సంతకంతోనే సరిచేయడం మొదలుపెట్టారు.

అప్పుడు మొదలైంది రాజన్న తనయుడు జగనన్న జన రంజక పాలన. క్షుద్ర రాజకీయాన్నే నమ్ముకున్న కూటమి మళ్లీ గద్దెనెక్కి గంతులేస్తోంది. ఆయన.. దిక్కుతోచని ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అండ దండ అయ్యారు. అప్పుడు మొదలైంది మళ్లీ ఆటవిక పాలనపై జగన్ గర్జన. జనగర్జన. వ్యక్తిగా, పార్టీ అధినేతగా, ప్రభుత్వాధినేతగా, జన హృదయ నేతగా... ఆయన ప్రతి మలుపు లోనూ... ప్రతి గెలుపులోనూ, ప్రతి తలంపులోనూ ఉండేది ప్రజలే.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కడే. తోడేళ్ల గుంపు చేసే వికృత రాజకీయాలను నిప్పులతో కడుగుతోన్న ఒకే ఒక్కడు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి అవతల ఉన్నా.. తలవంచక తెలుగు పౌరుషాన్ని ప్రదర్శించిన ఒకే ఒక్కడు. కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి ప్రజాపాలనకి అర్థం చెప్పిన ఒకే ఒక్కడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించి.. అద్భుత పాలనా దక్షత ప్రదర్శించిన ఒకే ఒక్కడు. చంద్రబాబు ఆటవిక పాలనపై సమర గర్జన చేస్తోన్న ఒకే ఒక్కడు.  మనిషికి, మంచికి, మాటకి ఏమాత్రం విలువలేని రాజకీయాల్లో.. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళ్లే ఒకే ఒక్కడు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అండ దండ ఉంటే చాలని నమ్మిన.. మాట తప్పని, మడమ తిప్పని ఒకే ఒక్కడు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. దేశ రాజకీయాల్లో టార్చ్ బేరర్. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. ప్రయాణం మొదలు పెట్టాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అలవికాని కష్టాలను అనుభవించాడు. భరించాడు. ప్రజలకిచ్చిన మాట కోసం ఒక్కడే.. అక్రమ కేసుల కుట్రలను ఎదుర్కొన్నాడు. ఎదిరించాడు. మాట తప్పడమే, మాయ చేయడమే పాలిటిక్స్ అయిపోయిన ప్రస్తుత రోజుల్లో... మాట తప్పని రాజకీయాలను దేశానికి పరిచయం చేశాడు. ఆ ఒక్కడే.. వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగాడు. ఆ ఒక్కడే వ్యక్తి నుంచి మహా శక్తిగా ఎదిగాడు. ఆ ఒక్కడే...దేశమంతా అబ్బుర పడేలా జనరంజక పాలన చేశాడు. వైఎస్‌ జగన్‌కి ఇదంతా ఎలా సాధ్యమైంది? వైఎస్‌ జగన్‌.. ఇంతటి ప్రజాకర్షక నాయకుడు ఎలా అయ్యాడు? జగన్‌మోహన్‌ రెడ్డి ఇంతటి దార్శనికత కలిగిన పాలకుడుగా ఎలా నిలిచాడు ? ప్రశ్నలు చాలానే ఉన్నాయి. సమాధానం మాత్రం ఒక్కటే. జగన్.. జనమంతా తన వాళ్లు అనుకున్నాడు. జనమంతా.. జగన్ తమ వాడు అనుకున్నారు.

మాట తప్పని జగన్‌కి.. జనమే అండా దండా అయ్యారు. బాగోగులు పట్టించుకునే నాథుడు లేని జనానికి.. అన్నీ జగనే అయ్యాడు. నిజమైన నాయకుడు జనం కోసం ఎంత చేయగలడో జగన్ చేసి చూపించాడు. జగన్ గుండెల్లో జనం. జనం గుండెల్లో జగన్. ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఈ క్రమంలో ఎదురైన ఎన్నో కష్టాలను, నష్టాలను ప్రజలకిచ్చిన మాట కోసం చిరునవ్వుతో భరించాడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. జగన్‌ ప్రజలనే నమ్ముకున్నాడు. ఆ జనం నువ్వే మా నమ్మకం అని జగన్‌ని అక్కున చేర్చుకున్నారు. ఈ అనుబంధానికి 16 ఏళ్లు  దాటిపోయాయి.

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం. మహానేత ఇకలేడన్న నిజాన్ని దేశం జీర్ణించుకోలేకపోయింది. ప్రతి గుండె తల్లడిల్లిపోయింది. ఆ శోకాన్ని భరించలేని వందల గుండెలు ఆగిపోయాయి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణ వార్త విని తట్టుకోలేక  గుండెలు ఆగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నేనున్నానన్న భరోసా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆయన తనయుడు, ఎంపీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. అంతటి దు:ఖంలోనూ ఆయన ఆలోచనంతా ప్రజలతోనే. నల్లకాలువ సాక్షిగా ఓదార్పు యాత్ర చేస్తున్నట్టు ప్రకటించారు.

