హైదరాబాద్, డిసెంబర్ 20:నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ బిగ్ షాక్ ఇచ్చారు. ఒకేసారి 80 మంది సిబ్బందిని బదిలీ చేశారు. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ర్యాంక్ అధికారులందరినీ అటాచ్ చేశారు. కొందరు అధికారులు టాస్క్‌ఫోర్స్ డిపార్ట్‌మెంట్ కొన్నేళ్లుగా పాతుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో టాస్క్‌ఫోర్స్ అధికారులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక నిందితుడిని తప్పించినందుకు భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ విభాగంపై సీపీ స్పెషల్ ఫోకస్ పెట్టారట. టాస్క్‌ఫోర్స్ విభాగం ప్రక్షాళనకే సీపీ ఈ నిర్ణయం తీసుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు బిగ్ షాక్..