గుంతకల్లు(అనంతపురం):క్రిస్మస్‌, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అజ్మీర్‌-యల్హంక ప్రత్యేక రైలు (09601) ఈ నెల 20, 27, తేదీల్లో (శనివారాల్లో) రాత్రి 8-15 గంటలకు అజ్మీర్‌లో బయల్దేరి ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకు యల్హంకకు చేరుకుంటుందన్నారు. బెంగళూరు-అజ్మీర్‌ ప్రత్యేక రైలు (09602) ఈ నెల 22, 29 తేదీల్లో (సోమవారాలలో) బెంగళూరు(Bengaluru)లో రాత్రి 10 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 5-05 గంటలకు అజ్మీర్‌కు చేరుకుంటుందన్నారు.


zzzz.jpg

ఈ రైలు యల్హంక, ధర్మవరం, తాడిపత్రి(Tadipatri), గుంతకల్లు, వాడి, కలబురగి, షోలాపూర్‌, కురుద్వాడి, డౌండ్‌, పూనా, లోనావాలా, కల్యాణ్‌, వసాయ్‌ రోడ్డు, వాపి, వల్సాద్‌, సూరత్‌, వడోదర, రట్లాం, శ్యాంఘర్‌, భవానీ మండి, రాంగంజ్‌ మండి, కోట, సవాయి మధోపూర్‌, దుర్గాపూర, జైపూర్‌, క్రిష్ణ్‌ఘర్‌ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Read LatestTelangana NewsandNational News