వైఎస్సార్ మరణంతో తట్టుకోలేక ఆరు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ల కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి, అంత బాధలోనూ ఓదార్పు యాత్ర ప్రారంభించార వైఎస్‌. జగన్ ఆ కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రెండు విడతల  యాత్రకు విశేష స్పందన రావడం పార్టీలో కొందరికి అసూయ కలిగించింది. అంతే..కొన్ని కాంగ్రెస్ కండువాలు కుతంత్రాలకు తెర తీశాయి. హస్తినకి లేనిపోనివి  నూరి పోశాయి. ఓదార్పు యాత్రని వెంటనే ఆపేయాలని ఢిల్లీ నుంచి ఆదేశం. మాట ఇచ్చాక వెనక్కి తగ్గితే ఆయన వైఎస్సార్ తనయుడు ఎందుకవుతాడు?. పదవుల కన్నా ప్రజలకు ఇచ్చిన మాటే ముఖ్యం. 10 జనపథ్‌కు తేల్చి చెప్పేశారు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

సుఖాలు, హోదాలు, పదవులు. వీటన్నింటన్ని కన్నా.. ఎన్ని కష్టాలొచ్చినా ఇచ్చిన మాట మీద నిలబడాలని తన తండ్రి నేర్పిన పాఠాన్ని గుండెల్లో దాచుకున్న తనయుడు.. ప్రజల కిచ్చిన మాటకే కట్టుబడి ఉండాలని నిర్ణయిం చుకున్నారు. ఓదార్పు యాత్రని యాథావిధిగా కొనసాగించారు. అటు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలను చీల్చే రాజకీయాలకు పదును పెట్టింది. అదే సమయంలో జగన్ ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతే.. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలకు తెర తీసింది. చంద్ర బాబుతో కుమ్మకై అక్రమ కేసులు పెట్టించింది. దీంతో తనను నమ్ముకున్న ప్రజల కోసం, తండ్రి లక్ష్య సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు జగన్‌మోహన్‌రెడ్డి

కడప లోక్‌సభ నుంచి జగన్ వైఎస్సార్సీపీ తరపున అఖండ మెజార్టీతో విజయం సాధించారు. ఇచ్చిన మాట కోసం ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడిన జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు జేజేలు పలికారు. దీంతో... కాంగ్రెస్ నుంచి వైఎస్సార్సీపీలోకి రావడానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. అయితే.. పదవులకు రాజీనామా చేసిన వాళ్లకు మాత్రమే వైఎస్సార్సీపీలోకి ఆహ్వానిస్తానని తేల్చి చెప్పారు జగన్. రాజకీయాల్లో నైతిక విలువలు కాపాడే బాధ్యత తీసుకున్నారు.

18 మంది  ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీకి, తమ పదవులకు రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. దీన్ని కాంగ్రెస్ అధిష్టానం సహించలేకపోయింది. అవకాశం కోసం కాచుకుని చూసింది. ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో ఉన్న జగన్‌ను విచారణకి అని పిల్చి సీబీఐతో అరెస్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. జగన్‌ని అణగదొక్కితే దారికొస్తారని తప్పుడు లెక్కలేసింది. తలదించేది లేదన్నారు జగన్. ఉప ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని భారీ మెజార్టీతో గెలిపించారు ప్రజలు. తామంతా వైఎస్‌ జగన్‌ వెనకే ఉన్నామని ఉప ఎన్ని కల సాక్షిగా తేల్చి చెప్పారు.

ఈ దేశంలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉన్నప్పుడు.. దాన్ని భర్తీ చేయడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. పాలకుల మీద ప్రజావ్యతిరేకత పెరిగినప్పుడు.. దాన్ని క్యాష్ చేసుకోవడానికి పుట్టిన రాజకీయ పార్టీలున్నాయి. కులాల కేంద్రంగా పుట్టుకొచ్చిన పార్టీలున్నాయి. ఒక రాజకీయ పార్టీ తన ప్రయోజనాల కోసం సృష్టిస్తే.. ప్యాకేజీ కోసం బానిసిజం ప్రదర్శించే పార్టీలున్నాయి. కానీ.. ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే.. ప్రజలకిచ్చిన మాటని నిలబెట్టుకునే క్రమంలో పుట్టింది. ఇచ్చిన మాటని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదన్న చిత్తశుద్ధి నుంచి పుట్టుకొచ్చింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా...మడమ తిప్పకూడదన్న దృఢ నిశ్చయం లోంచి పుట్టుకొచ్చింది. మాట తప్పితే వచ్చే అధికారం వద్దని.. 2014లో ప్రతిపక్షంలోనే కూర్చున్న వైఎఎస్‌ జగన్‌.. దేశంలోని రాజకీయ పార్టీలకు కొత్త పాఠాలు నేర్పారు.

2014 ఎన్నికలు.. జగన్ని సింగిల్‌గా ఎదుర్కొనే దమ్ము లేక.. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జగన్ని ఢీకొట్టే ప్రయత్నం చేశాయి. ప్రజలనే నమ్ముకున్న జగన్ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగారు. ప్రజలను మోసం చేయడంలో మాస్టర్స్ చేసిన చంద్రబాబు.. 6 వందలకు పైగా అలవి కాని హామీలను ప్రకటించి.. భ్రమలు కలిగించారు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా మోదీ మ్యానియా హల్‌చల్‌ చేస్తోన్న సమయం అది. రైతు రుణ మాఫీ హామీ ఇస్తే.. అధికారంలోకి రావడం ఖాయమని జగన్‌తో ఆయన శ్రేయోభిలాషులు చెప్పారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. రైతు రుణమాఫీ చేసే స్థితిలో రాష్ట్ర ఆదాయం ఉండదు. హామీ ఇస్తే అధికారం వస్తుంది. కానీ.. మాట తప్పడం ఎలాగో, ప్రజలను మోసం చేయడం ఎలాగో జగన్‌కి తెలీదు. అందుకే.. మాట తప్పితే అధికారంలోకి వస్తామని తెలిసినా.. ప్రజలను వంచించి అందుకునే అధికారం వద్దంటూ రైతు రుణ మాఫీ హామీ ఇవ్వలేదు వైఎస్‌ జగన్‌. 2014 ఎన్నికల్లో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది వైఎస్సార్సీపీ. ఒంటరిగా పోటి చేసినా 67 అసెంబ్లీ స్థానాల్లో, 8 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించింది. మాట తప్పడం, ప్రజలను మభ్య పెట్టడం ఇష్టం లేక అధికారాన్ని సైతం వదలుకున్న జగన్.. జన హృదయాలను మాత్రం సంపూర్ణంగా గెలుచుకున్నారు. 

తొలి రోజు నుంచే ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాటం మొదలుపెట్టారు వై.ఎస్. జగన్. రైతులను, డ్వాక్రా మహిళ లను రుణాల మాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ... ప్రజల పక్షాన ఉద్యమించారు.  ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమబాట పట్టారు. నాటి సీఎం చంద్రబాబు కమీషన్ల కోసం ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టి.. ప్రత్యేక ప్యాకేజీకి జై కొట్టాడు. ఏపీ భవిష్యత్తుని చీకట్లోలోకి నెట్టాడు. దీన్ని నిరసిస్తూ వైఎస్ జగన్ భారీ ఎత్తున ఉద్యమించారు. జగన్ను బలహీనపర్చాలనే కుట్రలో భాగంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీశారు. ప్రజాస్వా మ్యాన్ని వెక్కిరిస్తూ.. 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు.. వారిలో కొందరిని క్యాబినెట్‌లోకి కూడా తీసుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వై.ఎస్.జగన్.. ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

స్కామ్లు చేస్తూ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగడం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు...పూర్తిగా ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని గాలికి వదిలేశారు. దీంతో...ప్రజలకు ధైర్యం చెప్పడానికి, వాళ్ల కష్టాలు, సమస్యలు తెలుసు కోవడానికి ప్రజాసంకల్ప పాదయాత్ర మొదలుపెట్టారు తమ కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తోన్న జగన్ని చూసి జనం చలించిపోయారు. జనం కోసం జగన్ కదిలితే.. జగన్ కోసం జనం పోటెత్తారు. తమ కష్టాలను కళ్లారా చూడటానికి, కన్నీళ్లు తుడవడానికి తమ ఊరికొచ్చిన రాజన్న బిడ్డని దీవించడానికి... జనం కెరటాల్లా ఎగసిపడ్డారు. కోట్ల మందికి భరోసా ఇవ్వడానికి ఒక్క జగన్. ఆ ఒక్కడిలో తమ అన్నని, కొడుకుని, మనవడుని, మామయ్యని చూసుకుని మురిసిపోయారు కోట్ల మంది ప్రజలు. రావాలి జగన్. కావాలి జగన్. ఈ పాట తెలుగు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పాట మాత్రమే కాదు. సోషల్ మీడియా లో భాషలకు అతీతంగా, దేశాలకు అతీతంగా నెటిజన్స్ని ఫిదా చేసిన పాట. నిజానికి రావాలి జగన్. కావాలి జగన్ అన్నది ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన నినాదం. చంద్రబాబు రాక్షస పాలనలో అల్లాడుతోన్న కోట్ల మంది ప్రజల హృదయాంతరాల నుంచి వెల్లువలా ఎగసిపడిన నినాదమే రావాలి జగన్. కావాలి జగన్. తర్వాత కాలంలో ఆ నినాదమే పాటగా మారింది. 

ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం అయిన వెంటనే...నాటి చంద్రబాబు ప్రభుత్వం విషం కక్కింది. ముద్దుల యాత్ర అంటూ చంద్రబాబు తన వంకర బుద్ధిని ప్రదర్శించారు. స్వచ్ఛంధంగా వచ్చిన జనం కాదన్నారు. తమ పాలనలో జరుగుతోన్న అభివృద్ధిని జగన్ చూడలేకపోతున్నారంటూ పైత్యాన్ని  ప్రదర్శించారు. కానీ...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం తన లక్ష్య సాధన దిశగా దూసుకుపోయారు. నాడు జగన్ మనసులో ఉన్నది ఒక్కటే. ప్రజలకు భరోసా ఇవ్వాలి. చంద్రబాబు అవినీతి పాలనలో, దుష్టపాలనలో నలిగిపోతున్న వారికి అండగా నిలవాలి. భవిష్యత్తు మీద వారికి ఆశ పోనివ్వకూడదు. వాళ్ల కోసం ఏం చేయాలో పూర్తిగా తెలుసుకోవాలి. ఆ దిశగానే ప్రజా సంకల్ప యాత్ర కదిలింది. వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 13 జిల్లాల మీదుగా 134 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో 2,516 గ్రామాలను తాకుతూ 341 రోజులపాటు 3,648 కి.మీ. మేర కొనసాగింది. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. దేశవ్యాప్తంగా చరిత్ర సృష్టించింది. 

2014 ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి బరిలోకి దిగిన జనసేన...2019 ఎన్నికల్లో టీడీపీని మళ్లీ గెలిపించడం కోసం కొత్త కుట్రలు పన్నింది. చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చే కుతంత్రాలు చేసింది. ఎవరెన్ని వంచనలు చేసినా ఏపీ ప్రజలు మాత్రం తమకు, తమ రాష్ట్రానికి ఎవరు కావాలో ఒక నిర్ణయానికి వచ్చేశారు. 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపిం చారు. 22 లోక్సభ స్థానాలిచ్చారు. టీడీపీకి తన చరిత్రలోనే ఎన్నడూ చూడనంత దారుణమైన ఓటమిని రుచి చూపించారు. చంద్రబాబు అడుగులకు మడుగులొత్తే పవన్ కళ్యాణ్ని రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి సంక్షేమంలో, అభివృద్ధిలో ఏపీని దేశానికి ఆదర్శంగా నిలపెట్టడం మీద దృష్టి పెట్టారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. అప్పటి దాకా జగన్లో ప్రజలు ఆదర్శవంతమైన నాయకుడుని చూశారు. సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక ఆయనలో అద్భుతమైన పాలకుడుని, దార్శనికుడుని చూశారు దేశ ప్రజలు. 

ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు ఆలంబనగా నిలిచాడు. కరోనా రక్కసి వణికించినా అదరలేదు. సంస్కరణల పేరుతో తమ నడ్డి విరిచిన పాలకులను చూసి చూసి వేసారిన ప్రజల కోసం... సంక్షేమంలోనే సంస్కరణలు తెచ్చాడు. అభివృద్ధి పేరుతో తమ కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టిన పాలకులను చూసి బెంబేలెత్తిన ప్రజలకు.. నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించాడు. పాల కులకు, ప్రజలకు మధ్య ఏర్పడిన దూరాన్ని చెరిపేశాడు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ పరుగులు పెడుతోన్న ఏపీని చూసి దేశమంతా అబ్బురపడి చూసేలా చేశాడు. జనరంజక పాలన అంటే ఎలా ఉంటుందో ఐదున్నర కోట్ల మంది ప్రజలకు అనుభవంలోకి తీసుకొచ్చాడు. 2019 నుంచి 2024 మధ్య వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సాగించిన పాలన...ఏపీకి స్వర్ణయుగం మాత్రమే కాదు. ప్రజల కోసం, భవిష్యత్తు తరాల కోసం, ఏం చేయాలో, ఎలా చేయాలో పాలకులకు పాఠాలు చెప్పింది జగన్‌ పాలన.

దశాబ్దాలుగా విజనరీ ముసుగులో తెలుగు ప్రజలను మోసం చేస్తూ వచ్చిన నయవంచకుడు నారా చంద్రబాబు నాయుడు. అసలు విజన్ అంటే ఏంటో...దార్శనికత అంటే ఏంటో తన పాలనతో చూపిం చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఏపీ ఖజానా లో ఉన్న సొమ్ము కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే. ఐదేళ్ల పాటు స్కామ్ల స్కీమ్లతో లక్షల కోట్ల రూపా యల ప్రజాధనాన్ని దిగమింగిన చంద్రబాబు ఘనకార్యాల ప్రతిఫలం అది. అలాంటి అత్యంత క్లిష్టపరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ పరిస్థితుల చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్న వేళే.. కరోనా దాడి చేసింది.

ప్రపంచాన్ని కోవిడ్ మహమ్మారి వణికిస్తున్నపుడు... దేశం యావత్తూ భయాందోళనలు నిండి, ఆసు పత్రులలో బెడ్లు సైతం దొరక్క విలవిలలాడి నప్పుడు... అందరికీ ఒక దిక్సూచిలా కనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. పక్క రాష్ట్రాల నుంచి కోవిడ్ రోగులు సైతం నిబంధనలను గాలికొదిలేసి...మరీ ఏపీకి వచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడకు వస్తే...ఇక భయం లేదని ప్రతి ఒక్కరూ భరోసా ఫీలయ్యారంటే కారణం... జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థలు... పాలనను ప్రజలు ముగింటకి తీసుకువెళ్లాయి. పూజ్య బాపూజీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని వాలంటీర్ వ్యవస్థతో  సాకారం చేశారు జగన్.

సంక్షేమం మీద దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం కాదు. డవలప్మెంట్ మీద ఫోకస్ పెడితే సంక్షేమ పథకాలు అమలు చేయడం కుదరదు. దశాబ్దాలుగా దేశంలో పాతుకుపోయిన ఇలాంటి సిద్ధాంతాల నడ్డి విరగ్గొట్టిన పాలకుడు జగన్మో హన్ రెడ్డి. సంక్షేమ పథకాలు అనగానే దేశం మొత్తానికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకొచ్చేలా చేశారు జగన్ అభివృద్ధి అనగానే దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేశారు జగన్. ఐదేళ్ల పాలనలో...జగన్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి..., జగన్ ప్రారంభించిన విప్లవాత్మక మార్పుల గురించి..,జగన్ సాధించిన విజయాలు గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉద్యోగాల కల్పన, సామాజిక న్యాయం, ఇలా చెప్పు కుంటూ పోతే ఆ జాబితాకి అంతే ఉండదు. సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలు చేరే సమయంలో... లంచాలకు తావు లేకుండా, ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి డీబీటీ ద్వారా రూ.2 లక్షల 70 వేల కోట్లు జమ చేసిన పాలకుడు వైఎస్‌ జగన్‌

తన పాలనతో జగన్ గ్రామాల స్వరూపాన్నే మార్చేశారు. 31 లక్షల ఇంటి స్థలాలను పంపిణీ చేశారు. 22 లక్షల ఇళ్లు నిర్మించారు. 73 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు. డిజిటల్ క్లాస్రూమ్స్ని తీసుకొచ్చారు.  నవరత్నాల నుంచి మొదలు పెడితే... అవినీతికి తావులేని స్వచ్ఛ మైన పారదర్శక పాలన వరకు... జగన్ మోహన్ రెడ్డి పాలన...అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. జగన్ పాలనలో ఆంధ్రప్ర దేశ్ ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. సంక్షేమాన్ని, అభివృద్ధిని కలిపి పరుగులు పెట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇలా చేతల్లో, అంకెల్లో చూపించిన ఏకైక పాలకుడు జగన్మోహన్ రెడ్డి.

ఐదేళ్ల పాలనలో ఒక్కో రైతుకు పెట్టుబడి సాయంగా రూ.67,500 అందజేశారు జగన్మోహన్ రెడ్డి. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్ జగన్ అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సున్నా వడ్డీ రాయితీని ప్రతి ఏటా క్రమం తప్పకుండా జమ చేశారు. విత్తు నుంచి విక్రయం వరకు గ్రామస్థాయిలో రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు సచివాలయాలకు అనుబంధంగా  ఆర్బీకేలు నెలకొల్పారు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా 2019-24 మధ్య ఐదేళ్లలో అన్నదాతలకు ఏకంగా రూ.1 లక్షా 88 వేల 541 కోట్ల మేర ప్రయోజనాన్ని వైఎస్ జగన్ చేకూర్చారు. 

2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 1923లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నవి కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే. అయితే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. జగన్ పాలనలోనే ఏడు మెడికల్ కాలేజీలు సిద్ధమైయ్యాయి. ఐదు మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలైయ్యాయి. మరో 10 మెడికల్ కాలేజీల నిర్మాణం చాలా వరకు జగన్ పాలనలోనే  పూర్తి అయింది. అలానే...వైజాగ్ని ఐటీ కారిడార్గా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన బీచ్ ఐటీ కాన్సెప్ట్తో...ఇన్ఫోసిస్, టెక్ మహేంద్రా, హెచ్సీఎల్, రాండ్స్టాడ్, అమెజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజర సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి పునాదులు జగన్ పాలనలోనే పడ్డాయి. 

ఉద్యోగ కల్పనలోనూ జగన్ అద్భుతాలు చేశారు. 2014 నుంచి ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా ? కేవలం 34 వేలు మాత్రమే. మరి...వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల తన పాలనలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలు సా ? 6 లక్షల 31 వేల 906. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. జగన్ పాలనలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి అయోగ్ తన నివేదికలో స్పష్టం చేసింది.  

కాలం కఠినమైంది. ఐదున్నర కోట్ల మంది ప్రజలకి విషమ పరీక్ష పెట్టింది. 2024లో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే అరాచకత్వానికి సరికొత్త నిర్వచనం చెబుతూ...ఆటవిక పాలన మొదలుపెట్టారు. ప్రజారంజక పాలనకి నిర్వచనం చెబుతూ జగన్ పాలన సాగిస్తే...ప్రజాకంటక పాలనకి సరికొత్త అర్థం చెబుతూ చంద్ర బాబు ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసింది. అటు అభివృద్ధి లేదు. ఇటు సంక్షేమం లేదు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఏం చేస్తున్నారో తెలీదు. ఎన్నికల హామీల అమలు లేదు. అన్ని వర్గాల ప్రజలు కష్టాలక డలిని ఈదే దుస్థితి ఏర్పడింది. పాలకులే పగ పడితే దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోన్న కోట్ల మంది ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అండగా నిలిచారు. నేనున్నాన్న భరోసా అందిస్తున్నారు. ప్రజాకంటక పాలన పై సమరశంఖం పూరించారు.


English Translation
Oke Okkadu: Special Story On Ys Jagan Political Journey

His pride is that it will not happen. Delhi hawks hatched illegal cases. His courage is unyielding. Chandra Babu's government, which is immersed in scams and schemes, has undermined public welfare. He asked people to take courage. Then the Public Sankalp Yatra started. People who support themselves by telling about their hardships are the people of Akhilandhra. He assured me that I am there. Then a new history was born. Nadu Babu Kabandha's failed rule.. received a warm welcome. He started correcting it with his first signature.

Then began the reign of Jagananna Jana, the son of the king. The alliance that believed in occult politics is again in the thick of things. He.. became a pillar of support for five and a half crore people who were disoriented. Then Jagan's roar against Atavika's rule began again. The crowd As a person, as a party leader, as a government leader, as a leader of people's hearts... his every turn... in every victory and in every thought was the people.

YS Jaganmohan Reddy is one and only. He is the only one who is washing the perverted politics of the wolf pack with fire. The most powerful person in the country is beyond.. the only one who has shown headstrong Telugu manhood. He is the only one who fulfilled the aspirations of crores of people and explained the meaning of public administration. He is the only one who has shown excellent governance by promoting welfare and development. Chandrababu is the only one who is fighting against the wild rule.  He is the only one who will go to any extent for the word given in politics where man, good and word are of no value. He is the only one who believes that God's blessings and people's support is enough. He started traveling only for the promise given to the people. Only for the word given to the people.. He suffered unaccustomed hardships. endured He faced conspiracies of illegal cases only for his word to the people. resisted In the current days when politics is all about falsehood and deception... he introduced the politics of falsehood to the country. That alone.. He grew from a person to a system. He grew from a single person to a great power. That's the only thing... he ruled the nation to the amazement of the whole country. How is all this possible for YS Jagan? How did YS Jagan become such a popular leader? How did Jagan Mohan Reddy become such a visionary ruler? There are many questions. The answer is only one. Jagan.. He thought all the people were his people. All the people.. Jagan thought they were theirs.

Jagan who was wrong. For people who don't have a Nath who cares for their well-being.. He has become everything. Jagan showed how much a true leader can do for the people. People in Jagan's hearts. Jagan in people's hearts. All this did not happen easily. YS Jaganmohan Reddy endured many hardships and losses in this process with a smile for his promise to the people. Jagan believed in the people. Jagan was included in the sister saying that you are our belief. 16 years have passed since this association.

YS Rajasekhar Reddy died. The nation could not digest the fact that the great leader was no more. Every heart fluttered. Unable to bear that grief, hundreds of hearts stopped. Late Chief Minister Y.S. Rajasekhar Reddy's son, MP YS Jaganmohan Reddy decided to give assurance to the families whose hearts stopped and lost their lives after hearing the news of Rajasekhar Reddy's death. In all the sorrow, his thoughts are with the people. It was announced that Nallakaluva was doing a condolence trip as a witness.

More than six hundred people lost their lives because of the death of YSR. To give courage to their families, YS started a consolation journey in such pain. Jagan assured those families. The special response to the two-phased trip made some in the party jealous. That's it.. some Congress scarves have opened the curtain to the machinations. The things that are not in the hands are poured out. Order from Delhi to stop the consolation trip immediately. Why is he YSR's son if he backtracks after giving his word? People's words are more important than positions. 10. YS Jagan Mohan Reddy told Janpath. Above all this, the son, who had hidden in his heart the lesson of his father to stand on his word no matter how difficult it was, decided to stick to the word of the people. The consolation journey continued as usual. And the Congress party has sharpened the politics of tearing apart families. At the same time, Jagan resigned from the post of MP and the party. That's it.. The Congress leadership has lifted the curtain on the conspiracies. Illegal cases were filed in collusion with Chandra Babu. Jagan Mohan Reddy founded the YSR Congress Party for the people who believed in him and to achieve the goals of his father. People applauded Jaganmohan Reddy, who was ready to bear any hardship for his promise. With this... MPs and MLAs queued up to join YSRCP from Congress. However, Jagan has decided to invite only those who have resigned from their positions to join the YSRCP. 18 MLAs, one MP resigned from the Congress party and joined the YSRCP. Congress leadership could not tolerate this. She waited for an opportunity. The by-election campaign is going on in full swing. The Congress leadership arrested Jagan with the CBI asking for investigation. It miscalculated that if Jagan is undermined, he will get lost. Jagan said there is nothing to worry about. People won 15 MLAs and one MP with a huge majority in the by-elections. They said that they are all behind YS Jagan as a witness.

When there is a political vacuum in this country, there are political parties born to fill it. When the anti-people rise against the rulers.. there are political parties born to cash it. There are parties that have emerged as centers of caste. If a political party is created for its own interests.. there are parties that show slavery for the package. But.. only one YSRCP.. was born in order to keep the word given to the people. It was born from the sincerity of not breaking the word under any circumstances. No matter how many challenges you face, no matter how many difficulties surround you...it is born from the determination not to turn your back. There is no power that comes if the word is broken.. YAS Jagan who sat in the opposition in 2014.. taught new lessons to the political parties of the country.

2014 elections.. They did not have the guts to face Jagan alone.. TDP, BJP and Jana Sena tried to defeat Jagan as a coalition. Jagan, who believed in the people, entered the ring alone. Chandrababu, who is a master in deceiving people.. announced more than 600 false promises.. created illusions. That was the time when Gujarat was a model center of development and Modi mania was making waves across the country. Jagan's well-wishers told Jagan that if he guarantees farmer loan waiver, he will come to power.

Newly formed state. There is no state revenue in the case of farmer loan waiver. Power comes with assurance. But.. Jagan does not know how to mislead and deceive people. That's why YS Jagan didn't guarantee farmer loan waiver saying that he doesn't have the power to deceive people and get them, even though he knows that he will come to power if he doesn't get his word. In the 2014 elections, the YSRCP lost power by a margin of just five lakh votes. YSRCP won 67 Assembly seats and 8 Lok Sabha seats even if contested alone. Jagan, who did not want to miss the word and mislead the people or even gave up power, won the hearts of the people completely. 

Y.S. started fighting on behalf of the people as the opposition leader from the first day. Pics Farmers and Dwakra women protested Chandrababu's fraud in the name of loan waiver... they mobilized on behalf of the people.  They started a movement to achieve special status. The then CM Chandrababu pledged special status to the Center for commissions. He pushed AP's future into darkness. YS Jagan protested this on a large scale. As part of the conspiracy to weaken Jagan, Chandrababu opened the door to buy YSRCP MLAs. Chandrababu bought 23 YSRCP MLAs mocking Prajaswa man and took some of them into the cabinet. YS Jagan boycotted the assembly meetings. Praja Sankalpa Padayatra was launched.

Chandrababu, who focused on depleting lakhs of crores of public money by doing scams...completely left public welfare and development to the winds. With this... to give courage to the people, to know their difficulties and problems, they started Praja Sankalpa Padayatra. If Jagan moves for the people, people pour for Jagan. People came out like waves to bless their king's child who had come to see their troubles and wipe their tears. One picture to reassure crores of people. Millions of people were shocked to see their elder brother, son, grandson and uncle in that one person. Jagan should come. Need pictures. This song is not the only song that has created a sensation in Telugu politics. It is a song that has captivated netizens across languages ​​and countries on social media. In fact, Jagan should come. "We want Jagan" is a slogan born from the hearts of the people. Jagan should come up with the slogan that rose like a flood from the hearts of crores of people who are reeling under Chandrababu's monster regime. Need pictures. Later that slogan became a song. 

As soon as the Praja Sankalpa Yatra started...the then Chandrababu government got poisoned. Chandrababu showed his crooked mind by saying Muddla Yatra. It is not the people who came voluntarily. Jagan showed bitterness that he could not see the progress being made under his rule. But...Y.S. Jaganmohan Reddy has moved towards achieving his goal. There was only one thing in Jagan's mind. People should be reassured. Chandrababu should stand by those who are suffering under the corrupt rule and misrule. They should not lose hope for the future. You should know what to do for them. It was in that direction that the public opinion movement moved. YS Jagan's Praja Sankalpa Padayatra covered 3,648 km for 341 days touching 2,516 villages in 134 legislative constituencies across 13 districts. Continued. This created a stir in the politics of the state. History has been created across the country. 

Jana Sena, which entered the ring with Chandrababu Babu in 2014 elections, has hatched new conspiracies to make TDP win again in 2019 elections. Chandrababu has made conspiracies to split the anti-government vote. No matter how many deceptions have been done, the people of AP have come to a decision about who they want for themselves and their state. YSRCP won 151 assembly seats with more than 50 percent votes. 22 Lok Sabha seats. TDP has tasted the worst defeat in its history. Pawan Kalyan, who is at the feet of Chandrababu, was soundly defeated in two places. From the moment he took oath as Chief Minister, YS Jaganmohan Reddy focused on making AP an ideal for the country in terms of welfare and development. Until then, people saw Jagan as an ideal leader. When Jagan took charge as CM, the people of the country saw him as an excellent ruler and visionary. 

He supported the aspirations of five and a half crore people. Even though Corona Rakkasi trembled, he could not take it. He brought reforms in welfare for the people who were fed up with the rulers who broke their lives in the name of reforms. He showed the people who were upset by seeing the rulers blindfolded with graphics in the name of development, what real development is. He erased the distance between the Pala caste and the people. He made the whole country to see AP running in welfare and development. He made five and a half crore people experience what democratic governance is like. YS Jaganmohan Reddy's rule from 2019 to 2024 was not only a golden age for AP. Jagan's regime taught the rulers what to do and how to do it for the sake of the people and the future generations.

Nayavanchaku Nara Chandrababu Naidu, who has been deceiving the Telugu people under the guise of a visionary for decades. YS Jaganmohan Reddy showed what real vision is...what vision is with his rule. By the time Jagan took charge as the second chief minister of Andhra Pradesh, the amount in the AP treasury was only one hundred crore rupees. That is the reward of Chandrababu's exploits for five years with scam schemes amounting to lakhs of crores of rupees. When Jagan, who took over the reins of government in such a difficult situation, was trying to improve the situation...Corona attacked.

When the world was shaken by the Covid epidemic... when the whole country was filled with fear and even beds were not available in the hospitals... Andhra Pradesh was seen as a compass for everyone. The situation can be understood if the covid patients from the neighboring states also flouted the rules and came to AP. If it comes here... everyone feels assured that there is no more fear... because of the measures taken by Jagan's government. The volunteer system, the secretariat systems...ruled the people to the hilt. Pujya Bapuji's dream of village swaraj was realized by Jagan with the volunteer system.

Development is not possible if we focus on welfare. Welfare schemes cannot be implemented if the focus is on development. Jaganmo Han Reddy was the ruler who broke the hold of such ideologies which had been rooted in the country for decades. Jagan made the whole country remember Andhra Pradesh through welfare schemes and Jagan made the whole country look back towards Andhra Pradesh when it came to development. Days are not enough to talk about the reforms brought by Jagan..., about the revolutionary changes initiated by Jagan..., about the achievements of Jagan. Education, health, welfare, development, investment, employment generation, job creation, social justice, the list goes on and on. At the time when the benefits of welfare schemes are reaching the people... the ruler YS Jagan who deposited Rs. 2 lakh 70 thousand crores through DBT directly into the accounts of the beneficiaries without any recourse to bribes and without disturbing the self-esteem of the people, changed the appearance of Jagan's villages with his rule. 31 lakh house plots were distributed. 22 lakh houses were built. 73 thousand crore rupees have changed the face of government schools. English medium was introduced. Digital classrooms have been introduced.  Starting from Navaratna... to pure and transparent governance without corruption... Jagan Mohan Reddy's rule... became an example for many states. Andhra Pradesh became a major industrial destination during Jagan's rule. Jaganmohan Reddy is the only ruler who has shown in hands and numbers what it means to run welfare and development together.

Jaganmohan Reddy gave Rs.67,500 as investment assistance to each farmer during his five-year rule. The free crop insurance scheme implemented by YS Jagan has become an ideal for the country without burdening the farmers. The zero interest subsidy is credited regularly every year. RBKs have been set up in association with secretariats to support farmers at the village level from seed to sale. Through various schemes and programs, YS Jagan has provided a benefit of Rs. 1 lakh 88 thousand 541 crores to the rice donors in the five years between 2019-24. 

When the YSRCP government came to power in 2019, it started building 17 medical colleges at once with funds of more than Rs.8 thousand crores. Andhra Medical College was established in the united Andhra Pradesh region in 1923. From then till 2023, only 11 medical colleges in the state are fully in the public sector. However, YS Jagan has undertaken the construction of 17 government medical colleges at the same time, which is unprecedented in the history of hundred years. Seven medical colleges were prepared during Jagan's regime. Classes have also started in five medical colleges. The construction of 10 more medical colleges was mostly completed during Jagan's rule. Also...Vyzagni was developed as IT Corridor by Jaganmohan Reddy. With the Beach IT concept brought by the Jagan government... Infosys, Tech Mahendra, HCL, Randstad, Amazon and other IT and IT related giants have stepped towards Visakhapatnam. The foundations for setting up Adani Google Data Center were laid during Jagan's rule. 

Jagan has also done wonders in job creation. Do you know how many jobs were given by Chandrababu during his five-year rule from 2014? Only 34 thousand. And... Do you know how many jobs YS Jaganmohan Reddy created during his five-year rule? 6 Lakh 31 Thousand 906. Since the formation of Andhra Pradesh State on 1st November 1956 till YS Jagan Mohan Reddy became CM, 17 Chief Ministers ruled the Telugu states. Jagan showed what those 17 CMs could not do. NITI Aayog itself has made it clear in its report that during Jagan's rule, poverty has reduced more in AP than in all other states in the country.  

Times are tough. Five and a half crore people were tested. Chandrababu became the Chief Minister again in 2024. From the moment he came to power, he gave a new definition to anarchy...he started to rule wildly. If Jagan's rule defines democratic governance...Chandra Babu's government has implemented the Red Book Constitution, giving a new meaning to democratic governance. There is no development. There is no welfare here. I don't know what they are doing with the debts of lakhs of crores of rupees. No implementation of election promises. People from all walks of life are suffering and this is the predicament. Jaganmohan Reddy stood by crores of people who are in a state of confusion if the rulers take revenge. I am assured. Samarashankham has filled in on public governance.